పన్నీర్‌ సెల్వంకు మద్దతు తెలిపిన కేతిరెడ్డి | jagadishwar reddy Kethireddy called on panneerselvam | Sakshi
Sakshi News home page

పన్నీర్‌ సెల్వంకు మద్దతు తెలిపిన కేతిరెడ్డి

Published Sat, Feb 11 2017 8:40 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

పన్నీర్‌ సెల్వంకు మద్దతు తెలిపిన కేతిరెడ్డి

పన్నీర్‌ సెల్వంకు మద్దతు తెలిపిన కేతిరెడ్డి

చెన్నై:
ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వానికి తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. కేతిరెడ్డి శనివవారం ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో పన్నీరు సెల్వంను కలిశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తాను చేసిన న్యాయపోరాటం, ప్రజా ఉద్యమాలను వివరించారు. అదే విధంగా కేంద్రప్రభుత్వాన్ని జయలలిత మరణం వెనుక దాగి ఉన్న కుట్రలను వెలికితీయడాకి సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన విషయాన్ని పన్నీరు సెల్వం వద్ద ప్రస్తావించారు.

జయలలిత ఆశయాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం గురించి కేతిరెడ్డి వివరించారు. అంతేకాకుండా తమిళనాడులోని తెలుగువారి సమస్యలను పన్నీర్‌ సెల్వం  దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని కేతిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement