సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానిస్తూ రాసిన లేఖపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎంను ఆహ్వానిస్తూ నవంబర్ 25న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండే రాసిన లేఖ నకిలీదంటూ పచ్చ మీడియా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
తొలుత దావోస్‌కు సీఎంకు ఆహ్వానం అందలేదంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలడంతో, ఆ లేఖ నకిలీదని మరో తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ రాసిన లేఖను యథాతథంగా విడుదల చేశామని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
Due to the brutal nature of the negative campaign on the authenticity of the Invitation letter from @wef, we are reiterating, that any false claim will attract legal action.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 19, 2023
The Invitation letter is authentic and was shared as received.@GummallaSrijana@AP_EDB@ApiicOfficial https://t.co/pyeN1lMYax
Comments
Please login to add a commentAdd a comment