హైదరాబాద్ లో శాంత్రిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలని కేంద్రాన్ని కోరామని ఏపీ చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 8, 9 అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీని అభివృద్ధి చెందేవరకు సహాయం చేయాలని ప్రధాని మోదీని కోరినట్టు చెప్పారు. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలన్నారు. సాగర్ జలాల విషయంలో కేసీఆర్ కు తానే ఫోన్ చేశానని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కావాలనే రాజకీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అనైతిక దారిలో ఎమ్మెల్సీ సీట్లు గెలిచారన్నారు. ఏసీబీ కావాలనే స్టింగ్ ఆపరేషన్ చేసిందన్నారు. ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఆ వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలన్నారు. అలా కాకుండా మీడియాకు లీక్ చేశారని తెలిపారు. ఫోన్ టాపింగ్ చేయడం బాధాకరమన్నారు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వస్తువులతో టాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు టాప్ చేశామని తెలంగాణ హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ పై విచారణ చేయమని ప్రధానికి చెప్పామన్నారు.