రేపు శశికళ లొంగిపోయే అవకాశం! | Jaya niece Deepa, Panneerselvam tributes to Jaya | Sakshi
Sakshi News home page

రేపు శశికళ లొంగిపోయే అవకాశం!

Published Tue, Feb 14 2017 9:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

రేపు శశికళ లొంగిపోయే అవకాశం!

రేపు శశికళ లొంగిపోయే అవకాశం!

చెన్నై :
గోల్డెన్ బే రిసార్ట్‌ నుంచి పోయేస్‌ గార్డెన్‌కు వీకే శశికళ వెళ్లిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించిన విషయం తెలిసిందే. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది.  దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అన్నది లేకుండా పోయింది. రేపు(బుధవారం) బెంగళూరులో శశికళ లొంగిపోయే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరో వైపు తమిళనాడులోని మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్దకు మంగళవారం రాత్రి పన్నీర్‌ సెల్వం బృందం చేరుకుంది. ఈ సందర్భంగా పన్నీర్‌ సెల్వం గ్రూప్లో జయ మేనకోడలు దీప చేరారు. పన్నీర్ సెల్వం, దీప, పొన్నయన్లు జయ సమాధి వద్ద నివాళులర్పించారు.

శశికళ కేసు.. మరిన్ని కథనాలు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement