పరస్పర ఆరోపణలు, విమర్శలతో వేడెక్కిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరో కోణం వెలుగు చూసింది.
పరస్పర ఆరోపణలు, విమర్శలతో వేడెక్కిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరో కోణం వెలుగు చూసింది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులపై ఓ వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాడు.
ఆమ్ ఆద్మీ అభ్యర్థులపై అనురంజన్ జా అనే వ్యక్తి ఆధ్వర్యంలో శూలశోధన చేశారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆయన ఆరోపించాడు. ఆమ్ ఆద్మీ అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికారని వెల్లడించాడు. 40 నిమిషాల నిడివిగల వీడియో టేప్ను విడుదల చేశాడు. కాగా దీనికి సంబంధించి ఆధారాలు లేకపోవడంతో అనురంజన్ ఆరోపణలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.