false campaign
-
రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో
సాక్షి, అనంతపురం: చేసింది, చేసేది తప్పుడు పనులు.. పైగా కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు దిగడం టీడీపీ బాగా అలవాటు చేసుకుంది. వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విజయవంతం కాగానే.. తెలుగుదేశం నేతలకు ఏం చేయాలో తోచడం లేదేమో!. అందుకే మళ్లీ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో జాకీ కంపెనీ యూనిట్ భూకేటాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారానికి దిగారు. ‘జాకీ కంపెనీని మేం తెస్తే.. దాన్ని బెదిరించి వెళ్లగొట్టారు’.. ఇది ఇప్పుడు టీడీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం. మరి వాస్తవాలు బయటపెట్టి.. ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఆ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఇందుకోసం జాకీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి.. యెల్లో బ్యాచ్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టారు. రాప్తాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలోనే జాకీ కోసం 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థలం కేటాయించాడు. రాప్తాడులో హైవే పక్కనే ఉండే ఈ స్థలం కనీసం విలువ రూ.150 కోట్లు. దీన్ని కేవలం రూ.3 కోట్లకే కట్టబెట్టడం వెనక అవినీతి జరిగింది. పరిటాల సునీతతో పాటు అప్పటి మంత్రి నారా లోకేష్ కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచిత్రమేమంటే.. 2015లో జాకీ కంపెనీకి స్థలం కేటాయిస్తే.. అక్కడ ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అంటే.. ఇక ఇటుక కూడా కనిపించని స్థలం నుంచి జాకీని వెళ్లగొట్టారంటూ టిడిపి ప్రచారం చేయడం దుర్మార్గం కాక మరేముంది!. మరో విచిత్రం ఏంటంటే.. రాప్తాడు టీడీపీ కట్టిన స్థలం కూడా పండమేటి వెంకటరమణ స్వామి ఆలయ భూమి కబ్జా చేసిందని తేలడం!. -
దావోస్ లేఖపై తప్పుడు ప్రచారం... ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తూ రాసిన లేఖపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎంను ఆహ్వానిస్తూ నవంబర్ 25న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండే రాసిన లేఖ నకిలీదంటూ పచ్చ మీడియా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తొలుత దావోస్‌కు సీఎంకు ఆహ్వానం అందలేదంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలడంతో, ఆ లేఖ నకిలీదని మరో తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ రాసిన లేఖను యథాతథంగా విడుదల చేశామని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Due to the brutal nature of the negative campaign on the authenticity of the Invitation letter from @wef, we are reiterating, that any false claim will attract legal action. The Invitation letter is authentic and was shared as received.@GummallaSrijana@AP_EDB@ApiicOfficial https://t.co/pyeN1lMYax — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 19, 2023 -
కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం మొదలైంది
న్యూఢిల్లీ: రక్షణ రంగం, రిజర్వు బ్యాంకు, న్యాయ వ్యవస్థలపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం ప్రారంభించిందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీ విధ్వంసక నేతల నుంచి దేశాన్ని, వ్యవస్థలను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ఆర్బీఐ, న్యాయ వ్యవస్థ, సీబీఐల విధుల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా జోక్యం చేసుకున్నదీ వివరిస్తూ ఫేస్బుక్లో ‘వ్యవస్థలపై దాడి– తాజా కుతంత్రం’పేరుతో పోస్ట్ చేశారు. గత రెండు నెలలుగా కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను సాగిస్తోందనీ, అవేవీ ఎక్కువ కాలం నిలవలేవని అన్నారు. ‘కీలక అంశాల్లో కాంగ్రెస్ పొంతనలేని వైఖరి పాటిస్తోంది. ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూనే దేశంలో వాక్ స్వాతంత్య్రానికి భంగం వాటిల్లుతోందంటూ అరుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని వారసత్వ హక్కుగా మార్చేందుకు యత్నిస్తోంది’అని విమర్శించారు. ‘ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులతో చేతులు కలిపింది. అర్బన్ నక్సల్స్‌ను కోర్టు శిక్షల నుంచి కాపాడేందుకు ఆపార్టీ ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చేస్తూనే మరో వైపు దేశాన్ని, వ్యవస్థను కాపాడుతున్నట్లు చెప్పుకుంటోంది’అంటూ మండిపడ్డారు. దేశంలోకి అక్రమ వలసలను చట్టబద్ధం చేయడానికి మద్దతు పలుకుతోందన్నారు. ‘పార్లమెంట్ కార్యకలాపాలను కొనసాగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారు. అందరికంటే ఎక్కువగా పండిట్ నెహ్రూ మునిమనవడు ఒక్కడే భారత్ పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చారనే విషయం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. పరీక్షలో ఫెయిలయిన విద్యార్థి ఎప్పుడూ టాపర్‌ను విమర్శిస్తూనే ఉంటాడు’అని జైట్లీ ఎద్దేవా చేశారు. ‘2008–14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులను లూటీ చేసింది. పారిశ్రామిక వేత్తల రుణాలను మోదీ ప్రభుత్వం రద్దుచేసిందంటూ ఆరోపణలు చేస్తోంది’అని జైట్లీ మండిపడ్డారు. ‘మోదీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రుణంలో ఒక్క రూపాయిని కూడా రద్దు చేయలేదు. పైపెచ్చు ఎగవేతదారులను ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి తప్పించాం. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేశాం’అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విషయాల్లో ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోలేదని తెలిపిన జైట్లీ..‘ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షం వ్యక్తం చేస్తున్న అనుమానాలు వాస్తవానికి ఎన్నికల సంఘంపై దాడి వంటిదే అని పేర్కొన్నారు. -
ఐదుగురికి నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కుమార్తె, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. సోమవారం ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం విదితమే. దీనికి కీలక ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు బాధ్యుల్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు. ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. శుక్రవారం నాటికి మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో ఐదుగురిని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం వీరిని నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారే. ఐదుగురూ సొంతంగా యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో మరికొందరిని విచారించాలని నిర్ణయించారు. అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ, యూ–ట్యూబ్‌లోకి అప్లోడ్ చేసే వారి వివరాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏ ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా ఇంటర్నెట్ను యాక్సిస్ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఆయా చానల్స్‌లో ఉన్న 60 వీడియోలకు దిగువన అనేక మంది అభ్యం తరకరంగా కామెంట్స్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన వారితోపాటు ఈ కామెంట్స్ చేసిన వ్యక్తులు కూడా నిందితులుగా మారుతారని చెప్తున్నారు. యూట్యూబ్‌లోని ఆ వీడియోల కింద వీరు క్రియేట్ చేసుకున్న పేరు మినహా మిగిలిన వివరాలు ఉండవు. ఇవన్నీ యూట్యూబ్ నిర్వాహకులకే తెలుస్తాయి. కామెంట్ చేసిన వారి ఐడీలను గుర్తిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా యూట్యూబ్‌కు లేఖలు రాస్తున్నారు. ఇలా సాంకేతిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు నిందితుల్ని గుర్తించడానికి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. -
‘వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేకే తప్పుడు ప్రచారం’
సాక్షి, హైదరాబాద్: ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గురించే మాట్లాడుతోందని తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్ కుటుంబానిదేనని అన్నారు. వైఎస్ షర్మిలపై ఆరోపణలు చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఆడపడుచుపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నీచమైన, దగుల్బాజీ, గజ్జి కుక్కలు వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వైఎస్ షర్మిల ఫిర్యాదుపై తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా కేసును విచారిస్తుందని నమ్మకం ఉందన్నారు. ఏపీలో పరిపాలన అన్నదే లేదని.. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
వైఎస్సార్సీపీపై ఎల్లో మీడియా అవాస్తవాలు..
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..నిన్న(ఆదివారం) తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశం అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని ఎల్లోమీడియా ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను అణదొక్కుతున్నారని పార్ధసారధి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు వందకుపైగా హామీలిచ్చి ఇప్పుడు మిన్నకుండిపోయారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలలో ఇప్పటివరకూ ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. అధికారాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జస్టిస్ ఈశ్వరయ్య ఇచ్చిన స్టేట్మెంట్తో అది తేట తెల్లమైందన్నారు. తప్పుడు నివేదికలు ఎలా తయారు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. బలహీనవర్గాలు, దళితుల అవకాశాలను గండికొడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బలమైన పోస్టు ఏ ఒక్కటైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. తప్పుడు నివేదికలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఆ మీడియా సంస్థల్ని ద్వేషించను: రాహుల్
న్యూఢిల్లీ: వాస్తవాలను వక్రీకరిస్తూ తనపై విద్వేషాన్ని ఎగదోసే మీడియాను ద్వేషించనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వీరంతా తనపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టనింపుకుంటున్నారనీ, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, హిందుత్వ ఎజెండా ప్రచారానికి 17 మీడియా సంస్థలు అంగీకరించినట్లు ఇటీవల కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు స్పందించారు. ‘తప్పుడు వార్తలు, అవాస్తవాలతో నాపై విద్వేషాన్ని రగిల్చేవారిని నేను ద్వేషించను. వాళ్లు ద్వేషాన్ని అమ్ముకుంటున్నారు. వారికది కేవలం వ్యాపారం మాత్రమే. ఈ విషయం కోబ్రాపోస్ట్ ఆపరేషన్‌తో బహిర్గతమైంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. -
పచ్చపార్టీ తప్పుడు ప్రచారం: కంగాటి శ్రీదేవి
కర్నూలు జిల్లా : వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో పచ్చ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని పత్తికొండ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. ఆమె శుక్రవారం పత్తికొండలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు హైకోర్టులో ఊరట అంటూ సొంత మీడియాలో తప్పుడు వార్తలు రాయించిందన్నారు. డోన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు తప్పుడు వార్తలతో కోర్టులను కించపరిచే విధంగా కేఈ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. తప్పుడు వార్తల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కంగాటి శ్రీదేవి తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై కేఈ కృష్ణమూర్తి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వార్తా పత్రికలు బాధ్యతగా వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు. -
జగన్‌పై తప్పుడు ప్రచారం మానుకోండి
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల టౌన్: పట్టిసీమ విషయంలో తప్పుడు ప్రచారం, పోలవరం ప్రాజెక్టు చేపట్టాల్సిన ఆవ శ్యకతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించేందుకు వెళ్లిన జగన్మోహన్రెడ్డి గురించి రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హితవు పలికారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. పట్టిసీమ గురించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్షం తెలిపిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రోజుకో వాదంతో కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేని పట్టిసీమపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డగించేందుకే చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు జగన్ ఢిల్లీకి వెళ్లారన్నారు. దీనిని వక్రీకరిస్తూ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుతో పాటు అన్ని అంశాలను చర్చించేందుకు ప్రధానిని జగన్ ఎంపీల బృందంతో కలసి వెళ్లినట్లు చెప్పారు. దీనిని రాద్దాంతం చేస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. చీకటి ఒప్పందాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటని, అందుకే ప్రతి అంశాన్ని అలాగే ఆలోచించి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందించటం బాధ్యతగా భావించిన జగన్మోహన్రెడ్డిపై అవాకులు చవాకులు మాని రాష్ట్ర అభివృద్ధి గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తే మంచిదని హితవుపలికారు.