పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు! | supreme court agreed to examine the cash for vote MLAs sting case | Sakshi
Sakshi News home page

పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!

Published Wed, Jul 5 2017 11:57 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు! - Sakshi

పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జయలలిత మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి.

ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాగా  పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్‌ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement