న్యూఢిల్లీ శాసనసభకు పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులపై జరిపిన స్టింగ్ ఆపరేషన్ను ఆమ్ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఆదివారం న్యూఢిల్లీలో తీవ్రంగా ఖండించింది. ఆ చర్య ప్రత్యర్థి వర్గం చేసిన కుట్రగా అభివర్ణించింది. మీడియా సర్కార్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన ఫుటేజ్లు తమ చేతికి చిక్కినట్లు ఏఏపీ వర్గాలు వెల్లడించాయి.
స్టింగ్ ఆపరేషన్ ఫుటేజ్లను కులంకుషంగా పరిశీలించినట్లు చెప్పాయి. తమ పార్టీ అభ్యర్థులు ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదని ఆ ఫుటేజ్ల పరిశీలనలో తెలినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థులపై ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.