Edappadi K Palanisamy
-
జ్యోతిష్యం ఫలిస్తుంది!
సాక్షి, చెన్నై: జ్యోతిష్యం ఫలిస్తుందని, 2026లో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సేలంలో జరిగిన పార్టీ నేతల సమావేశానంతరం పళణిస్వామి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమిలో పొగచిచ్చుగా మారడం ఖాయం అన్నారు. 41 నెలల డీఎంకే పాలనలో నోరెత్తని కూటమి పారీ్టల నేతలు ఇప్పడు విమర్శలు గుప్పించడాన్ని ప్రతిఒక్కరూ పరిగణించాలన్నారు. ఈ పరిణామం చీలిక కాదా అని ప్రశ్నించారు. పళని స్వామి జ్యోతిష్కుడు అయ్యాడని సీఎం వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వాస్తవమే జ్యోతిష్యం ఫలిస్తుందని 2026లో రాష్ట్రంలో అధికారం అన్నాడీఎంకే గుప్పెట్లోకే అని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే తమిళనాడు అవినీతిలో ముందంజలో ఉందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో యువత రావాలని, యువతను ఆకర్షించే కార్యక్రమాలు విస్తృతంచేయనున్నట్టు పేర్కొన్నారు. పళణికి నోటీసులు.. పళణిస్వామికి మద్రాసు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గతంలో సినీ నిర్మాత జాఫర్ సాధిక్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని డీఎంకేపై పళణిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరుకు కళంగం తెచ్చే విధంగా వ్యవహరించారని ఆయనపై డీఎంకే సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ రూ.కోటి పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి టికారాం విచారించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పళణిస్వామికి నోటీసులు జారీ చేశారు. -
పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయలలిత మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
అడ్డంగా దొరికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. జయ మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు పన్నీర్ సెల్వం కోటి నగదు ఆఫర్ చేశారు. పళనిస్వామికి మద్దతిచ్చేందుకు శశికళ ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నగదుతో పాటు బంగారం ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిదక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ స్వయంగా కెమెరా సాక్షిగా చెప్పడం గమనార్హం. తనకు రూ.6 కోట్లు ఇస్తామన్నారని కెమెరా సాక్షిగా ఎమ్మెల్యే శరవణన్ పెదవి విప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తనియవరసు, కరుణసు, ఏకే బోస్‌లకు రూ.10 కోట్లు ముట్టాయని ఆయన వెల్లడించారు. కాగా అప్పట్లో కూవత్తూర్ గోల్డ్ బే రిసార్ట్స్ సాక్షిగా చిన్నమ్మ ...ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించారు. ఆ శిబిరం నుంచి శరవణన్ మారువేషంలో తప్పించుకుని వచ్చారు. తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీఎం పదవికి పన్నీర్ సెల్వం అడ్డం తిరగడంతో మొదలైన తమిళ రాజకీయ సంక్షోభం చివరకు ప్రలోభాల వరకూ దారి తీయడం సంచలనం రేపుతోంది. పళనిస్వామి వర్గం ఇస్తామన్న నగదు ఇవ్వకపోవడం వల్లే ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శరవణన్ చెప్పిన విషయాలు వాస్తవమా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.