Freedom of the press
-
పత్రికా స్వేచ్ఛకే... ‘అమర్నాథ్’ యాత్ర
‘‘పత్రికల మొట్టమొదటి కర్తవ్యం పాఠకులకు పెందలాడే వార్తలందివ్వడమే కాదు, సమ కాలీన ఘటనలను ముందుగానే పసిగట్టి పాఠకలోకానికి ఆగ మేఘాలపై చేర్చడమే కాదు. వాటిని జాతి(దేశం) ఉమ్మడి ఆస్తిగా దఖలు పరచడం కూడా పత్రికల కర్తవ్యమే, పాలకులు సమాచా రాన్ని రహస్యంగా సంపాదించుకుని, ఆ సమాచారాన్ని ప్రజా ఉద్యమాలను, నిరసనలను అణచివేసేందుకు ఆయు ధంగా వాడుకుంటాడు. ప్రజా వ్యతిరేక పాలకుల ఈ ధోర ణిని ఎదుర్కోవాలంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి పత్రికలు ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థగా వ్యవహరిం చక తప్పదు. తమకు అందే సమాచారాన్ని యావత్తూ ప్రజల పరం చేయడమే పత్రికల లక్ష్యం. ఈ కర్తవ్యంలో పాత్రికే యుడి బాధ్యత.... ఒక ఆర్థికవేత్త, ఒక న్యాయవాది బాధ్య తకు దీటైన కర్తవ్యమని మరువరాదు. జర్నలిస్టుల బాధ్యత వాస్తవాల పరిశోధనలో ఒక చరిత్రకారుడికి దీటైన కర్తవ్యం.’’ – లండన్ టైమ్స్ పత్రికకు 23 ఏళ్ల ప్రాయంలో ఎడిటర్ జాన్ డిలేన్ విస్పష్ట ప్రకటన (1852 ఫిబ్రవరి 6–7) పాత్రికేయ రంగంలో పనిచేసే ‘కర్మ’కారులందరికీ వృత్తి ధర్మం పాటించడంలోనూ, కలసికట్టుగా వారందరి యోగ క్షేమాలను కాపాడవలసిన జర్నలిస్టుల యూనియన్ పరువు ప్రతిష్టలను రక్షించడంలోనూ రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయి యూనియన్ నిర్వహణలోనూ అంకితం చేస్తూ వచ్చిన కె. అమర్నాథ్ జన్మదినోత్సవం (సెప్టెంబర్ 15) సందర్భంగా కొన్ని మధురస్మృతులు. ‘దక్కన్ క్రానికల్’ దినపత్రిక ఎడిటోరియల్ విభాగంతో ప్రారంభమైన ఆయన 40 ఏళ్ళ పాత్రికేయ జీవితం, జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో వృత్తిధర్మ రక్షణ కోసం యూనియన్ స్థాపించి, దాని ఆధారంగా ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా ఎదిగి నిరంతరం పాత్రికేయుల సమస్యలకోసం పోరాడుతూ ఇటీ వలనే కన్నుమూసిన నేత అమర్నాథ్. ఆయన జర్నలిజమే పవిత్రమైన ప్రజాసేవగా భావించిన ‘కర్మ’ వీరులందరి కోసం జాతీయస్థాయిలో ‘స్క్రెబ్స్ న్యూస్’ మకుటంతో ప్రారంభించి నడుపుతూ వచ్చిన పత్రికకు ప్రారంభ సంపా దకుడు. ఈ పత్రికకు సంపాదక సలహాదారులుగా ఉన్న వారు ఎస్.ఎన్. సిన్హా, కె. శ్రీనివాసరెడి,్డ దేవేందర్ చింతన్, ఎల్.ఎస్. హెర్డీనియా. ఈ ప్రత్యేక సంచికను జర్నలిస్టు యూనియన్ నాయకులు సంతోష్ కుమార్, కోసూరి అమర్నాథ్లకు అంకితమిచ్చారు. ప్రస్తుతం విశాలాంధ్ర సంపాదకుడైన ఆర్.వి. రామా రావు అన్నట్టుగా ‘తక్కెటలో పెట్టి తూచినట్టుగా ఏది వార్తో, ఏది కాదో అనే విచక్షణతో నిర్ణయించడం జర్నలి స్టులలో ఉండాల్సిన ప్రత్యేక లక్షణం. ఈ విచక్షణ అమ ర్నాథ్లో అపారం. కనుకనే ఆయన తన సొంత ఇబ్బం దులు, సాధకబాధకాలు ఎన్ని ఉన్నా రెండు పర్యాయాలు ఇండియన్ ప్రెస్ కౌన్సిల్‌కు సేవలందించారు. దేశ వ్యాప్తంగా ఉన్న భారత జర్నలిస్టులు తమ వృత్తి ధర్మ నిర్వహణలో ఎదుర్కొనే సమస్యల సందర్భంగా వారి రక్షణకోసం ఒక జాతీయస్థాయి ఉపసంఘాన్ని ఆరుగురు సభ్యులతో నియమించాలని 2011లోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఆ ఉపసంఘానికి మన అమ ర్నాథ్ కన్వీనర్. ఆ ఉపసంఘం 11 రాష్ట్రాలు పర్యటిం చింది. ఆయా రాష్ట్రాల్లో జర్నలిస్టులపై సాగుతున్న దాడుల పట్ల ఉప సంఘం ఆందోళన వెలిబుచ్చుతూ వారి రక్షణ కోసం దేశంలో ప్రత్యేక చట్టం అవసరాన్ని నొక్కి చెప్పింది. 1990ల నుంచీ దేశంలో హత్యలకు గురైన జర్నలిస్టుల జాబితాను ప్రెస్ కౌన్సిల్ ఉపసంఘానికి సమర్పించింది. అమర్నాథ్ కన్వీనర్‌గా నిర్వహించిన ఈ బృహత్ కార్య క్రమానికి, జర్నలిస్టుల సంక్షేమ పథకానికి 2013లో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ 2013లో ప్రత్యేక కార్యాచరణ సూత్రాలను రూపొందించిందని మనం మరువరాదు. జర్నలిస్టులు తమ వృత్తిధర్మ నిర్వ హణలో ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తూ 1950లనుంచీ ఆందోళన చేస్తూ వచ్చారు. దాని ఫలితంగా జస్టిస్ రాజ్యాధ్యక్ష అధ్యక్షునిగా తొలి ప్రధానమంత్రి జవ హర్లాల్ నెహ్రూ హయాంలోనే 1952లో మొట్టమొదటి ప్రెస్ కమిషన్ ఏర్పడింది. జస్టిస్ రాజ్యాధ్యక్ష కమిషన్ వర్కింగ్ జర్నలిస్టుల పాలిట కల్పతరువుగా, హక్కుల పత్రంగా జర్నలిస్టులంతా భావించే ఓ బృహత్ నివేదికను సమర్పించింది. జర్నలిస్టుల సర్వీస్ పరిస్థితులు, వారి కనీస వేతనాలు నిర్ణయించడానికి పార్లమెంటు, శాసన సభలు తక్షణం జోక్యం చేసుకుని దేశంలో ఆరోగ్యకరమైన నిర్ణయాలు చేయాలని కమిషన్ నివేదికను సమర్పించింది. 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ చట్టంలోని 15(2) క్లాజు ప్రకారం వార్తల సేకరణలో లభించిన ఆధారాలను జర్నలిస్టులు లేదా పత్రికలు బహిర్గతం చేయనక్కరలేదు. నిజా నికి ఈ సూత్రాన్ని మహాభారత రచన మొదట్లోనే నన్నయ ఎవరికి తోచిన అర్థాన్ని వారు తీసుకోవచ్చునని నిర్వచించి పోయాడన్న వాస్తవం... పత్రికల పీక నొక్కడానికి సిద్ధ మయ్యే భారత పాలకులకు అందరికీ శిరోధార్యం కాగల దని ఆశిద్దాం. అమర్నాథ్ లాంటి ‘కర్మ’చారుల నిరంతర కృషి వల్లనే జర్నలిస్టుల వేతనాల నిర్ణయానికి, సర్వీసు పరి స్థితులను మెరుగుపర్చడానికి వేజ్ బోర్డులు ఏర్పడక తప్ప లేదు. అయితే సక్రమంగా వాటిని అమలు జరిపే ప్రభుత్వ యంత్రాంగమే ఇప్పటికీ జర్నలిస్టుల పాలిట ‘ఎండమా వులు’గా ఆచరణలో క్రియా శూన్యంగా మిగిలిపోవడమే ఆశ్చర్యకరం. 30 ఏళ్ల క్రితమే ఏర్పడిన రెండు ప్రెస్ కమి షన్లూ చేసిన క్రియాశీలమైన నిర్ణయాలను కూడా ప్రభు త్వాలు బుట్టదాఖలు చేస్తూ వచ్చాయి. అనితరసాధ్యమైన పాత్రికేయ సేవలకుగానూ తగిన స్థానం లేకపోయినా పాత్రికేయ సేవల్లోనే చివరిదాకా మిగిలిపోయిన చిరంజీవి మన అమర్నాథ్. కనుకనే మరోసారి కారల్‌మార్క్స్ గుర్తుకురాక తప్పడం లేదు. ‘పత్రికా స్వేచ్ఛ అనేది పత్రిక వ్యాపార స్వేచ్ఛలో మునిగిపోయినందున రాదు. పత్రికలు ఒక వ్యాపారంగా సాగనప్పుడు పత్రికలకు మిగిలేదే తొలి స్వేచ్ఛ’ అని మరవరాదు. ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు -
మీడియా స్వేచ్ఛ ముసుగులో.. ప్రభుత్వంపై కుట్ర
సాక్షి, అమరావతి/హైదరాబాద్ : పత్రికా స్వేచ్ఛపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ గౌరవం ఉందని పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీఓ 2430 పత్రికా స్వేచ్ఛకు ఏ విధంగానూ భంగకరం కాదన్నారు. కానీ, అవాస్తవాలు, అభూత కల్పనలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న కుట్రతోనే టీడీపీ అనుకూల మీడియా ఈ జీఓపై అనవసర రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. కలాలకు సంకెళ్లు అంటూ దుష్ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నిందని వారు విమర్శించారు. రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు కె. రామచంద్రమూర్తి సచివాలయంలోనూ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వైఎస్సార్సీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనూ, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ హైదరాబాద్‌లో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే దు్రష్పచారం : పేర్ని నిజాయితి, విలువలతో కూడిన జర్నలిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం సదా గౌరవిస్తుందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టంచేశారు. అభూత కల్పనలు, నిరాధార వార్తలు రాసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే మీడియా యాజమాన్యాలు మాత్రమే దురుద్దేశంతో ‘కలాలకు సంకెళ్లు’ అంటూ తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు వార్తలు రాసే పత్రికలు, టీవీ చానళ్లను ఏమీ అనకూడదని వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రిక ఎడిటర్, పబ్లిషర్ల పేరు మీద జీఓలు జారీచేసి మరీ కేసులు పెట్టినప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. తప్పుడు వార్తలు రాసే కలాలకే..: కొడాలి నాని ప్రభుత్వం జారీచేసిన జీఓతో కలాలకు సంకెళ్లు పడలేదని మరో మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) స్పష్టంచేశారు. తనకు భజన చేస్తూ డబ్బా కొట్టే కొన్ని కులాలకు సంకెళ్లు పడ్డాయన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ చంద్రబాబే పాలించాలి.. మేం ఏది చెబితే అది జరగాలి.. భూములు, కమీషన్లు దండుకోవాలనుకునే మీడియా అధిపతులే ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్ మీద సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని విరుచుకుపడ్డారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రాజ్యాంగబద్ధంగానే జీఓ : కె. రామచంద్రమూర్తి అవాస్తవాలు రాసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే మీడియా సంస్థలపై న్యాయస్థానంలో దావా వేసేందుకు శాఖాధిపతులకు అనుమతిస్తూ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే జీఓ జారీచేసిందని ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ పాలసీలు) కె. రామచంద్రమూర్తి స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరంగా వార్తలు రాస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సమాచార శాఖ కమిషనర్‌కు అధికారం ఉండేదన్నారు. వికేంద్రీకరణలో భాగంగా ప్రస్తుత సర్కారు ఆ అధికారాన్ని అన్ని శాఖల అధిపతులకు కల్పించిందన్నారు. దురుద్దేశంతో అవాస్తవాలు రాసే మీడియా సంస్థలే కేసులకు భయపడతాయన్నారు. వర్గ ప్రయోజనాల కోసమే అసత్యాలు : అంబటి రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు స్వప్రయోజనాలు, వర్గ ప్రయోజనాల కోసమే అవాస్తవాలు రాస్తున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ఎంతటి ప్రాధాన్యముందో వ్యక్తుల స్వేచ్ఛకూ అంతే ప్రాధాన్యముందన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే దురుద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. నిజాలు రాసే వారు భయపడక్కర్లేదు : అమర్ కాగా, ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీఓతో సత్యాలు రాసే పాత్రికేయులు, దానిని ప్రచురించే పత్రికా యాజ మాన్యాలు భయపడాల్సిన అవసరంలేదని ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. అసత్యాలు, అభూత కల్పనలు రాస్తున్న మీడియా సంస్థలకే ఇది ఇబ్బందికరమన్నారు. పత్రికా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వానికి సంపూర్ణమైన గౌరవం ఉందని ఆయన స్పష్టంచేశారు. -
ప్రజాస్వామ్యానికి జర్నలిజం ఆయువు
భారత జర్నలిజం మర ణించిందనే వార్త నిజం కాదు. అయితే, కొందరు సంపన్న మీడియా అధి పతులు తమను మభ్య పెట్టి బోల్తా కొట్టించిన వారి నిజస్వరూపాన్ని గుర్తించలేకపోవడం మాత్రం ఆందోళన కలి గించే విషయం. కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ చూశాక దీన్ని చెప్పక తప్పదు.మనం, జర్నలిస్టులం నిజంగా చెడ్డవాళ్లలా కనిపి స్తున్నాం. మనమంతా లొంగిపోవడానికి సిద్ధమని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. దీంతో రాజకీయనాయకులు సంబరపడుతున్నారు. మనమంతా నిజాయితీ లేనివాళ్లమేగాక, నేరపూరిత మైన దురభిమానులమని వ్యాఖ్యాతలు నిందలేస్తు న్నారు. వాస్తవాలను సరిచూసుకుని పరిశీలించాలనే మన వృత్తికి సంబంధించిన తొలి పాఠాన్ని విస్మరించి తప్పుచేశామన్న భావనతో బాధపడుతున్నాం. స్టింగ్ ఆపరేషన్ వీడియోలన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తాయి. రహస్యంగా కెమెరా అమర్చి రికార్డు చేసినపుడు మీరు మాట్లాడే సాధారణ విషయాలు కూడా తెలివి తక్కువగా కనిపిస్తాయి. హేమాహేమీలైన పెద్దలతో మాట్లాడిన విషయాలను, వారి ముఖ కవళికలను వీడియో కెమెరాల్లో రికార్డు చేసి చూపిస్తే నిజంగా సంచలనమే. కాని, వారిలో ఏ ఒక్కరూ జర్నలిస్టు కాదు. కాబట్టి ఈ స్టింగ్ ఆపరేషన్‌లోని విషయాలు ప్రచారంలోకి వచ్చాక జర్నలిస్టులు సిగ్గుపడాల్సిన అవసరంగాని, సామూహిక సతీ సహగమనానికి పాల్పడాల్సిన అవసరంగాని లేదు. రెండో ముఖ్య విషయం ఏమంటే–ఒక బడా మీడియా సంస్థ యజమాని మినహా ఏ ఒక్కరికీ మతతత్వంతో నిండిన ప్రచారం చేయడానికి పారిశ్రా మికవేత్తలైన వారి స్నేహితుల ద్వారా డబ్బు ఇస్తా మని ఎవరూ చెప్పలేదు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్న వారందరూ పేరున్న లిస్టెడ్ కంపెనీల యజమానులు. వారు నల్లడబ్బును తెల్లధనంగా మార్చడానికి దళారులుగా ఉండే అవకాశం లేదు. మూడో ముఖ్య విషయం ఏమంటే– మీడియా పలుకుబడి దాని ఆర్థిక సంపత్తి లేదా శక్తిసామర్ధ్యాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో అత్యంత ధనిక మీడియా సంస్థ టర్నోవర్ వంద కోట్ల డాలర్లకు (రూ.6,700 కోట్లు) మించి ఉండదు. మిగతా అత్యధిక సంస్థలది నాలుగు అంకెల కోట్లకు మించదు. బడా కంపెనీలైన రిలయన్స్, ఆదిత్య బిర్లా గ్రూప్ టర్నోవర్ నాలుగు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. మనం అమ్ముడు పోవడానికి సిద్ధపడితే ఈ అపర కుబేరులు తమ జేబుల్లోని చిల్లరతో మనల్ని కొనేయగలరు. బురిడీ కొట్టించడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించలేనంత అమాయకులు కాదు ఈ సంపన్న పారిశ్రామివేత్తలు. నాలుగో విషయం ఏమంటే–మీడియా పెద్దలు డబ్బుకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కని పిస్తే–మనమంతా అమ్మకానికి అంగీకరించే సరు కులా ప్రజలకు కనిపిస్తాం. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ వల్ల జర్నలిస్టులకు చెడ్డపేరొస్తుంది. అందుకే ఏది వాస్తవమో, ఏది కల్పనో పరిశీలించాలి. ఐదో అంశం ఏమంటే, అత్యధిక భాషల్లో నడిచే ప్రధాన స్రవంతి మీడియాలో అధిక భాగం సక్ర మంగానే వ్యవహరిస్తోందని నేను చెప్పగలను. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై కలత చెందకుండా మనం సరైన ప్రశ్నలు సంధించాలి. మొత్తం మీడియా విశ్వస నీయత దెబ్బ తినకుండా చూసుకోవాలి. అనేక మీడియా సంస్థలతోపాటు వాటిలో పనిచేసే వేలాది మంది జర్నలిస్టులు నిజాయితీగా వ్యవహరిస్తున్నార నేది వాస్తవం. ఆరోది, ప్రమాదకరమైన విషయం ఏమంటే, ప్రధాన స్రవంతి మీడియా కుప్పకూలి పోయిందనీ, సామాజిక మాధ్యమమే సర్వ సమస్యలకు పరి ష్కారమార్గమనే భావన. నిజానికి, నరేంద్ర మోదీ సర్కారును ఇబ్బందులకు గురిచేసే కథనాలు వెలుగు లోకి తెచ్చినవన్నీ ప్రధాన మీడియా సంస్థలే. మోదీకి బహుమతిగా లభించిన ఖరీదైన సూటు గురించి వెల్లడించింది కూడా పెద్ద పత్రికే. వాస్తవా నికి, 99 శాతం నకిలీ వార్తలు పుట్టేది సామాజిక మాధ్యమాల నుంచే. ఏడో విషయం, పత్రికలు తమ ఆదాయం కోసం వ్యాపార ప్రకటనలపై ఆధారపడే నమూనా నుంచి బయటపడుతున్నాయనే అభిప్రాయాన్ని ఈ స్టింగ్ ఆపరేషన్ కలిగిస్తోంది. ఇది వాస్తవం కాదు. మీడియా సంస్థలు ఎలాంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటున్నా అవి ఎంత స్వేచ్ఛగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయనేదే కీలకం. ఇక, ఎనిమిదో అంశం– ఈ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై రాజకీయ నాయకులు సంతోషపడు తున్నారు. వార్తా ప్రసార మాధ్యమాలు ప్రజాస్వా మ్యానికి ముప్పుగా పరిణమించాయని ప్రసిద్ధ విద్యా వేత్త∙ప్రతాప్ భాను మెహతా చేసిన దురదృష్టకర వ్యాఖ్యపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఘనశ్యామ్ తివారీ ట్వీటర్లో వ్యక్తం చేసిన పట్టరాని ఆనందం ఇదే విషయం చెబుతోంది. బీజేపీ–ఆరెస్సెస్, ప్రభు త్వం దీంతో ఏకీభవిస్తాయనే నేను నమ్ముతున్నాను. తొమ్మిదో విషయం ఏమంటే–స్టింగ్ ఆపరేషన్లు ‘పరిశోధనాత్మక జర్నలిజం’ వంటివేనా? ఎలాంటి పారదర్శకత లేకుండా, ఎలాంటి సంస్థాగత పునాది, జవాబుదారీతనం లేకుండా ఇలాంటి ‘స్టింగ్’ ఆప రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు వీటిని అభిమానిస్తాయి. మరికొన్ని (మా ‘ద ప్రింట్’ సహా) సంస్థలకు ఇవి నచ్చవు. అనేక ఇతర ప్రదేశాల్లో ఎవరైనా జర్నలిస్టు ఆయుధాల వ్యాపారుల తరఫున దళారిగా నటిస్తూ అవతలి వ్యక్తి తాను వేసే ఎరకు లొంగుతాడా? లేదా అని పరీక్షించడానికి రహస్య కెమెరాతో సంభాషణలు రికార్డు చేస్తే– ఈ జర్న లిస్టును ప్రాసిక్యూట్ చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి స్టింగ్ వ్యవహారాలు జర్నలిజమా? కాదా? అనేది చర్చనీయాంశం. ముఖ్యంగా అవతలి వ్యక్తుల అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి ‘స్టింగ్’ వార్తలు ప్రచురించినప్పుడు మనం దీన్ని మనం గట్టిగా ప్రశ్నించాలి. చివరగా మన యజమా నులపై మనకు అనేక అభ్యంతరాలు, నచ్చని విష యాలు, వ్యక్తిగత దురభిప్రాయాలుంటాయి. వీట న్నింటినీ వాస్తవాలుగా ప్రచారం చేయవద్దు. మీడియా సంస్థల యజమానులందరూ దొంగలు, తెలివిలేని దద్దమ్మలు కాదు. నేను 37 ఏళ్లు (1977– 2014) రెండు బడా మీడియా సంస్థల్లో పనిచేశాను. వార్తలను డబ్బుకు అమ్మాలని నన్ను ఎప్పుడైనా యజమానులు అడిగారా? అంటే లేదనే చెబుతాను. కాబట్టి, వార్తలను అమ్ముకునే జర్నలిస్టులున్నారేమో తనిఖీ చేసే పనిని ప్రతాప్ భానుమెహతా కొనసా గించాలని నా కోరిక. అయితే, భారత జర్నలిజం చచ్చిపోయిందంటూ మరణానికి ముందే సమాధి చేయడం న్యాయం కాదు. మేం చనిపోయామని మీర నుకుంటే ఇది ఖచ్చితంగా గాలివార్తే. మేం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదంగా మారలేదు. మీరు సరైన చానల్స్ చూడడం లేదనే భావిస్తాను. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
భారత్‌లో పత్రికాస్వేచ్ఛ దారుణం!
133వ స్థానంలో భారత్.. పాక్‌కు 147 వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ మరీ దారుణమని వెల్లడైంది. 180 దేశాల్లో జరిపిన వార్షిక సర్వేల్లో భారత్ 133వ స్థానంలో (గతేడాది 135) నిలిచింది. జర్నలిస్టులకు వస్తున్న బెదిరింపులు, వారిపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని మోదీ ఉదాసీనంగా ఉన్నారని సూచీలు తెలుపుతున్నాయి. జర్నలిస్టులు, బ్లాగర్ల భద్రత ఆధారంగా ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ విడుదల చేసిన ఈ వివరాల ప్రకారం.. ఫిన్లాంండ్ వరుసగా ఆరో ఏడాదీ మొదటి స్థానంలో నిలిచింది. పాక్ 147, చైనా 176వ స్థానంలో ఉన్నాయి. -
‘సాక్షి’ సిబ్బందిపై దాడికి ఖండన
→రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలం →ఐజేయూ నాయకుడు అంబటి విమర్శ →ఎమ్మెల్యే జలీల్ఖాన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ →తహశీల్దార్, అడిషనల్ సీపీలకు వినతి →జిల్లాలో పలుచోట్ల ప్రదర్శన, ధర్నాలు విజయవాడ (భవానీపురం) : రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, పోలీస్ చర్యలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రదర్శన, ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన అలంకార్ సెంటర్, ఏలూరు రోడ్డు, అప్సర సెంటర్ మీదుగా చల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ జర్నలిస్టులందరూ మానవహారంగా ఏర్పడి ‘పత్రికా స్వేచ్ఛను కాపాడాలి’, ‘జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలి’, ‘సాక్షి ఫొటో, వీడియో జర్నలిస్టులపై దాడి ఘటనలో ఎమ్మెల్యే జలీల్ఖాన్ను అరెస్ట్ చేయాలి’,‘జలీల్‌ఖాన్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న అనంతరం ధర్నా నిర్వహించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించారు. దాడికి ఖండన... ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాజధాని భూములపై వచ్చిన కథనాలపై వాటి మూలాలు చెప్పాలంటూ ‘సాక్షి’ విలేకరులను పోలీసులు ప్రశ్నించడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో సాక్షి ఫొటో, వీడియో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. జలీల్‌ఖాన్‌తో పాటు దాడికి పాల్పడిన ఆయన అనుచరులపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జలీల్ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. అడిషనల్ సీపీ, తహశీల్దార్లకు వినతి ధర్నా అనంతరం జర్నలిస్టులు తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు ఆర్.శివరావుకు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత పోలీస్ కమిషనరేట్‌లోని అడిషనల్ సీపీ మహేష్‌చంద్ర లడ్హాకు మరొక వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.జయరాజ్, అర్బన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.రామారావు, దారం వెంకటేశ్వరరావు, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు జి.రాజా రమేష్, ఏపీ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబశివరావు, కోశాధికారి టి.వి రమణ, అమరావతి వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ సభ్యులు, యూనియన్ నాయకులు షేక్ బాబు, డి నాగరాజు, కొండా రాజేశ్వరరావు, వసంత్, షఫీ ఉల్లా, వి.పుల్లయ్య, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కొందరిని విడదీయటం సరికాదు... 2004లో ఏవిధంగా అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇవ్వాలని అంబటి కోరారు. స్వార్థంతో కొందరిని విడతీయటం సరికాదన్నారు. రెండే ళ్లుగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడాది క్రితం ప్రభుత్వానికి రూ.98 లక్షలు చెల్లించినా ఇంతవరకు ఎవరికీ ఉపయోగపడలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం విలేకరి స్వామినాయుడుపై మట్టి మాఫియా దాడిలోని దోషులందరినీ అరెస్ట్ చేసి భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. జర్నలిస్ట్‌ల సమస్యలపై ప్రభుత్వం పక్షపాత ధోరణిని విడనాడాలన్నారు. సమాజ హితం కోరే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిందితులు ఎవరైనా ఉపేక్షించకుండా వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పత్రికలు సమాజాన్ని ప్రతిబింబించాలి
పత్రికలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. నిజాలను నిర్భయంగా రాయాలి. పాఠకులు మెచ్చేలా సమాచారం ఇవ్వాలి. పత్రికా స్వాతంత్య్రం దుర్వినియోగమైదే దేశ అభివృద్ధిని కుంగ దీస్తుంది. ఒక వ్యక్తిని పొగడడానికో, లేదా తెగడడానికో పత్రికలు పని చేయకూడదు. -మాజీ మంత్రి, ఎంపీ కెహెచ్ మునియప్ప కోలారు : పత్రికలు ఒక వ్యక్తిని పొడడం లేదా తెగడడం వంటివి చేయకుండా ని ష్ఠూరమైనా నిజాలనే బయటకు తేవాల ని, పాఠకులు మెచ్చేలా సమాజాన్ని ప్రతి బింబించేలా ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కేహెచ్ మునియప్ప అ న్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయుల దినోత్సవంలో మాట్లాడు తూ దేశ ప్రజలకు మార్గదర్శనం చేయాల్సిన పత్రికా స్వాతంత్య్రం దుర్వినియోగమైతే అది దేశ అభివృద్ధిని కుంటు పరుస్తుందన్నారు. ఓ రాజకీయ నాయకుడు లేదా పారిశ్రామిక వేత్తను మెప్పించడాని కి పత్రికలు పనిచేయరాదన్నారు. స్వా తంత్య్ర పోరాటంలో, సాహిత్య ప్రపంచంలో జిల్లాలోని పలువురు పాలు పంచుకుని జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకు వ చ్చారు. కోలారు పత్రికా రంగంలో జి నా రాయణస్వామి ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం, పాత్రికేయుడు నరసింహమూర్తి సంపాదకీయం రాజకీయ నాయకుల కళ్లు తెరిపించే విధంగా ఉండేదన్నారు. నేడు రాజకీయాలు అథఃపాతాళాకానికి వెళ్లి గాంధీ పేరును స్మరించడానికి కూడా అర్హత కోల్పోయాయన్నారు. దీని లో మార్పులు రావడానికి ఎన్నికల ప్రక్రియలో సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. బెళ్గాం సమావేశాలు అయిన తరువాత సీంతో సమావేశమై పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌కు లభించిన ప్రచారం ము ఖ్యమంత్రి అన్నభాగ్య యోజనకు దక్కక పోవడం విచారించదగిన విషయమన్నా రు. తాలూకాలోని 23 గ్రామ పంచాయతీలలో 15 పంచాయతీలలో తన మ ద్దతుదారులే విజయం సాధించారని, డీ కే రవి మృతిపై అనవసర రాజకీయాలు చేశారన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి స్థలం చూపించాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులను సన్మానిం చా రు. ఇదే సమయంలో టెన్త్ మరియు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిం చిన పాత్రికేయుల పిల్లలను ప్రతిభా పురస్కారాలతో సన్మానించారు. కార్యక్రమంలో విధాన పరిషత్ మాజీ సభ్యుడు వి ఆర్ సుదర్శన్, నగరసభ అధ్యక్షుడు ముబారక్, పాత్రికేయుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మణి, జిల్లా సంఘం అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి మునిరాజు తదితరులు పాల్గొన్నారు.