Sting operation
-
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
హైదరాబాద్ లో పెరిగిన పబ్ కల్చర్
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల్లో అక్రమ వసూళ్లు
-
ఇంట గెలిచి రచ్చ గెలిచింది
కొందరు ఇంట గెలుస్తారు. కొందరు రచ్చ గెలుస్తారు. కొందరే ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌ను గెలిచింది. అందంతో నటనతో గెలిచింది. అందుకే దక్షణాది భాషల వారికి ఫేవరెట్‌గా నిలిచింది.సాహో తర్వాత పెద్ద సినిమాల నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 2005. ఇండియా టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో శక్తి కపూర్ పట్టుబట్టాడు. సినిమా అవకాశాల కోసం ఔత్సాహిక నటి వేషంలో ఉన్న టీవీ యాంకర్‌ను లైంగిక అవసరం తీర్చమని అతడు అడిగే వీడియో దేశమంతా సంచలనం రేపింది. శక్తికపూర్ భయభ్రాంతం అయ్యాడు. గగ్గోలు పెట్టాడు. ఇండియా టీవీ వారిని నానా తిట్లు తిట్టాడు. అతడు పదే పదే చెప్పిన మాట ఒక్కటే ‘మీరు చేసిన ఈ పనికి నేను నా కూతురికి ఎలా ముఖం చూపించాలి. అది నన్ను చంపేస్తుంది’ అని. ఆ కూతురే శ్రద్ధా కపూర్ అప్పటికి ఆమె వయసు 20 సంవత్సరాలు. తండ్రి అంటే ఆమెకు చాలా ఇష్టం. ‘అందాజ్ అప్నా అప్నా’లో అతడు వేసిన పాత్ర ‘క్రైమ్ మాస్టర్ గోగో’ను గుర్తు చేసుకుంటూ తండ్రిని ‘గోగో’ అని పిలుస్తూ ఉంటుంది. అలాంటి తప్పిదం/లేదా అతని చుట్టూ అల్లిన ట్రాప్ వల్ల శ్రద్ధా కపూర్ కుటుంబం బజారున పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలని పెద్దలు అంటారు. తండ్రి కోల్పోయిన చోటే తాను గెలిచి చూపించాలని శ్రద్ధా కపూర్ అనుకుంది. చూపించింది కూడా. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. శక్తి కపూర్ అప్పట్లో డేవిడ్ ధావన్ సినిమాల్లో ఎక్కువగా నటించేవాడు. అలా శక్తికపూర్ కూతురు శ్రద్ధా, డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ షూటింగులు చూడ్డానికి వెళ్లేవారు. కాని ఇద్దరికీ సినిమా రంగంలో వస్తున్నట్టు అప్పటికి తెలియదు. శ్రద్ధాకపూర్ సైకాలజిస్ట్ కావాలనుకుంది. ముంబైలో అమెరికన్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నప్పుడు 96 శాతం మార్కులు తెచ్చుకుంది. అప్పుడే కాలేజ్‌లో నాటకం వేసింది శ్రద్ధా. ఆ వేడుకకు హాజరైన సల్మాన్ ఖాన్ ఆమె నటన చూసి హీరోయిన్ వేషం ఆఫర్ చేశాడు. కాని ‘నాకు చదువుకోవాలని ఉంది’ అని చెప్పి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లిపోయింది. అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడే శక్తికపూర్ ఉదంతం చోటు చేసుకుంది. శక్తికపూర్ పంజాబీ. అతని స్వస్థలం న్యూఢిల్లీ. శక్తికపూర్ భార్య ‘శివాంగని కొల్హాపురి’ పండిత వంశం నుంచి వచ్చింది. ఆమె తండ్రి పండరినాథ్ కొల్హాపురి శాస్త్రీయ గాయకుడు. చెల్లెలు పద్మిని కొల్హాపురి నటి. గాయని లతా మంగేష్కర్ వీరికి పండరినాథ్ వైపు నుంచి దగ్గరి బంధువు అవుతుంది. అయితే శ్రద్ధాకపూర్ తండ్రి వైపు నుంచి కంటే తల్లివైపు బంధువులతోనే బాల్యం నుంచి గడిపింది. తనను తాను ఒక మరాఠి స్త్రీగానే భావిస్తుంది. శక్తికపూర్ చేసిన తప్పు తన కుటుంబాన్ని, బంధువర్గాన్ని అసౌకర్యంలో పడేసిందని ఆమె భావించింది. సైకాలజిస్ట్ కావాలనుకున్న శ్రద్ధాకపూర్ నటి అవుదామని తీర్మానించుకుంది. బాలీవుడ్లో ఒక రివాజు ఉంది. మనకున్న పలుకుబడి అంతా కెమెరా ముందు వరకూ తీసుకెళ్లి నిలబెడుతుందికానీ కెమెరా ముందు ప్రతిభ మాత్రం మనమే చూపాలి. అది చాలా బాగా ఉండాలి. లేకుంటే వెనక్కు పంపించేస్తారు. శ్రద్ధాకపూర్ ఎంతైనా ఒక హీరో కూతురు కాదు. విలన్ కూతురు. అందునా చెడ్డ పేరు మూటగట్టుకున్న విలన్ కూతురు. ఆమె జీరో నుంచి మొదలుకావాల్సిందే. అలాగే అయ్యింది. చాలా ఆఫీసులకు ఆడిషన్స్ ఇవ్వడానికి తిరిగింది. చివరకు ఆమెకు ఒక ఉమన్ డైరెక్టరే బాసటగా నిలిచింది. టీవీ రంగంలో పేరు తెచ్చుకుని బాలీవుడ్లో సినిమాలు తీస్తున్న లీనా యాదవ్ తన ‘తీన్ పత్తీ’ సినిమాలో శ్రద్ధాను సైన్ చేసింది. కాని ఆ సినిమా ఫ్లాప్. కొందరు మాత్రం ఈ అమ్మాయి ఎవరో బాగా చేసింది అని ఒకరిద్దరికి చెప్పారు. దాంతో యశ్‌రాజ్ ఫిల్మ్వారు పిలిపించి మూడు సినిమాలకు సైన్ చేయించారు. తొలి సినిమాగా ‘లవ్ కా ది ఎండ్’ సినిమాలో హీరోయిన్ వేషం ఇచ్చారు. కాని ఆ సినిమా కూడా ఫ్లాప్. రెండు సినిమాల ఫ్లాప్ తర్వాత ఒక హీరోయిన్ పరిస్థితి కష్టమే అవుతుంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారు ఆ తర్వాత ‘ఔరంగజేబ్’ (అర్జున్ కపూర్ హీరో) సినిమాలో వేషం ఆఫర్ చేశారు. కాని ఇక్కడే శ్రద్ధా కపూర్ ఒక మలుపు తిరిగే నిర్ణయం తీసుకుంది. ఔరంగజేబ్ ఆఫర్ సమయంలోనే మహేష్ భట్ కాంపౌండ్ నుంచి ‘ఆషికీ2’ ఆఫర్ వచ్చింది ఆమెకు. ఇదో లేక అదో. కాని శ్రద్ధా యశ్రాజ్వారికి సర్దిచెప్పి ‘ఆషికీ2’ చేసింది. ప్రియుడి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టే గాయని పాత్రలో శ్రద్ధా నటన జనానికి నచ్చింది. ఆ సినిమా పాటలు ఇంకా నచ్చాయి. సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో శ్రద్ధా కపూర్ రాత్రికి రాత్రి స్టార్డమ్కు చేరుకుంది. 18 కోట్లతో తీసిన ‘ఆషికీ 2’ 175 కోట్లను వసూలు చేసిందంటే ఆ క్రేజ్ తాలూకు వాటా శ్రద్ధా కపూర్‌కు కూడా దక్కింది. అయితే శ్రద్ధా కపూర్‌కు డాన్స్ అంటే ఆసక్తి ఉంది. మంచి డాన్స్ సినిమా చేయాలనే ఆమె కోరికను రెమో డిసూజా దర్శకత్వంలో వచ్చిన ‘ఏబిసిడి2’ తీర్చింది. ప్రభుదేవా నటించిన ఆ సినిమాలో శ్రద్ధాకపూర్ తన ప్రతిభ చాటి తాను డాన్సింగ్ స్టార్ కూడా అని నిరూపించుకుంది. ఆ తర్వాత ‘భాగీ’, ‘రాక్ఆన్’ సినిమాలన్నీ ఆమె కెరీన్కు మేలు చేస్తూ వచ్చాయి. సౌత్‌లో హిట్ అయిన ‘ఓకే బంగారం’ రీమేక్ ‘ఓకే జాను’లో శ్రద్ధా హీరోయిన్గా నటించిది. దావుద్ ఇబ్రాహీమ్ చెల్లెలు హసీనా పార్కర్ బయోపిక్ ‘హసినా పార్కర్’లో నటించడంతో తన భుజాల మీద ఒక సినిమాను నిలబెట్టగలననే నమ్మకం బాలీవుడ్‌కు కల్పించింది. ‘స్త్రీ’ సినిమా సూపర్ హిట్ కావడం, ‘సాహో’ వంటి భారీ సినిమాలో నటించడంతో శ్రద్ధాకపూర్ బాలీవుడ్ తార నుంచి భారతీయ తారగా ఎదిగింది. శ్రద్ధాకపూర్‌కు ఇంగ్లిష్ భాష మీద మంచి పట్టు ఉంది. దేశదేశాల వారు ఇంగ్లిష్ భాషను ఎలా మాట్లాడతారో నకలు దింపుతుంది. ఆమెకు నాలుగు పశువులను పెట్టుకొని, సొంతగా కూరగాయలు పండించుకుంటూ విశ్రాంతిగా ఉండాలని కోరిక. ఆ పని భవిష్యత్తులో చేస్తానని కూడా చెబుతుంది. రోజూ డైరీ రాయడం, తన ఆలోచనలను రాస్తూ వెళ్లడం టీనేజ్ నుంచి చేస్తూనే ఉంది. శ్రద్ధా కపూర్ తన తాత నుంచి తల్లి నుంచి వారసత్వంగా సంగీతాన్ని పొందింది. చాలా సినిమాలలో పాటలు పాడింది. శ్రద్ధాకపూర్ ఇవాళ బాలీవుడ్లో గౌరవపూర్వకంగా తలిచే పేరు అయ్యింది. తండ్రి శక్తికపూర్ ఆమెను చూసి గర్వపడుతున్నాడు. శ్రద్ధా కపూర్ ప్రచండకాంతిలో అతడి మరక కనపడకుండా పోయింది. శ్రద్ధాకపూర్ రాబోయే రోజులలో ప్రేక్షకులు తల ఎత్తి చూసే పనులు తప్పక చేస్తుంది. చేయాలని ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
అతడిని పట్టించిన కందిరీగలు
ఓల్డెన్‌బర్గ్ : సాధారణంగా నేరస్తులను పట్టుకోవటానికి ‘‘స్టింగ్ ఆపరేషన్’’ చేస్తుంటారు. పక్కాగా ఓ పథకం ప్రకారం నేరగాడ్ని వల వేసి పట్టుకోవటం ఈ స్టింగ్ ఆపరేషన్ ప్రత్యేకత. కానీ, జర్మనీలో చోటుచేసుకున్న స్టింగ్ ఆపరేషన్ మాత్రం ఇందుకు భిన్నమైనది. జైలు నుంచి పారిపోతున్న ఖైదీని పట్టుకోవటానికి కందిరీగలు ‘‘స్టింగ్’’ ఆపరేషన్ చేశాయి(యాదృచ్ఛికంగా). వివరాల్లోకి వెళితే.. జర్మనీ ఓల్డెన్‌బర్గ్‌లోని ఓ జైలు నుంచి 32 ఏళ్ల ఓ ఖైదీ తప్పించుకున్నాడు. జైలు బాల్కనీలోంచి నేరుగా కందిరీగలు ఉన్న తెట్టెపైకి దూకాడు. దీంతో ఆగ్రహానికి గురైన కందిరీగలు అతడ్ని వెంటాడి కుట్టడం ప్రారంభించాయి. నొప్పి తాళలేక అతడు వీధుల్లో పరుగులు పెట్టసాగాడు. అయినప్పటికి అవి అతడ్ని వదలలేదు. ఇక చేసేదేమీ లేక అతడు అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్ స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి తలదాచుకున్నాడు. ఖైదీని వెంటాడుతూ వచ్చిన పోలీసులు పూల్ దగ్గర అతడ్ని పట్టుకున్నారు. ‘‘స్టింగ్’’ ఆపరేషన్‌తో ఖైదీని పట్టించిన కందిరీగలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. -
పనామా పేపర్లు : మళ్లీ సంచలనం
న్యూఢిల్లీ : పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటకు వచ్చాయి. దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యాయనం చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బయటపెట్టిన పత్రాలన్నింటిని దక్షిణ జర్మనీ వార్తాపత్రిక సేకరించింది. వీటిలో దాదాపు 12 వేల పత్రాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం. 2016లో దాదాపు 500 మంది భారతీయుల పేర్లు మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన పత్రాల్లో ఉన్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎమ్‌ఏజీ)ను ఏర్పాటు చేసింది. 2016 లీక్‌ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎమ్‌ఏజీ గుర్తించింది. కొత్త లీక్‌లో ఉన్న విషయాలేంటి..? కొత్త పత్రాల్లో భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. వీరి పేర్లు 2016 లీక్స్‌లో లేవు. - పీవీఆర్ సినిమా యజమాని అజయ్ బిజ్లీ, ఆయన కుటుంబ సభ్యులు - సునీల్ మిట్టల్ కుమారుడు, హైక్ మెసేంజర్ సీఈవో, భారతీ ఎయిర్టెల్ సీఈవో కవిన్ భారతి మిట్టల్ - ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కుమారుడు జలాజ్ అశ్విన్ దాని వీరికి లింక్‌లు ఉన్నాయని తేలింది.. పనామా పేపర్లలో తమ పేర్లు రావడాన్ని ఖండించిన కొందరు ప్రముఖుల పేర్లు మళ్లీ బయటకు వచ్చాయి. వీరికి ఆఫ్ షోర్ కంపెనీలతో బిజినెస్ లింక్స్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలను ఐసీఐజే జర్నలిస్టులు సంపాదించారు. సదరు ప్రముఖుల పేర్లు ఇవే.. - శివ్ విక్రమ్ ఖేమ్కా - నటుడు అమితాబ్ బచ్చన్ - మాజీ సొలిసిటర్ జనరల్ తనయుడు జహంగీర్ సోరబ్జీ - డీఎల్ఎఫ్ గ్రూప్‌కు చెందిన కేపీ సింగ్, ఆయన కుటుంబం - అనురాగ్ కేజ్రీవాల్ - మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్‌కు చెందిన నవీన్ మెహ్రా - అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ -
ప్రజాస్వామ్యానికి జర్నలిజం ఆయువు
భారత జర్నలిజం మర ణించిందనే వార్త నిజం కాదు. అయితే, కొందరు సంపన్న మీడియా అధి పతులు తమను మభ్య పెట్టి బోల్తా కొట్టించిన వారి నిజస్వరూపాన్ని గుర్తించలేకపోవడం మాత్రం ఆందోళన కలి గించే విషయం. కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ చూశాక దీన్ని చెప్పక తప్పదు.మనం, జర్నలిస్టులం నిజంగా చెడ్డవాళ్లలా కనిపి స్తున్నాం. మనమంతా లొంగిపోవడానికి సిద్ధమని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. దీంతో రాజకీయనాయకులు సంబరపడుతున్నారు. మనమంతా నిజాయితీ లేనివాళ్లమేగాక, నేరపూరిత మైన దురభిమానులమని వ్యాఖ్యాతలు నిందలేస్తు న్నారు. వాస్తవాలను సరిచూసుకుని పరిశీలించాలనే మన వృత్తికి సంబంధించిన తొలి పాఠాన్ని విస్మరించి తప్పుచేశామన్న భావనతో బాధపడుతున్నాం. స్టింగ్ ఆపరేషన్ వీడియోలన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తాయి. రహస్యంగా కెమెరా అమర్చి రికార్డు చేసినపుడు మీరు మాట్లాడే సాధారణ విషయాలు కూడా తెలివి తక్కువగా కనిపిస్తాయి. హేమాహేమీలైన పెద్దలతో మాట్లాడిన విషయాలను, వారి ముఖ కవళికలను వీడియో కెమెరాల్లో రికార్డు చేసి చూపిస్తే నిజంగా సంచలనమే. కాని, వారిలో ఏ ఒక్కరూ జర్నలిస్టు కాదు. కాబట్టి ఈ స్టింగ్ ఆపరేషన్‌లోని విషయాలు ప్రచారంలోకి వచ్చాక జర్నలిస్టులు సిగ్గుపడాల్సిన అవసరంగాని, సామూహిక సతీ సహగమనానికి పాల్పడాల్సిన అవసరంగాని లేదు. రెండో ముఖ్య విషయం ఏమంటే–ఒక బడా మీడియా సంస్థ యజమాని మినహా ఏ ఒక్కరికీ మతతత్వంతో నిండిన ప్రచారం చేయడానికి పారిశ్రా మికవేత్తలైన వారి స్నేహితుల ద్వారా డబ్బు ఇస్తా మని ఎవరూ చెప్పలేదు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్న వారందరూ పేరున్న లిస్టెడ్ కంపెనీల యజమానులు. వారు నల్లడబ్బును తెల్లధనంగా మార్చడానికి దళారులుగా ఉండే అవకాశం లేదు. మూడో ముఖ్య విషయం ఏమంటే– మీడియా పలుకుబడి దాని ఆర్థిక సంపత్తి లేదా శక్తిసామర్ధ్యాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో అత్యంత ధనిక మీడియా సంస్థ టర్నోవర్ వంద కోట్ల డాలర్లకు (రూ.6,700 కోట్లు) మించి ఉండదు. మిగతా అత్యధిక సంస్థలది నాలుగు అంకెల కోట్లకు మించదు. బడా కంపెనీలైన రిలయన్స్, ఆదిత్య బిర్లా గ్రూప్ టర్నోవర్ నాలుగు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. మనం అమ్ముడు పోవడానికి సిద్ధపడితే ఈ అపర కుబేరులు తమ జేబుల్లోని చిల్లరతో మనల్ని కొనేయగలరు. బురిడీ కొట్టించడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించలేనంత అమాయకులు కాదు ఈ సంపన్న పారిశ్రామివేత్తలు. నాలుగో విషయం ఏమంటే–మీడియా పెద్దలు డబ్బుకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కని పిస్తే–మనమంతా అమ్మకానికి అంగీకరించే సరు కులా ప్రజలకు కనిపిస్తాం. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ వల్ల జర్నలిస్టులకు చెడ్డపేరొస్తుంది. అందుకే ఏది వాస్తవమో, ఏది కల్పనో పరిశీలించాలి. ఐదో అంశం ఏమంటే, అత్యధిక భాషల్లో నడిచే ప్రధాన స్రవంతి మీడియాలో అధిక భాగం సక్ర మంగానే వ్యవహరిస్తోందని నేను చెప్పగలను. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై కలత చెందకుండా మనం సరైన ప్రశ్నలు సంధించాలి. మొత్తం మీడియా విశ్వస నీయత దెబ్బ తినకుండా చూసుకోవాలి. అనేక మీడియా సంస్థలతోపాటు వాటిలో పనిచేసే వేలాది మంది జర్నలిస్టులు నిజాయితీగా వ్యవహరిస్తున్నార నేది వాస్తవం. ఆరోది, ప్రమాదకరమైన విషయం ఏమంటే, ప్రధాన స్రవంతి మీడియా కుప్పకూలి పోయిందనీ, సామాజిక మాధ్యమమే సర్వ సమస్యలకు పరి ష్కారమార్గమనే భావన. నిజానికి, నరేంద్ర మోదీ సర్కారును ఇబ్బందులకు గురిచేసే కథనాలు వెలుగు లోకి తెచ్చినవన్నీ ప్రధాన మీడియా సంస్థలే. మోదీకి బహుమతిగా లభించిన ఖరీదైన సూటు గురించి వెల్లడించింది కూడా పెద్ద పత్రికే. వాస్తవా నికి, 99 శాతం నకిలీ వార్తలు పుట్టేది సామాజిక మాధ్యమాల నుంచే. ఏడో విషయం, పత్రికలు తమ ఆదాయం కోసం వ్యాపార ప్రకటనలపై ఆధారపడే నమూనా నుంచి బయటపడుతున్నాయనే అభిప్రాయాన్ని ఈ స్టింగ్ ఆపరేషన్ కలిగిస్తోంది. ఇది వాస్తవం కాదు. మీడియా సంస్థలు ఎలాంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటున్నా అవి ఎంత స్వేచ్ఛగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయనేదే కీలకం. ఇక, ఎనిమిదో అంశం– ఈ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై రాజకీయ నాయకులు సంతోషపడు తున్నారు. వార్తా ప్రసార మాధ్యమాలు ప్రజాస్వా మ్యానికి ముప్పుగా పరిణమించాయని ప్రసిద్ధ విద్యా వేత్త∙ప్రతాప్ భాను మెహతా చేసిన దురదృష్టకర వ్యాఖ్యపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఘనశ్యామ్ తివారీ ట్వీటర్లో వ్యక్తం చేసిన పట్టరాని ఆనందం ఇదే విషయం చెబుతోంది. బీజేపీ–ఆరెస్సెస్, ప్రభు త్వం దీంతో ఏకీభవిస్తాయనే నేను నమ్ముతున్నాను. తొమ్మిదో విషయం ఏమంటే–స్టింగ్ ఆపరేషన్లు ‘పరిశోధనాత్మక జర్నలిజం’ వంటివేనా? ఎలాంటి పారదర్శకత లేకుండా, ఎలాంటి సంస్థాగత పునాది, జవాబుదారీతనం లేకుండా ఇలాంటి ‘స్టింగ్’ ఆప రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు వీటిని అభిమానిస్తాయి. మరికొన్ని (మా ‘ద ప్రింట్’ సహా) సంస్థలకు ఇవి నచ్చవు. అనేక ఇతర ప్రదేశాల్లో ఎవరైనా జర్నలిస్టు ఆయుధాల వ్యాపారుల తరఫున దళారిగా నటిస్తూ అవతలి వ్యక్తి తాను వేసే ఎరకు లొంగుతాడా? లేదా అని పరీక్షించడానికి రహస్య కెమెరాతో సంభాషణలు రికార్డు చేస్తే– ఈ జర్న లిస్టును ప్రాసిక్యూట్ చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి స్టింగ్ వ్యవహారాలు జర్నలిజమా? కాదా? అనేది చర్చనీయాంశం. ముఖ్యంగా అవతలి వ్యక్తుల అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి ‘స్టింగ్’ వార్తలు ప్రచురించినప్పుడు మనం దీన్ని మనం గట్టిగా ప్రశ్నించాలి. చివరగా మన యజమా నులపై మనకు అనేక అభ్యంతరాలు, నచ్చని విష యాలు, వ్యక్తిగత దురభిప్రాయాలుంటాయి. వీట న్నింటినీ వాస్తవాలుగా ప్రచారం చేయవద్దు. మీడియా సంస్థల యజమానులందరూ దొంగలు, తెలివిలేని దద్దమ్మలు కాదు. నేను 37 ఏళ్లు (1977– 2014) రెండు బడా మీడియా సంస్థల్లో పనిచేశాను. వార్తలను డబ్బుకు అమ్మాలని నన్ను ఎప్పుడైనా యజమానులు అడిగారా? అంటే లేదనే చెబుతాను. కాబట్టి, వార్తలను అమ్ముకునే జర్నలిస్టులున్నారేమో తనిఖీ చేసే పనిని ప్రతాప్ భానుమెహతా కొనసా గించాలని నా కోరిక. అయితే, భారత జర్నలిజం చచ్చిపోయిందంటూ మరణానికి ముందే సమాధి చేయడం న్యాయం కాదు. మేం చనిపోయామని మీర నుకుంటే ఇది ఖచ్చితంగా గాలివార్తే. మేం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదంగా మారలేదు. మీరు సరైన చానల్స్ చూడడం లేదనే భావిస్తాను. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరిపై నిషేధం
కొలంబో : ‘ఆల్ జజీరా’ స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ పాల్పడినట్లు ఒప్పుకున్న పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్‌మన్‌పై వేటు వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో గాలే వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ ఫలితం ప్రభావితమయ్యేలా ఫిచ్‌ను సిద్దం చేస్తామని ఈ ఇద్దరు తెలిపినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ ఘటనతో శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. అంతేగాకుండా స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌తో ఉలిక్కిపడ్డ అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్‌తో కొలంబో ఆటగాడు తరిందు మెండీస్, గాలె పిచ్ క్యూరేటర్ తరంగ ఇండికాలు ఫలితాన్ని ప్రభావం చేసేలా పిచ్‌ను సిద్దం చేస్తామని ఒప్పుకున్నారు. గతంలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో సైతం పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు కూడా వెల్లడించారు. ఇక ఈ వివాదంలో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. చదవండి: మూడు టెస్టులు ఫిక్స్! -
మూడు టెస్టులు ఫిక్స్!
న్యూఢిల్లీ: మళ్లీ ఫిక్సింగ్ భూతం బుసలు కొట్టింది. గత రెండేళ్లుగా భారత్ ఆడిన మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు ఖతర్‌కు చెందిన అల్ జజీరా టీవీ చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడవడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇదంతా కూడా దావూద్ (డి) గ్యాంగ్ కనుసన్నల్లో జరిగినట్లు ఈ చానెల్ నిర్వహించిన శూల శోధనలో వెల్లడైంది. ఇందులో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల ప్రమేయం లేకపోవడం ఊరట. ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో భారత క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్ ఈ ఆపరేషన్‌ను ముంబై, యూఏఈ, శ్రీలంకల్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో డాక్యుమెంటరీ ఆదివారం ‘హిందుస్తాన్ టైమ్స్’ వెబ్సైట్లో ప్రసారమైంది. మొత్తం మ్యాచ్, ఇన్నింగ్స్ కాకుండా కొన్ని ఓవర్లు, సెషన్లు మాత్రమే ఫిక్సయ్యాయి. అంటే మ్యాచ్‌లు జరిగిన ఐదు రోజుల్లో ఏదో ఓ రోజు పది ఓవర్లో, 20 ఓవర్లో ఫిక్స్ అయ్యాయి. చెన్నై (2016)లో భారత్–ఇంగ్లండ్ టెస్టు, గతేడాది రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, గాలే (శ్రీలంక)లో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లు బుకీలు, ఫిక్సర్ల బారిన పడినట్లు ఆ డాక్యుమెంటరీలో వెల్లడైంది. ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్, ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్ల పాత్ర ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే సదరు ఆటగాళ్ల పేర్లను ‘బీప్’సౌండ్‌తో వినపడకుండా కవర్ చేశారు. పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల పేర్లు మాత్రం వినిపించాయి. హసన్ రజా (పాక్ తరఫున టెస్టు ఆడిన అతిపిన్న క్రికెటర్), దిల్హార లోకుహెత్తిగె, జీవంత కులతుంగ, తరిందు మెండీస్ (శ్రీలంక)లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. వీరితో పాటు గాలే పిచ్ క్యురేటర్ తరంగ ఇండిక పేరు వినిపించింది. ఆయన గాలేలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. శూల శోధన వీడియోలో డి–గ్యాంగ్‌కు చెందిన అనీల్ మునవర్ మాట్లాడుతూ ‘ప్రతీ స్క్రిప్టు నాదే. నేనిచ్చిందే జరుగుతుంది... జరిగి తీరుతుంది’ అని జర్నలిస్ట్‌కు వెల్లడించారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నుంచి 6 కోట్ల వరకు ఇస్తామన్నారు. గాలే క్యురేటర్‌కు రూ. 25 లక్షలిచ్చామని ఇది ఆయన (క్యురేటర్) ఎనిమిదేళ్ల జీతంతో సమానమని చెప్పారు. భారత మాజీ దేశవాళీ ఆటగాడు రాబిన్ మోరిస్ మాట్లాడుతూ ‘నా చేతిలో 30 మంది ఆటగాళ్లున్నారు. వాళ్లంతా నేనేది చెబితే అదే చేస్తారు’ అని అన్నాడు. అతని వ్యాపార భాగస్వామి గౌరవ్ రాజ్‌కుమార్ ‘మాకు గేమ్ వినోదంతో పనిలేదు. ఆట గురించి పట్టించుకోం. మాకు కావాల్సింది డబ్బే! దాని కోసమే ఇదంతా చేస్తున్నాం’ అని చెప్పాడు. ఐసీసీ పూర్తిస్థాయి విచారణ... ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ఇందులో ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్ల దేశాలతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం... ముందు సాక్ష్యాలు కావాలని, విశ్వసనీయ రుజువులందాకే తమ ఆటగాళ్ల ప్రమేయంపై విచారణ చేపడుతామని తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ టామ్ హారిసన్ మాట్లాడుతూ భారత్‌తో జరిగిన టెస్టులో మాకెలాంటి సందేహాలు లేవని, ఆటగాళ్లను అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు. ఐసీసీ దర్యాప్తు తర్వాతే... ఐసీసీ దర్యాప్తు జరిగేదాకా వేచి చూస్తామని, ఆ తర్వాతే తమ బోర్డు పరిధిలో విచారణ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఆటగాడు రాబిన్ మోరిస్‌కు బోర్డు నుంచి రూ. 22,500 పెన్షన్ చెల్లిస్తున్నామని, దోషిగా తేలితే దాన్ని నిలిపివేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
ఆ మీడియా సంస్థల్ని ద్వేషించను: రాహుల్
న్యూఢిల్లీ: వాస్తవాలను వక్రీకరిస్తూ తనపై విద్వేషాన్ని ఎగదోసే మీడియాను ద్వేషించనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వీరంతా తనపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టనింపుకుంటున్నారనీ, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, హిందుత్వ ఎజెండా ప్రచారానికి 17 మీడియా సంస్థలు అంగీకరించినట్లు ఇటీవల కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు స్పందించారు. ‘తప్పుడు వార్తలు, అవాస్తవాలతో నాపై విద్వేషాన్ని రగిల్చేవారిని నేను ద్వేషించను. వాళ్లు ద్వేషాన్ని అమ్ముకుంటున్నారు. వారికది కేవలం వ్యాపారం మాత్రమే. ఈ విషయం కోబ్రాపోస్ట్ ఆపరేషన్‌తో బహిర్గతమైంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. -
పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయలలిత మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
స్టింగ్ ఆపరేషన్: ఆ గొంతు నాది కాదు!
చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు ముడుపులు అందుకున్న వ్యవహారం తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. మీడియా స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన శాసనసభ్యుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు అన్నాడీఎంకే వర్గాలు ముందుకు రావడంలేదు. ఈ వ్యవహారంపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం నో కామెంట్స్ అని జారుకున్నారు. తమిళనాడు మంత్రి డి. జయకుమార్‌ను దీనిపై ప్రశ్నించగా... విషయం కోర్టు పరిధిలో ఉందని దాటవేశారు. ఇక ముడుపుల వ్యవహారంపై ఎమ్మెల్యే శరవణన్‌ను పన్నీర్ సెల్వం వివరణ కోరారు. అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకేతో ఒక్కో ఎమ్మెల్యేకు 2 కోట్లు ఆఫర్ చేశారని స్టింగ్ ఆపరేషన్‌లో శరవణన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కొందరికి రూ. 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అందాయని చెప్పారు. ఓపీఎస్ కూడా ఒక్కో ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఓటుకు కోట్లు స్టింగ్ ఆపరేషన్‌పై ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా స్పందించింది. సీబీఐ విచారణ జరిపించాలని మద్రాస్ హౌకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టాలని డీఎంకే డిమాండ్ చేసింది. నా గొంతు కాదు.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే, స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ శరవణన్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ వీడియోలో వినిపించిన స్వరం తనది కాదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా మిక్సింగ్ చేసి విడుదల చేశారని అన్నారు. పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టి తనను బజారుకీడ్చాలని చూస్తున్నారని శరవణన్ మీడియాకు వివరించారు. -
అడ్డంగా దొరికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. జయ మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు పన్నీర్ సెల్వం కోటి నగదు ఆఫర్ చేశారు. పళనిస్వామికి మద్దతిచ్చేందుకు శశికళ ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నగదుతో పాటు బంగారం ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిదక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ స్వయంగా కెమెరా సాక్షిగా చెప్పడం గమనార్హం. తనకు రూ.6 కోట్లు ఇస్తామన్నారని కెమెరా సాక్షిగా ఎమ్మెల్యే శరవణన్ పెదవి విప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తనియవరసు, కరుణసు, ఏకే బోస్‌లకు రూ.10 కోట్లు ముట్టాయని ఆయన వెల్లడించారు. కాగా అప్పట్లో కూవత్తూర్ గోల్డ్ బే రిసార్ట్స్ సాక్షిగా చిన్నమ్మ ...ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించారు. ఆ శిబిరం నుంచి శరవణన్ మారువేషంలో తప్పించుకుని వచ్చారు. తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీఎం పదవికి పన్నీర్ సెల్వం అడ్డం తిరగడంతో మొదలైన తమిళ రాజకీయ సంక్షోభం చివరకు ప్రలోభాల వరకూ దారి తీయడం సంచలనం రేపుతోంది. పళనిస్వామి వర్గం ఇస్తామన్న నగదు ఇవ్వకపోవడం వల్లే ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శరవణన్ చెప్పిన విషయాలు వాస్తవమా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. -
నల్లడబ్బును దర్జాగా బ్యాంకులే మార్చేస్తున్నాయి
మీడియా ‘స్టింగ్’ ఆపరేషన్‌లో వెలుగుచూసిన నిజం న్యూఢిల్లీ: ఓపక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు లేదా సొంత సొమ్మును తీసుకునేందుకు సామాన్యులు అష్టకష్టాలు పడుతుంటే మరోపక్క నల్లకుబేరులు దొడ్డిదోవన దర్జాగా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకుంటున్న సంఘటనలు వింటున్నాం. కంటున్నాం. అసలు ఇది ఎలా జరుగుతుందో కూపీ లాగడం కోసం ‘ఇండియా టుడే’ మీడియా గ్రూప్ ప్రత్యేక జర్నలిస్టుల బందాన్ని దేశవ్యాప్తంగా ఉన్నా వివిధ బ్యాంకుల వివిధ బ్రాంచ్‌లకు పంపించి మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, ఇతర సీనియర్ అధికారులపై ‘స్టింగ్’ ఆపరేషన్ నిర్వహించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘ఏం ఫర్వాలేదు. రోజుకు పది లక్షల రూపాయలను కొత్త నోట్లతో మార్చి ఇచ్చేస్తాం. ఇలా 50 లక్షల రూపాయల వరకు మారుస్తాం. అలా ఎంతో మందికి ఇప్పటి వరకు మార్చి ఇచ్చాం. మీకు కూడా ఇస్తాం. ఈ పని చేసినందుకు 20 శాతం కమిషన్ ఇవ్వాలి. మీరు చేయాల్సిందిల్లా మేము సూచించిన బ్యాంక్ ఖాతాల్లో వేయాలి. ఆ ఖాతాలు మా కనుసన్నల్లోనే ఉంటాయి’ అని ఓ బ్యాంకు అధికారి భరోసా ఇచ్చారు. ‘20 లక్షల రూపాయల వరకు మారుస్తాం. ఏం ఫర్వాలేదు. మా సహచరులకు ఈ బ్యాంకుల్లో చాలా ఖాతాలు ఉన్నాయి. కొంత మంది నిజమైన ఖాతాదారులు కూడా మేము చెప్పినట్లు వింటారు. ఎందుకంటే వారు ఖాతాలు తెరవడానికి మేమే సహకరించాం కదా. వారి ఖాతాల్లో రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు రద్దయిన నోట్లను వేయండి. ఆ మేరకు కొత్త నోట్లను తీసుకెళ్లండి. ఇంతవరకు అలాగే నాలుగైద కోట్ల రూపాయలను మార్చి ఇచ్చాం. అయితే 30 శాతం కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.....మేం ఊరూరా ఇటీవలనే కొత్త ఖాతాలను తెరిచాం. మేమిచ్చే ఏ ఖాతాల ద్వారానైనా రెండున్నర లక్షల రూపాయలకు మించకుండా పాత నోట్లను డిపాజిట్లు చేయండి. ఆ మేరకు కొత్త నోట్లను ఇస్తాం. ఆ, పది పదేహేను లక్షలంటే వంద నోట్లను కూడా ఇవ్వగలం. ఇక్కడే కాదు, రాష్ట్రంలోని మా అన్ని బ్యాంకుల్లో ఏ బ్యాంకు నుంచైనా మీరు ఎప్పుడైనా డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసలుబాటు కల్పిస్తాం. ఆ పూచీ మాది. అయితే 20 శాతానికి తగ్గకుండా కమిషన్ ఇవ్వాలి’ అని మరో బ్యాంక్ అధికారి ఆఫర్. ‘కమిషన్ ముందుగా ఇస్తేనే పాత నోట్లను మార్చిస్తాం. దానికి చేయాల్సిందల్లా మీరు 8 నుంచి 10 బ్యాంకు ఖాతాలను తెరవాలి. అందుకు మేమే సహకరిస్తాం. రెండు లక్షల చొప్పున ఈ ఖాతాల్లో డిపాజిట్‌చేసి మీకు ఇష్టం ఉన్నప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు....మా సహచరలకే ఒక్కొక్కరి ఇదే బ్యాంకులో నాలుగైదు అకౌంట్లు ఉన్నాయి. మీమంతా కలసి మీకు సహకరిస్తాం. 30 శాతం కమిషన్ ఇస్తే మీ పాత నోట్లను వీలైనంత ఎక్కువగా మార్చి పెడతాం. ఆదాయం పన్ను శాఖ భయం అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం. ఎవరికి అనుమానం రాకుండా అంత సవ్యంగా నడిచిపోతుంది’ అంటూ మరో బ్యాంక్ ఉన్నతాధికారి ‘స్టింగ్’ అపరేషన్‌లో దొరికి పోయారు. జర్నలిస్ట్ బందం స్టింగ్ ఆపరేషన్‌లో దొరికి పోయిన వారిలో ప్రతిష్టాకరమైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటివి ఉన్నాయి. ఈ కుంభకోణం ఒక్క ప్రాంతానికో ఒక్క బ్రాంచీకో పరిమితం కాలేదు. ఢిల్లీ, అహ్మదాబాద్, గజియా బాద్‌తోపాటు దేశమంతటా విస్తరించింది. ఇలాంటి అవినీతి ప్రభుత్వ బ్యాంకుల్లో చాలా తక్కువుండగా, ప్రైవేటు బ్యాంకుల్లోనే ఎక్కువగా ఉంది. ఇలాంటి కుంభకోణం కారణంగానే యాక్సిస్ బ్యాంక్ ఢిల్లీ బ్రాంచిపై సీబీఐ అధికారులు ఇటీవల దాడులు చేసి అక్రమార్కులను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. -
నేతల ‘కొత్త’ నోట్ల దందా!
• స్టింగ్ ఆపరేషన్‌తో వెలుగులోకి.. • 30 నుంచి 40 శాతం కమీషన్‌కు నల్లధనం మార్పిడి న్యూఢిల్లీ: అవినీతిని నిర్మూలిస్తుందంటూ ప్రధాని మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు .. అక్రమార్కుల పాలిట మరో ఆదాయ మార్గంగా మారింది. 30% నుంచి 40% కమీషన్ తీసుకుని నల్లడబ్బును సక్రమం చేసే కొత్త వ్యాపారంపై నవంబర్ 8 తరువాత పలు వార్తలు రావడం తెలిసిందే. రాజకీయ పార్టీల నేతలు ఈ మార్గాన్ని సైతం తమ అక్రమ సంపాదనకు వాడుతున్న విషయం ‘ఇండియాటుడే టీవీ’ స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది. ఆపరేషన్‌లో బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూల నేతలు కమిషన్ కోసం బేరాలాడుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. ఈ కొత్త దందాకు కేంద్రాలుగా వారు తమ పార్టీ ఆఫీసులనే వాడుకోవడం కొసమెరుపు. కాంగ్రెస్.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేత తారిఖ్ సిద్దిఖీని కలిసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌లు రూ. కోటి నల్లధనాన్ని మార్చడానికి వీలవుతుందా అని ప్రశ్నించారు. దానికి సిద్దిఖీ.. అందుకు తనకు తెలిసిన ఎన్జీఓను పరిచయం చేస్తానని హామీ ఇచ్చాడు. తనకు తెలిసిన వేరే మార్గాలూ ఉన్నా కానీ అవి అంత నమ్మకమైనవి కావని, ఈ ఎన్జీవోను నమ్మొచ్చని అన్నాడు. బీఎస్పీ.. యూపీలోని ఘజియాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు వీరేంద్ర జాటవ్తో.. 10 కోట్ల నల్లధనాన్ని మార్చాలంటూ బేరం ప్రారంభించగా.. 40 శాతానికి తగ్గకుండా కమీషన్ ఇస్తే కొత్త నోట్లు ఇస్తానని జాటవ్ హామీ ఇచ్చాడు. ‘హ్యాండ్ టు హ్యాండ్.. మొత్తం కొత్త నోట్లే ఇస్తా’నని స్పష్టం చేశాడు. ఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ.. సమాజ్‌వాదీ పార్టీ నోయిడా మహానగర్ శాఖ సభ్యుడు టిటు యాదవ్ కూడా అదే(40%) కమీషన్‌కు ఎంత మొత్తమైనా మార్చేస్తామని స్పష్టం చేశాడు. ఎన్సీపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శి రవి కుమార్‌ను కలిసి కోటి రూపాయల బ్లాక్ మనీని మార్చాలంటూ అడగగా.. 30 శాతం కమీషన్‌కు మార్చేస్తానన్నాడు. ‘ఇప్పుడే తీసుకురండి..70% అమౌంట్ తిరిగిచ్చే హామీ నాది. అదీ చెక్ రూపంలో’ అని పేర్కొన్నాడు. నల్లడబ్బును ఎలా మారుస్తారు? చెక్ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా వివరణ ఇస్తారు? అని ప్రశ్నించగా.. ‘ఒక నకిలీ పీఆర్ కంపెనీని సృష్టిస్తాం.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆ కంపెనీ సేవలు ఉపయోగించుకున్నామని చెబుతాం’ అన్నారు. జేడీయూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు సతీశ్ సైనీని పార్టీ ఆఫీస్‌లో సంప్రదించగా.. 40% కమీషన్ నడుస్తోంది కానీ.. నేను 30 శాతానికి పని చేసి పెడ్తాను’ అన్నాడు. -
500 స్టింగ్ ఆపరేషన్లు, 400 సీడీలు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతర్వాత బ్యాంకులపై ఐటీ దాడుల నేపథ్యంలో అవినీతి బ్యాంకు ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం, సేకరించిన కచ్చితమైన సాక్ష్యాలతో మేరకు ఆయా అధికారులపై కొరడా ఝుళిపించేందుకు ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. నల్ల కుబేరులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న బ్యాంకు అధికారులకు చెక్ పెట్టేందుకు ఐటీ అధికారులు దాదాపు 500 బ్యాంకు బ్రాంచ్ లపై స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. దాదాపు 400 సీడీల సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ నేపథ్యంలో అవినీతి బ్యాంకు ఉద్యోగుల బండారానికి సంబంధించిన సమాచారమంతా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరింది. దీంతో నల్లధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు సహాయం చేస్తున్న వివిధ బ్యాంకుల సిబ్బందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. కాగా నగదు కొరత సమస్యను అధిగమించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో నోట్ల సరఫరాకు సంబంధించి ఆర్థిక శాఖ , ఆర్బీఐ అనేక చర్యలకు దిగింది. మరోవైపు డిమానిటైజేషన్ తరువాత నల్లధనాన్ని వెలికితీసే చర్యల్లో భాగంగా ఐటీ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీ ఎత్తున కొత్త కరెన్సీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకు పోయిన అవినీతికి అద్దం పడుతూ కొత్త రూ 2,000, రూ. 500నోట్లను అధికారులు భారీగా సీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులపై దాడులు చేసిన ఆదాయపన్ను అధికారులు పాత కొత్త, కరెన్సీ నోట్లను భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. -
అవును.. మా సైన్యం చావుదెబ్బ తింది: పాక్ పోలీసు
తమ ఉన్నతాధికారితో మాట్లాడుతున్నానని భావించిన పాకిస్థానీ పోలీసు అధికారి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన వాస్తవాన్ని తన నోటితోనే వెల్లడించాడు. పాక్ సైనికుల్లో కూడా ఐదుగురు మరణించారని వెల్లడించాడు. భారత దేశానికి చెందిన ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. ఐజీ ముస్తాక్ పేరుతో గులాం అక్బర్‌కు పాత్రికేయుడు మనోజ్ గుప్తా ఫోన్ చేశారు. ''సర్.. అది రాత్రి సమయం. సుమారు 3 నుంచి 4 గంటల వరకు పట్టింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగింది. అప్పటివరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి'' అని అక్బర్ ఫోన్లో చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ ఆ దాడుల గురించి మొత్తం వివరాలన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదని.. దాంతో ఐదుగురు సైనికులు మరణించారని కూడా ఆయన వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను కూడా పాక్ సైన్యం వెంటనే అక్కడినుంచి తొలగించిందని, అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తెలియదని గులాం అక్బర్ అన్నారు. దాడులు జరిగిన ప్రాంతాల పేర్లు కూడా తెలిపారు. ఫలానా ప్రాంతాల్లో దాడులు జరిగాయంటూ ఎస్పీ అక్బర్ చెప్పిన ప్రాంతాలన్నీ ఇంతకుముందు తాము దాడులు చేసినట్లుగా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పిన ప్రాంతాలేనని కూడా తేలింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని చెబుతూ.. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని కూడా ఆయన వివరించారు. 'ఆర్మీయే వాళ్లను తీసుకొస్తుంది.. అది వాళ్ల చేతుల్లోనే ఉంది' అని అన్నారు. జీహాదీల విషయాలను స్థానిక పోలీసులకు కూడా తెలియనివ్వకుండా పాక్ సైన్యం కాపాడుతుంది కాబట్టి ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తనకు తెలియదని అన్నారు. -
పార్టీ టికెట్లు అమ్ముకుంటూ.. స్టింగ్‌కు దొరికేశాడు
పంజాబ్‌లో ఎన్నికలకు వెళ్లడానికి తమ దగ్గర డబ్బులు లేవంటూ సాక్షాత్తు పార్టీ ముఖ్య నాయకుడే చెప్పారు కదా అనుకున్నారో ఏమో గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతడి దగ్గర డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. దాంతో పార్టీ రాష్ట్రశాఖ కన్వీనర్ సుచా సింగ్ ఛోటేపూర్‌పై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఛోటేపూర్‌పై చర్య తీసుకోవాలంటూ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దాదాపు 25 మంది పంజాబ్ అగ్రనేతలు లేఖ రాశారు. అయితే, ఇదంతా తన సొంత పార్టీ వాళ్లు చేసిన కుట్రేనని, ఆరోపణలు నిరాధారమని ఛోటేపూర్ అంటున్నారు. అన్ని విషయాలూ త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కానీ ఛోటేపూర్ డబ్బులు తీసుకుంటుండగా స్టింగ్ ఆపరేషన్ చేశామని, ఆ వీడియో ఇప్పటికే అధిష్ఠానం వద్దకు వెళ్లిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో అవినీతికి చోటు లేదని, సాక్ష్యాధారాలు అగ్రనేతలకు చేరితే ఛోటేపూర్‌పై తప్పకుండా కఠినచర్యలు ఉంటాయని పార్టీ అధికార ప్రతినిధి హిమ్మత్‌సింగ్ షేర్గిల్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్థుడైన ఛోటేపూర్ గత ఎన్నికల్లో గురుదాస్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీపై ఛోటేపూర్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు, కేజ్రీవాల్‌కు చెడిందని చెబుతున్నారు. ఇప్పటికి రెండు జాబితాలను పార్టీ విడుదల చేసినా, రెండుసార్లూ ప్రెస్మీట్లలో ఛోటేపూర్ లేరు. -
కర్ణాటకలో 'స్టింగ్ ఆపరేషన్' కలకలం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు సహకరించడానికి కొంతమంది ఎమ్మెల్యేలు రూ. కోట్లకు ఆశపడుతున్నట్లు ఒక టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవచ్చు. కానీ మూడో అభ్యర్థిని రంగంలోకి దించింది. రెండ్రోజుల ముందు ఒక టీవీ చానల్ ప్రతినిధులు జేడీఎస్ ఎమ్మెల్యేలు మల్లికార్జున ఖూబా, జి.టి.దేవేగౌడ, కర్ణాటక జనతా పార్టీ ఎమ్మెల్యే బి.ఆర్.పాటిల్‌ను కలవగా.. వారు ఒక్కో ఓటుకు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు డిమాండ్ చేసిన దృశ్యాలు బయటపడ్డాయి. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బేరసారాలు సాగించినట్టు రహస్య వీడియాలో ఉంది. కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరపున ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేశ్, కేసీ రామమూర్తి, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జేడీ(ఎస్) తరపున బీఎస్ ఫరూఖ్ నామినేషన్లు దాఖలు చేశారు. 225 స్థానాలున్న కర్ణాటకలో అసెంబ్లీలో కాంగ్రెస్ కు 123, జేడీ(ఎస్)కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఓట్లు పోను రామమూర్తికి మరో 12 ఓట్లు అవసరం. మరోవైపు జేడీ(ఎస్)కు చెందిన ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ఉల్లఘించి రామమూర్తికి ఓటు వేస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 11న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. -
చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా?
హైదరాబాద్: స్టింగ్ ఆపరేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఒక నీతి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు మరో నీతా.. అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ స్టింగ్ ఆపరేషన్ల విషయంపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి 'ఓటుకు కోట్లు' కేసులో చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదన్నారు. చంద్రబాబు కొనుగోలు బాగోతం ఆడియో టేపుల్లో రికార్డయింది.. అంతకంటే సాక్ష్యం ఏం కావాలో చెప్పాలన్నారు. విచారణల పేరుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కక్ష సాధిస్తోందని ఎపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు కోట్లు కేసు ఏమైంది.. ఆ కేసును విచారణ జరిపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంలకు ఒక నీతి.. ఏపీ సీఎం చంద్రబాబుకు మరో నీతా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన బాగోతంపై సీబీఐ విచారణ జరిపించాలని గండ్ర రమణారెడ్డి కోరారు. -
సీబీఐ ఎదుట హాజరైన హరీశ్ రావత్
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మంగళవారం సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం విచారణ కొనసాగుతోంది. ఓ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో హరీష్ రావత్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపుతూ ఉన్న ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న సీబీఐ దీనిపై విచారణ చేపట్టింది. విచారణకు హజరయ్యేందుకు వెళుతూ రావత్... తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీబీఐ అడిగినా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ బలనిరూపణకు ముందు.. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎమ్మెల్యేలను బేరమాడుతున్నట్లు ఓ వీడియో టేపులు బయటకు వచ్చిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఆయనను విచారిస్తోంది. కాగా మే 10న రావత్ బలనిరూపణ పరీక్షలో రావత్ గెలుపొందిన విషయం తెలిసిందే. సీబీఐ ఇప్పటివరకు రావత్‌కు మూడుసార్లు సమన్లు జారీ చేసింది. -
అక్రమ ‘వీసా’పై యూఎస్ సీరియస్
♦ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ ♦ 306 మంది భారతీయ విద్యార్థులు వాషింగ్టన్: వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే అక్రమంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ.. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన 306 మంది భారత విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో 306 మంది విద్యార్థులు వీసా గడువు పెంచుకునేందుకు దళారుల ద్వారా ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని, వీరంతా న్యాయబద్ధంగా విద్యార్థి వీసాలు తీసుకుని వచ్చినవారేనని ఇమ్మిగ్రేషన్ అధికారి మార్క్ టోనర్ తెలిపారు. గతవారం జరిగిన ఈ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా 11 మంది భారత సంతతి వారితోపాటు 21మంది దళారులను అరెస్టు చేశామన్నారు. ‘వీరందరి దగ్గర విద్యార్థి వీసాలే ఉన్నాయి. కానీ వీసా పొడగించుకునేందుకు అక్రమమార్గాల్లో ప్రయత్నించినందుకే వీరిపై చర్యలుంటాయి’ అని టోనర్ పేర్కొన్నారు. అసలేం జరుగుతోంది? విద్యార్థి వీసాపై వెళ్లిన వారు వేర్వేరు కారణాలతో వీసా గడువు పెంచాలని సమయం ముగిసే 3-4 నెలల ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇదంతా చట్టబద్ధంగా జరిగే వ్యవహారమే కానీ,సరైన కారణాల్లేని పక్షంలో విద్యార్థులు మధ్యవర్తుల ద్వారా వీసా గడువు పెంచుకునేలా అక్రమమార్గాలను అన్వేషిస్తారు. మధ్యవర్తులు మనుగడలో లేని వర్సిటీల పేరుతో విద్యార్థుల వీసా గడువు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తారు. దీంతో విద్యార్థి వీసాలపై వెళ్లిన వారికి మరింత కాలం అమెరికాలోనే ఉండి అక్కడే ఉద్యోగాలు వెతుక్కునేందుకు.. ఆర్థిక అవసరాలకోసం పనిచేసేందుకు వీలుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఇలాంటి దళారుల ఆటకట్టించేందుకు.. కొన్ని నకిలీ వర్సిటీలను సృష్టించి దళారులను ఆకర్షిస్తుంది. ఆ తర్వాత విద్యార్థి వీసా ఫ్రాడ్ చేసే వారిని పట్టుకుంటుంది. వారంరోజుల క్రితం ఇలా యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సృష్టించిన వర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే నకిలీ వర్సిటీలో చేరేందుకు చాలా మంది విద్యార్థులు వచ్చారు. ఇందులో దళారులుగా ఇద్దరు తెలుగువారూ ఉన్నట్లు తేలింది. -
సీఎంపై స్టింగ్ ఆపరేషన్.. బయటికొచ్చిన సీడీ
ఉత్తరాఖండ్ రాజకీయాలు మంచి ఆసక్తికరంగా మారాయి. అక్కడి ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీలను కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బయటపెట్టారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పారు. తనకు మద్దతిస్తే డబ్బులిస్తానని రావత్ మభ్యపెట్టారని అన్నారు. మార్చి 23వ తేదీన ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారని, ఇందులో ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్వయంగా ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడారని రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేల ఆరోపణలను ముఖ్యమంత్రి హరీష్ రావత్ తోసిపుచ్చారు. వాళ్ల ఆరోపణలలో వాస్తవం లేదని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ కూడా అన్నారు. -
మమత- బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్
కోలకతా: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంటే.. మరోవైపు ఇది మమత- బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అని సీపీఎం ఆరోపిస్తోంది. అటు ఇది బీజేపీ- సీపీఎం కలిసి పన్నిన పన్నాగమని తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింత ఇరకాటంలో పడ్డారు. టీఎంసీ మంత్రులు, ఎంపీల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ బుధవారం పిల్ దాఖలు చేసింది. సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ కోలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. తృణమూల్ పార్టీ అవినీతి నేతలను ఎన్నికల్లో పోటీ చేయనీయకూడదని ఆ పిటిషన్ లో కోరారు. తమ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఇది బిజెపి, సిపిఐ (ఎం) కలిసి చేస్తున్న కుట్ర అని ఆరోపించింది. అటు ఈ అంశంపై పార్లమెంట్ లో దుమారం రేగింది. చానెల్స్ వీడియో టేపుల ప్రామాణికతపై టిఎంసి సభ్యుడు రాజ్యసభలో ప్రశ్నించారు. -
తృణమూల్ చుట్టూ ‘స్టింగ్’ ఉచ్చు
కఠిన చర్యలకు కాంగ్రెస్, లెఫ్ట్, బీజేపీ డిమాండ్ న్యూఢిల్లీ: ఓ ప్రైవేటు కంపెనీకి లాభం చేకూర్చేందుకు ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీతో సహా పలువురు ముడుపులు తీసుకుంటున్నట్లు తేల్చిన స్టింగ్ ఆపరేషన్‌పై లోక్‌సభలో తృణమూల్, ఆ పార్టీ సభ్యులపై బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఎంపీలు మండిపడ్డారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై విచారణ జరిపి తృణమూల్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లెఫ్ట్, తృణమూల్ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. రాజకీయంగా ఎదుర్కొనలేకే తమపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని తృణమూల్ ఆరోపించగా.. ఇలాంటి వ్యక్తులతో కలిసి పార్లమెంటులో కూర్చోవటం సిగ్గుగా ఉందని.. సీపీఎం విమర్శించింది. ఈ ఆపరేషన్‌ను విచారించేందుకు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతుంది లేదంటే.. స్పీకర్ కమిటీ వేయవచ్చు’ అని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఇది తృణమూల్‌కు గట్టిదెబ్బే. కొన్నేళ్ల క్రితం ఇలా ముడుపులు తీసుకుంటూ దొరికిపోయిన 11 మంది సభ్యులను పార్లమెంటు సస్పెండ్ చేసిన విషయాన్ని వివిధ పార్టీల ఎంపీలు గుర్తుచేశారు. కాగా, స్టింగ్ వీడియోను ఎన్నిలక సంఘం పరీక్షిస్తుందని సీఈసీ నసీం జైదీ వెల్లడించారు.