
న్యూఢిల్లీ: వాస్తవాలను వక్రీకరిస్తూ తనపై విద్వేషాన్ని ఎగదోసే మీడియాను ద్వేషించనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వీరంతా తనపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టనింపుకుంటున్నారనీ, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాహుల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, హిందుత్వ ఎజెండా ప్రచారానికి 17 మీడియా సంస్థలు అంగీకరించినట్లు ఇటీవల కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు స్పందించారు. ‘తప్పుడు వార్తలు, అవాస్తవాలతో నాపై విద్వేషాన్ని రగిల్చేవారిని నేను ద్వేషించను. వాళ్లు ద్వేషాన్ని అమ్ముకుంటున్నారు. వారికది కేవలం వ్యాపారం మాత్రమే. ఈ విషయం కోబ్రాపోస్ట్ ఆపరేషన్‌తో బహిర్గతమైంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment