
సాక్షి, హైదరాబాద్: ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గురించే మాట్లాడుతోందని తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్ కుటుంబానిదేనని అన్నారు. వైఎస్ షర్మిలపై ఆరోపణలు చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఆడపడుచుపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
నీచమైన, దగుల్బాజీ, గజ్జి కుక్కలు వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వైఎస్ షర్మిల ఫిర్యాదుపై తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా కేసును విచారిస్తుందని నమ్మకం ఉందన్నారు. ఏపీలో పరిపాలన అన్నదే లేదని.. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment