కాన్‌బెర్రా: వార్తా కథనాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు చెల్లించాలని ప్రముఖ డిజిటల్ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలను జరపాలను ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్‌బర్గ్ శుక్రవారం పేర్కొన్నారు. లేదంటే కోడ్ ఉల్లంఘించిన కారణంగా సదరు కంపెనీలపై దాదాపు 7 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 28 వరకు సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించి చట్టం అమల్లోకి తెస్తామని జోష్ ఫ్రైడెన్‌బర్గ్ వివరించారు. (అమెరికాలో టిక్‌టాక్ నిషేధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు)
చాలాకాలంగా తమ కంటెంట్‌ను ఉపయోగిస్తూ డిజిటల్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఆరోపించాయి. కాపీరైట్ కింద తమకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే తమ కంటెంట్‌ను వాడి డిజిటల్ సంస్థలు ఉచితంగా డబ్బును కూడగడుతున్నాయని ఫిర్యాదు చేశాయి. తమ ఉద్యోగులు ఎంతో కష్టపడి వార్తా కథనాలు ప్రసారం చేస్తే వాటిని ఇష్టారాజ్యంగా, ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వాడుకుంటున్నాయని పలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో ఆస్ర్టేలియా ప్రభుత్వం అక్కడి మీడియాకు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ ముసాయిదా కోడ్ ఫేస్‌బుక్, గూగుల్ లాంటి అతి పెద్ద డిజిటల్ సంస్థలకే వర్తిస్తాయని, త్వరలోనే మరిన్ని సంస్థలకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (సెక్యూరిటీ గార్డుకు రూ.31 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment