tamilnadu politcis
-
పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి తెలుగులోనూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది 'వారసుడు', 'లియో' సినిమాలతో అలరించిన విజయ్.. ప్రస్తుతం 'ద గోట్' అనే మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల ముందు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2026లోని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు పార్టీ పేరులో స్వల్ప మార్పు చేశారు. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) దళపతి విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ పేరు 'తమిళగ వెట్రి కళగం'. ఇందులోనే తప్పు దొర్లినట్లు తమిళ మేధావుల సూచించారు. ఈ మేరకు స్వల్ప మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళంలో అదనంగా 'క్' అనే అక్షరాన్ని జోడించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల కమిషన్‌లో ఇదే పేరుతో రిజిస్టర్ చేశారు. కానీ తమిళగ వెట్రి కళగంని ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళగ వాల్వురిమై కట్చి తదితర కొన్ని చిన్న పార్టీల పేర్లు కూడా ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. ఇదే టైంలో విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండటం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మేధావుల నిర్ణయం మేరకు.. తమిళగ వెట్రి కళగం పేరులో 'క్' అనే అక్షరాన్ని జోడించారు. దీంతో ఇకపై 'తమిళగ వెట్రిక్ కళగం' అని పిలవాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
రజనీ కోసం ఆ ముగ్గురు..
తమిళసినిమా: దక్షిణాది సినిమానే కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కమలహాసన్, రజనీకాంత్ చుట్టూనే తిరుగుతున్నాయన్నది వాస్తవం. వీరిలో కమలహాసన్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. నిర్మాణంలో ఉన్న విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చేయనున్నట్లు ప్రకటించినా ఇండియన్ 2 చిత్రాలనే ఆయన నుంచి ఆశించవచ్చు. ఇక రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి. ఆయన త్వరలోనే పార్టీ జండా, అజెండాలను వెల్లడించే సమయం ఆసన్నమైంది. రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న విషయం తెలిసిందే. శంకర్ ఈ చిత్రాన్ని నభూతోనభవిష్యత్ అనే విధంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. ఇక రజనీకాంత్ మరో చిత్రం చేస్తారా, 2.ఓ చివరి చిత్రం అవుతుందా? అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేశారు. సూపర్‌స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం తమ చిత్రాలను పట్టాలెక్కించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. యువ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజారాణి, తెరి, మెర్శల్ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ఇక మరో వర్థమాన దర్శకుడు మణికంఠన్ కాక్కాముట్టై చిత్రంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఇద్దరూ రజనీకాంత్ కోసం కథలను సిద్ధం చేసి ఆయనకు వినిపించారు కూడా. మరో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్ కూడా సూపర్‌స్టార్ కోసం బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారట. అట్లి, కేవీ.ఆనంద్ రాజకీయ ఇతివృత్తంతో కథలను తయారు చేయగా కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణకంఠన్ వ్యవసాయం నేపథ్యంలో కథను రెడీ చేశారట. ఈ మూడు కథలు రజనీకాంత్‌ను ఇంప్రెస్ చేశాయని, వీరిలో ఏవరికి ఆయన పచ్చజెండా ఊపుతారన్నది ఆసక్తికరంగా మారిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయలలిత మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
అడ్డంగా దొరికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. జయ మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు పన్నీర్ సెల్వం కోటి నగదు ఆఫర్ చేశారు. పళనిస్వామికి మద్దతిచ్చేందుకు శశికళ ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నగదుతో పాటు బంగారం ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిదక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ స్వయంగా కెమెరా సాక్షిగా చెప్పడం గమనార్హం. తనకు రూ.6 కోట్లు ఇస్తామన్నారని కెమెరా సాక్షిగా ఎమ్మెల్యే శరవణన్ పెదవి విప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తనియవరసు, కరుణసు, ఏకే బోస్‌లకు రూ.10 కోట్లు ముట్టాయని ఆయన వెల్లడించారు. కాగా అప్పట్లో కూవత్తూర్ గోల్డ్ బే రిసార్ట్స్ సాక్షిగా చిన్నమ్మ ...ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించారు. ఆ శిబిరం నుంచి శరవణన్ మారువేషంలో తప్పించుకుని వచ్చారు. తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీఎం పదవికి పన్నీర్ సెల్వం అడ్డం తిరగడంతో మొదలైన తమిళ రాజకీయ సంక్షోభం చివరకు ప్రలోభాల వరకూ దారి తీయడం సంచలనం రేపుతోంది. పళనిస్వామి వర్గం ఇస్తామన్న నగదు ఇవ్వకపోవడం వల్లే ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శరవణన్ చెప్పిన విషయాలు వాస్తవమా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.