ప్రజాస్వామ్యానికి జర్నలిజం ఆయువు | Shekhar Gupta Guest Column On Journalism Greatness | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి జర్నలిజం ఆయువు

Published Sat, Jun 2 2018 2:21 AM | Last Updated on Sat, Jun 2 2018 2:22 AM

Shekhar Gupta Guest Column On Journalism Greatness - Sakshi

భారత జర్నలిజం మర ణించిందనే వార్త నిజం కాదు. అయితే, కొందరు సంపన్న మీడియా అధి పతులు తమను మభ్య పెట్టి బోల్తా కొట్టించిన వారి నిజస్వరూపాన్ని గుర్తించలేకపోవడం మాత్రం ఆందోళన కలి గించే విషయం. కోబ్రాపోస్ట్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ చూశాక దీన్ని చెప్పక తప్పదు.మనం, జర్నలిస్టులం నిజంగా చెడ్డవాళ్లలా కనిపి స్తున్నాం. మనమంతా లొంగిపోవడానికి సిద్ధమని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. దీంతో రాజకీయనాయకులు సంబరపడుతున్నారు. మనమంతా నిజాయితీ లేనివాళ్లమేగాక, నేరపూరిత మైన దురభిమానులమని వ్యాఖ్యాతలు నిందలేస్తు న్నారు.

వాస్తవాలను సరిచూసుకుని పరిశీలించాలనే మన వృత్తికి సంబంధించిన తొలి పాఠాన్ని విస్మరించి తప్పుచేశామన్న భావనతో బాధపడుతున్నాం. స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తాయి. రహస్యంగా కెమెరా అమర్చి రికార్డు చేసినపుడు మీరు మాట్లాడే సాధారణ విషయాలు కూడా తెలివి తక్కువగా కనిపిస్తాయి. హేమాహేమీలైన పెద్దలతో మాట్లాడిన విషయాలను, వారి ముఖ కవళికలను వీడియో కెమెరాల్లో రికార్డు చేసి చూపిస్తే నిజంగా సంచలనమే. కాని, వారిలో ఏ ఒక్కరూ జర్నలిస్టు కాదు. కాబట్టి ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లోని విషయాలు ప్రచారంలోకి వచ్చాక జర్నలిస్టులు సిగ్గుపడాల్సిన అవసరంగాని, సామూహిక సతీ సహగమనానికి పాల్పడాల్సిన అవసరంగాని లేదు. 

రెండో ముఖ్య విషయం ఏమంటే–ఒక బడా మీడియా సంస్థ యజమాని మినహా ఏ ఒక్కరికీ  మతతత్వంతో నిండిన ప్రచారం చేయడానికి పారిశ్రా మికవేత్తలైన వారి స్నేహితుల ద్వారా డబ్బు ఇస్తా మని ఎవరూ చెప్పలేదు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో పేర్కొన్న వారందరూ పేరున్న లిస్టెడ్‌ కంపెనీల యజమానులు. వారు నల్లడబ్బును తెల్లధనంగా మార్చడానికి దళారులుగా ఉండే అవకాశం లేదు.

మూడో ముఖ్య విషయం ఏమంటే– మీడియా పలుకుబడి దాని ఆర్థిక సంపత్తి లేదా శక్తిసామర్ధ్యాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో అత్యంత ధనిక మీడియా సంస్థ టర్నోవర్‌ వంద కోట్ల డాలర్లకు (రూ.6,700 కోట్లు) మించి ఉండదు. మిగతా అత్యధిక సంస్థలది నాలుగు అంకెల కోట్లకు మించదు. బడా కంపెనీలైన రిలయన్స్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ టర్నోవర్‌ నాలుగు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. మనం అమ్ముడు పోవడానికి సిద్ధపడితే ఈ అపర కుబేరులు తమ జేబుల్లోని చిల్లరతో మనల్ని కొనేయగలరు. బురిడీ కొట్టించడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించలేనంత అమాయకులు కాదు ఈ సంపన్న పారిశ్రామివేత్తలు.  

నాలుగో విషయం ఏమంటే–మీడియా పెద్దలు డబ్బుకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కని పిస్తే–మనమంతా అమ్మకానికి అంగీకరించే సరు కులా ప్రజలకు కనిపిస్తాం.  ఇలాంటి స్టింగ్‌ ఆపరేషన్‌ వల్ల జర్నలిస్టులకు చెడ్డపేరొస్తుంది. అందుకే ఏది వాస్తవమో, ఏది కల్పనో పరిశీలించాలి. 

ఐదో అంశం ఏమంటే, అత్యధిక భాషల్లో నడిచే ప్రధాన స్రవంతి మీడియాలో అధిక భాగం సక్ర మంగానే వ్యవహరిస్తోందని నేను చెప్పగలను. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌పై కలత చెందకుండా మనం సరైన ప్రశ్నలు సంధించాలి. మొత్తం మీడియా విశ్వస నీయత దెబ్బ తినకుండా చూసుకోవాలి. అనేక మీడియా సంస్థలతోపాటు వాటిలో పనిచేసే వేలాది మంది జర్నలిస్టులు నిజాయితీగా వ్యవహరిస్తున్నార నేది వాస్తవం. 

ఆరోది, ప్రమాదకరమైన విషయం ఏమంటే, ప్రధాన స్రవంతి మీడియా కుప్పకూలి పోయిందనీ, సామాజిక మాధ్యమమే సర్వ సమస్యలకు పరి ష్కారమార్గమనే భావన. నిజానికి, నరేంద్ర మోదీ సర్కారును ఇబ్బందులకు గురిచేసే కథనాలు వెలుగు లోకి తెచ్చినవన్నీ ప్రధాన మీడియా సంస్థలే. మోదీకి బహుమతిగా లభించిన ఖరీదైన సూటు గురించి వెల్లడించింది కూడా పెద్ద పత్రికే. వాస్తవా నికి, 99 శాతం నకిలీ వార్తలు పుట్టేది సామాజిక మాధ్యమాల నుంచే. 

ఏడో విషయం, పత్రికలు తమ ఆదాయం కోసం వ్యాపార ప్రకటనలపై ఆధారపడే నమూనా నుంచి బయటపడుతున్నాయనే అభిప్రాయాన్ని ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ కలిగిస్తోంది. ఇది వాస్తవం కాదు. మీడియా సంస్థలు ఎలాంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటున్నా అవి  ఎంత స్వేచ్ఛగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయనేదే కీలకం. 

ఇక, ఎనిమిదో అంశం– ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారంపై రాజకీయ నాయకులు సంతోషపడు తున్నారు. వార్తా ప్రసార మాధ్యమాలు ప్రజాస్వా మ్యానికి ముప్పుగా పరిణమించాయని ప్రసిద్ధ విద్యా వేత్త∙ప్రతాప్‌ భాను మెహతా చేసిన దురదృష్టకర వ్యాఖ్యపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఘనశ్యామ్‌ తివారీ ట్వీటర్‌లో వ్యక్తం చేసిన పట్టరాని ఆనందం ఇదే విషయం చెబుతోంది. బీజేపీ–ఆరెస్సెస్, ప్రభు త్వం దీంతో ఏకీభవిస్తాయనే నేను నమ్ముతున్నాను.

తొమ్మిదో విషయం ఏమంటే–స్టింగ్‌ ఆపరేషన్లు ‘పరిశోధనాత్మక జర్నలిజం’ వంటివేనా? ఎలాంటి పారదర్శకత లేకుండా, ఎలాంటి సంస్థాగత పునాది, జవాబుదారీతనం లేకుండా  ఇలాంటి ‘స్టింగ్‌’ ఆప రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు వీటిని అభిమానిస్తాయి. మరికొన్ని (మా ‘ద ప్రింట్‌’ సహా) సంస్థలకు ఇవి నచ్చవు. అనేక ఇతర ప్రదేశాల్లో ఎవరైనా జర్నలిస్టు ఆయుధాల వ్యాపారుల తరఫున దళారిగా నటిస్తూ అవతలి వ్యక్తి తాను వేసే ఎరకు లొంగుతాడా? లేదా అని పరీక్షించడానికి రహస్య కెమెరాతో సంభాషణలు రికార్డు చేస్తే– ఈ జర్న లిస్టును ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలున్నాయి. 

ఇలాంటి స్టింగ్‌ వ్యవహారాలు జర్నలిజమా? కాదా? అనేది చర్చనీయాంశం. ముఖ్యంగా అవతలి వ్యక్తుల అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి  ‘స్టింగ్‌’ వార్తలు ప్రచురించినప్పుడు మనం దీన్ని మనం గట్టిగా ప్రశ్నించాలి. చివరగా మన యజమా నులపై మనకు అనేక అభ్యంతరాలు, నచ్చని విష యాలు, వ్యక్తిగత దురభిప్రాయాలుంటాయి. వీట న్నింటినీ వాస్తవాలుగా ప్రచారం చేయవద్దు.  మీడియా సంస్థల యజమానులందరూ దొంగలు, తెలివిలేని దద్దమ్మలు కాదు. నేను 37 ఏళ్లు (1977– 2014) రెండు బడా మీడియా సంస్థల్లో పనిచేశాను.

వార్తలను డబ్బుకు అమ్మాలని నన్ను ఎప్పుడైనా యజమానులు అడిగారా? అంటే లేదనే చెబుతాను. కాబట్టి, వార్తలను అమ్ముకునే జర్నలిస్టులున్నారేమో తనిఖీ చేసే పనిని ప్రతాప్‌ భానుమెహతా కొనసా గించాలని నా కోరిక. అయితే, భారత జర్నలిజం చచ్చిపోయిందంటూ మరణానికి ముందే సమాధి చేయడం న్యాయం కాదు. మేం చనిపోయామని మీర నుకుంటే ఇది ఖచ్చితంగా గాలివార్తే. మేం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదంగా మారలేదు. మీరు సరైన చానల్స్‌ చూడడం లేదనే భావిస్తాను.

శేఖర్‌ గుప్తా, వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement