
కర్ణాటక: రెండు నెలల క్రితం వివాహమైన యువతి భర్త స్నేహితునితో పరారైన ఘటన బెంగళూరులో జరిగింది. రాజరాజేశ్వరినగరకు చెందిన రమేశ్‌కు రెండు నెలల క్రితం ఓ యువతితో పెళ్లయింది. కొత్త సంసారం సాఫీగా సాగుతోంది. అయితే ఈ నెల 12న ఉదయం రమేశ్ స్నానం చేయడానికి వెళ్లాడు. ఇంతలో నవ వధువు బట్టలు, డబ్బులు సర్దుకుని బాత్ రూం, ఇంటికి తాళం వేసుకొని స్నేహితునితో కలిసి వెళ్లిపోయింది.
అతి కష్టం మీద బయటకు వచ్చిన రమేశ్ జరిగిన విషయాన్ని ఆర్‌ఆర్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు కార్తీక్‌తో వెళ్లిపోయిందని తెలిపాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment