న్యూఢిల్లీ: దేశీయంగా స్వతంత్ర స్థానిక న్యూస్ స్టార్టప్‌ల కోసం టెక్ దిగ్గజం జీఎన్‌ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా పేరిట యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. దీని కింద ఆర్థికంగా, నిర్వహణపరంగా ఆయా అంకుర సంస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో నాలుగు నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకోసం ఎకోస్, డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్‌తో జట్టు కట్టింది. భారతీయ భాషల్లో ప్రచురిస్తున్న న్యూస్ స్టార్టప్ సంస్థలేవైనా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేది అక్టోబర్ 18. తొలి బ్యాచ్ కోసం 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషింగ్ సంస్థలను ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment