పత్రికలు సమాజాన్ని ప్రతిబింబించాలి | Newspapers reflect society | Sakshi
Sakshi News home page

పత్రికలు సమాజాన్ని ప్రతిబింబించాలి

Published Thu, Jul 2 2015 1:36 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

పత్రికలు సమాజాన్ని ప్రతిబింబించాలి - Sakshi

పత్రికలు సమాజాన్ని ప్రతిబింబించాలి

పత్రికలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. నిజాలను నిర్భయంగా రాయాలి. పాఠకులు మెచ్చేలా సమాచారం ఇవ్వాలి. పత్రికా స్వాతంత్య్రం దుర్వినియోగమైదే దేశ అభివృద్ధిని కుంగ దీస్తుంది. ఒక వ్యక్తిని పొగడడానికో, లేదా తెగడడానికో పత్రికలు పని చేయకూడదు.
     -మాజీ మంత్రి, ఎంపీ కెహెచ్ మునియప్ప
 
కోలారు : పత్రికలు ఒక వ్యక్తిని పొడడం లేదా తెగడడం వంటివి చేయకుండా ని ష్ఠూరమైనా నిజాలనే బయటకు తేవాల ని, పాఠకులు మెచ్చేలా సమాజాన్ని ప్రతి బింబించేలా ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కేహెచ్ మునియప్ప అ న్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయుల దినోత్సవంలో మాట్లాడు తూ దేశ ప్రజలకు మార్గదర్శనం చేయాల్సిన పత్రికా స్వాతంత్య్రం దుర్వినియోగమైతే అది దేశ అభివృద్ధిని కుంటు పరుస్తుందన్నారు. ఓ రాజకీయ నాయకుడు లేదా పారిశ్రామిక వేత్తను మెప్పించడాని కి పత్రికలు పనిచేయరాదన్నారు. స్వా తంత్య్ర పోరాటంలో, సాహిత్య ప్రపంచంలో జిల్లాలోని పలువురు పాలు పంచుకుని జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకు వ చ్చారు. కోలారు పత్రికా రంగంలో జి నా రాయణస్వామి ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం, పాత్రికేయుడు నరసింహమూర్తి సంపాదకీయం రాజకీయ నాయకుల కళ్లు తెరిపించే విధంగా ఉండేదన్నారు. నేడు రాజకీయాలు అథఃపాతాళాకానికి వెళ్లి గాంధీ పేరును స్మరించడానికి కూడా అర్హత కోల్పోయాయన్నారు. దీని లో మార్పులు రావడానికి ఎన్నికల ప్రక్రియలో సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. బెళ్గాం సమావేశాలు అయిన తరువాత సీంతో సమావేశమై పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌కు లభించిన ప్రచారం ము ఖ్యమంత్రి అన్నభాగ్య యోజనకు దక్కక పోవడం విచారించదగిన విషయమన్నా రు.

తాలూకాలోని 23 గ్రామ పంచాయతీలలో 15 పంచాయతీలలో తన మ ద్దతుదారులే విజయం సాధించారని, డీ కే రవి మృతిపై అనవసర రాజకీయాలు చేశారన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి స్థలం చూపించాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులను సన్మానిం చా రు. ఇదే సమయంలో టెన్త్ మరియు ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధిం చిన పాత్రికేయుల పిల్లలను ప్రతిభా పురస్కారాలతో సన్మానించారు. కార్యక్రమంలో విధాన పరిషత్ మాజీ సభ్యుడు వి ఆర్ సుదర్శన్, నగరసభ అధ్యక్షుడు ముబారక్, పాత్రికేయుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మణి, జిల్లా సంఘం అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి మునిరాజు తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement