ప్రజలకు కావాల్సింది 'అమ్మ' వారసులు | Kethireddy fires on shashikala | Sakshi
Sakshi News home page

ప్రజలకు కావాల్సింది 'అమ్మ' వారసులు

Published Tue, Feb 14 2017 9:38 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

ప్రజలకు కావాల్సింది 'అమ్మ' వారసులు

ప్రజలకు కావాల్సింది 'అమ్మ' వారసులు

చెన్నై :
ముఖ్యమంత్రి కావాలనుకున్న శశికళ ప్రయత్నానికి కోర్టు తీర్పు అడ్డు తగలడంతో తన వారసునిగా ఎడపాడి కె పళనిస్వామిని ప్రకటించడంపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఏఐఏడీఎంకే పార్టీకి, ప్రజలకు కావాలిసింది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసులు కానీ, శశికళ వారసులు కాదని ఎద్దేవా చేశారు.


ప్రజలు కోరుకుంటున్న అమ్మ వారసుడు పన్నీర్‌ సెల్వానికి శాసన సభ్యులు మద్దతు తెలపాలని కోరారు. ప్రజలు కోరుకుంటున్న అమ్మ వారసుడు పన్నీర్‌ సెల్వంకి మద్దతు తెలపకపోతే శాసన సభ్యులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని, జల్లికట్టు తరహాలో మరో ఉద్యమం మొదలు అయ్యే అవకాశం ఉందని కేతిరెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement