133వ స్థానంలో భారత్.. పాక్‌కు 147
వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ మరీ దారుణమని వెల్లడైంది. 180 దేశాల్లో జరిపిన వార్షిక సర్వేల్లో భారత్ 133వ స్థానంలో (గతేడాది 135) నిలిచింది. జర్నలిస్టులకు వస్తున్న బెదిరింపులు, వారిపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని మోదీ ఉదాసీనంగా ఉన్నారని సూచీలు తెలుపుతున్నాయి. జర్నలిస్టులు, బ్లాగర్ల భద్రత ఆధారంగా ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ విడుదల చేసిన ఈ వివరాల ప్రకారం.. ఫిన్లాంండ్ వరుసగా ఆరో ఏడాదీ మొదటి స్థానంలో నిలిచింది. పాక్ 147, చైనా 176వ స్థానంలో ఉన్నాయి.
భారత్‌లో పత్రికాస్వేచ్ఛ దారుణం!
Published Thu, Apr 21 2016 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement