చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా? | congress leader sailajanath asking CBI enquiry on chandra babu in cash for vote | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా?

Published Wed, May 25 2016 3:27 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా? - Sakshi

చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా?

హైదరాబాద్: స్టింగ్ ఆపరేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఒక నీతి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు మరో నీతా.. అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ స్టింగ్ ఆపరేషన్ల విషయంపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి 'ఓటుకు కోట్లు' కేసులో చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదన్నారు. చంద్రబాబు కొనుగోలు బాగోతం ఆడియో టేపుల్లో రికార్డయింది.. అంతకంటే సాక్ష్యం ఏం కావాలో చెప్పాలన్నారు. విచారణల పేరుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కక్ష సాధిస్తోందని ఎపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఓటుకు కోట్లు కేసు ఏమైంది.. ఆ కేసును విచారణ జరిపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంలకు ఒక నీతి.. ఏపీ సీఎం చంద్రబాబుకు మరో నీతా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన బాగోతంపై సీబీఐ విచారణ జరిపించాలని గండ్ర రమణారెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement