adithya birla group
-
పరిశ్రమలకు రాచబాట
పారిశ్రామిక రంగంలో ఏపీ మరింత పురోగమించేలా బిర్లా గ్రూప్ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తోంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎంతో ఆసక్తితో ఉన్నాం. ఏపీలోని విశాల తీర ప్రాంతం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మానవ వనరులకు తోడు అన్ని విధాలా సహకారం అందించే ప్రభుత్వం.. వెరసి పెట్టుబడుల రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నా. జగన్ మంచి విజన్ ఉన్న యువ ముఖ్యమంత్రి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూపు సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పర్యవసానంగా ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందడుగు వేస్తున్నారని చెప్పారు. అనుమతులను సరళతరం చేయడంతో పాటు ఎలాంటి సాయం కావాలన్నా వేగంగా స్పందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలన్నింటి వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ.2,470 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెలకొల్పిన క్లోర్ ఆల్కాలిక్ మాన్యుఫాక్చరింగ్ (కాస్టిక్ సోడా యూనిట్) ప్లాంట్‌ను గురువారం ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి కంపెనీలు ఎంతో నమ్మకంతో రాష్ట్రంలో అడుగులు వేయడంతో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. చాలా ఆనందంగా ఉంది ► ఈ రోజు ఒక మంచి రోజు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అభినందనలు. మొత్తం మూడు విడతల్లో పూర్తయ్యే గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ► ప్రత్యక్షంగా 1,300, పరోక్షంగా 1,150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గొప్ప కార్యక్రమం ఇది. దేశ వ్యాప్తంగా రూ.6 లక్షల కోట్ల మార్కెట్ విలువ, దాదాపుగా లక్షా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మంచి వ్యక్తి, మంచి పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా. ఇలాంటి వాళ్లు మన ప్రభుత్వంపై నమ్మకంతో ఇక్కడకు వచ్చి పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి మంచి పరిణామం. ► నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇచ్చే విధంగా ప్రత్యేకంగా చట్టాన్నే తీసుకువచ్చాం. వీళ్లు (ఆదిత్య బిర్లా గ్రూపు) ఈ చట్టాన్ని గౌరవిస్తూ ఇక్కడ పరిశ్రమ స్థాపనకు చూపిన చొరవతో దేశంలో మిగిలిన వారందరికీ గొప్ప ముందడుగు అవుతుంది. కాలుష్యానికి తావు లేకుండా చర్యలు ► ఇదివరకు 2010–12 మధ్య పరిశ్రమ ఏర్పాటులో కంపెనీ రకరకాల ఇబ్బందులు పడుతూ వచ్చింది. కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే విషయంలో ఈ ప్రాంతంలో పలు గ్రామాల ప్రజలు దానిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. చివరకు గ్రాసిమ్ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టి అడుగులు ముందుకేసింది. ► పరిశ్రమలు ఏర్పాటైతే వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ప్రజల్లో నెలకొన్న భయాలను పొగొట్టకుండా గత పాలకులు ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు అప్పగిస్తూ సంతకాలు చేశారు. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తూ ఒక మార్గం చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టించగలిగితే వేల కోట్లు పెట్టుబడులు రావడమే కాకుండా, సుమారు 2,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో సమస్యలన్నింటినీ అధిగమించేందుకు పరిష్కారం చూపుతూ అడుగులు వేశాం. ► కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వినియోగంలోకి వస్తే దాని వల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువవుతాయని, అందువల్ల ఆ ప్లాంట్‌ను పెట్టకూడదని ఆదిత్య బిర్లా గ్రూపు యాజమాన్యాన్ని ఒప్పించాం. స్థానికులలో ఉన్న భయాందోళనలు పోగొట్టి, పరిశ్రమకు అనుమతులు మంజూరు చేశాం. వ్యర్థాల వల్ల నీరు కలుషితం కాకుండా టెక్నాలజీలో అనేక మార్పులు చేయించాం. ► గతంలో ఇదే ప్లాంట్‌లో ఉన్న మెర్క్యురీ మెంబ్రేన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అయ్యే పాత పద్దతిలో మార్పు చేయించాం. ఎలక్ట్రాలసిస్‌లో కూడా మెరుగైన విధానాన్ని క్రోడీకరించి కాలుష్యానికి ఏవిధమైన అవకాశం ఇవ్వకుండా అడుగులు ముందుకు వేశాం. ► జీరో లిక్విడ్ వేస్ట్ విధానంలో లిక్విడ్‌వేస్ట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడా ఉండకూడదని యాజమాన్యాన్ని ఒప్పించగలిగాం. వీటన్నింటి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ప్రధానంగా సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) నిధులతో పరిశ్రమ పరిసర గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ముఖ్యమంత్రి ముఖచిత్ర జ్ఞాపికను వైఎస్ జగన్‌కు అందజేస్తున్న బిర్లా 131 మందిపై కేసుల ఎత్తివేతకు జీవో ► కంపెనీ ప్రతినిధుల కోసం మీ (వేదిక దిగువన ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు) అనుమతితో కొన్ని విషయాలు ఇంగ్లిష్‌లో చెబుతున్నా. ఇది ఆసియాలో అత్యాధునిక ప్లాంట్. దేశంలో కాస్టిక్ సోడా ఉత్పత్తిలో ఏకైక అతి పెద్ద యూనిట్. భవిష్యత్‌లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుంది. ► గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమ పరిసర గ్రామాల్లో 131 మంది అమాయకులపై పాలకులు పోలీసుల ద్వారా అక్రమంగా కేసులు పెట్టించారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ అక్రమ కేసులన్నింటినీ ఎత్తి వేసేందుకు ఈ రోజే జీవో 321 జారీ చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు భరత్‌రామ్, వంగా గీత, చింతా అనురాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్ మాధవిలత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్లాంట్‌లో కలియదిరిగిన సీఎం తొలుత చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రత్యేక వాహనంలో సీఎం వైఎస్ జగన్‌తో కలిసి కలియదిరుగుతూ ప్లాంట్ పని తీరును స్వయంగా చూపించారు. కాలుష్య రహిత పరిశ్రమ కోసం వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. ఆదిత్య బిర్లా గ్రూపు తరఫున వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన జగన్ ముఖచిత్ర జ్ఞాపికను కుమార మంగళం బిర్లా సీఎంకు స్వయంగా అందజేశారు. -
రీబాక్‌ను సొంతం చేసుకున్న ఇండియన్ కంపెనీ!
ముంబై: కుమారమంగళం బిర్లా గ్రూపు కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్.. స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ రీబాక్ మార్కెటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తద్వారా స్పోర్ట్స్‌వేర్, లైఫ్‌స్టయిల్ వేర్ విభాగంలోకి ప్రవేశానికి వీలు కలిగింది. న్యూయార్క్‌కు చెందిన ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపుతో దీర్ఘకాలిక లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రీబాక్ మార్కెటింగ్, బ్రాండింగ్ హక్కులను ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపు ఇటీవలే సొంతం చేసుకోవడం గమనార్హం. ఏషియా మార్కెట్లో ఈ ఒప్పందం కింద భారత్‌తోపాటు, ఆసియాన్ దేశాల్లో మార్కెటింగ్, విక్రయ హక్కులు ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు లభించనున్నాయి. ఆథెంటింక్ బ్రాండ్ గ్రూపుతో ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు ఇప్పటికే వ్యాపార అనుబంధం ఉంది. ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపునకు చెందిన ఫరెవర్ 21 మార్కెటింగ్ హక్కుల విషయంలో ఒప్పందం కొనసాగుతుండగా.. రీబాక్ బ్రాండ్ విషయంలోనూ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోనున్నాయి. అంతర్జాతీయంగా రీబాక్ బ్రాండ్ హక్కులు ఆదిదాస్ నుంచి ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపునకు బదిలీ కానుండడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కొన్ని షరతులకు లోబడి ఈ ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. రీబాక్ ఆదాయం గడిచిన రెండు దశాబ్దాల్లో భారత్‌లో రీబాక్ ఎంతో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నట్టు ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్ ఎండీ అభిషేక్ దీక్షిత్ తెలిపారు. 2021 ఆర్థిక సంత్సరంలో రీబాక్ ఇండియా రూ.4.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 93 శాతం తగ్గింది. -
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫార్మా ఫండ్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ ప్రారంభించింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 4తో ముగుస్తుంది. ప్రధానంగా దేశీ ఫార్మా, హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్, స్పెషాలిటీ కెమికల్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్, తయారీ సేవలందించే సంస్థల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000. ధరలు, నియంత్రణసంస్థల నిబంధనలపరమైన ఒత్తిళ్లన్నీ అధిగమించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఫార్మా విభాగం మెరుగైన రాబడులు అందించగలవని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సీఈవో ఎ. బాలసుబ్రమణ్యన్ తెలిపారు. -
ప్రజాస్వామ్యానికి జర్నలిజం ఆయువు
భారత జర్నలిజం మర ణించిందనే వార్త నిజం కాదు. అయితే, కొందరు సంపన్న మీడియా అధి పతులు తమను మభ్య పెట్టి బోల్తా కొట్టించిన వారి నిజస్వరూపాన్ని గుర్తించలేకపోవడం మాత్రం ఆందోళన కలి గించే విషయం. కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ చూశాక దీన్ని చెప్పక తప్పదు.మనం, జర్నలిస్టులం నిజంగా చెడ్డవాళ్లలా కనిపి స్తున్నాం. మనమంతా లొంగిపోవడానికి సిద్ధమని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. దీంతో రాజకీయనాయకులు సంబరపడుతున్నారు. మనమంతా నిజాయితీ లేనివాళ్లమేగాక, నేరపూరిత మైన దురభిమానులమని వ్యాఖ్యాతలు నిందలేస్తు న్నారు. వాస్తవాలను సరిచూసుకుని పరిశీలించాలనే మన వృత్తికి సంబంధించిన తొలి పాఠాన్ని విస్మరించి తప్పుచేశామన్న భావనతో బాధపడుతున్నాం. స్టింగ్ ఆపరేషన్ వీడియోలన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తాయి. రహస్యంగా కెమెరా అమర్చి రికార్డు చేసినపుడు మీరు మాట్లాడే సాధారణ విషయాలు కూడా తెలివి తక్కువగా కనిపిస్తాయి. హేమాహేమీలైన పెద్దలతో మాట్లాడిన విషయాలను, వారి ముఖ కవళికలను వీడియో కెమెరాల్లో రికార్డు చేసి చూపిస్తే నిజంగా సంచలనమే. కాని, వారిలో ఏ ఒక్కరూ జర్నలిస్టు కాదు. కాబట్టి ఈ స్టింగ్ ఆపరేషన్‌లోని విషయాలు ప్రచారంలోకి వచ్చాక జర్నలిస్టులు సిగ్గుపడాల్సిన అవసరంగాని, సామూహిక సతీ సహగమనానికి పాల్పడాల్సిన అవసరంగాని లేదు. రెండో ముఖ్య విషయం ఏమంటే–ఒక బడా మీడియా సంస్థ యజమాని మినహా ఏ ఒక్కరికీ మతతత్వంతో నిండిన ప్రచారం చేయడానికి పారిశ్రా మికవేత్తలైన వారి స్నేహితుల ద్వారా డబ్బు ఇస్తా మని ఎవరూ చెప్పలేదు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్న వారందరూ పేరున్న లిస్టెడ్ కంపెనీల యజమానులు. వారు నల్లడబ్బును తెల్లధనంగా మార్చడానికి దళారులుగా ఉండే అవకాశం లేదు. మూడో ముఖ్య విషయం ఏమంటే– మీడియా పలుకుబడి దాని ఆర్థిక సంపత్తి లేదా శక్తిసామర్ధ్యాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో అత్యంత ధనిక మీడియా సంస్థ టర్నోవర్ వంద కోట్ల డాలర్లకు (రూ.6,700 కోట్లు) మించి ఉండదు. మిగతా అత్యధిక సంస్థలది నాలుగు అంకెల కోట్లకు మించదు. బడా కంపెనీలైన రిలయన్స్, ఆదిత్య బిర్లా గ్రూప్ టర్నోవర్ నాలుగు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. మనం అమ్ముడు పోవడానికి సిద్ధపడితే ఈ అపర కుబేరులు తమ జేబుల్లోని చిల్లరతో మనల్ని కొనేయగలరు. బురిడీ కొట్టించడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించలేనంత అమాయకులు కాదు ఈ సంపన్న పారిశ్రామివేత్తలు. నాలుగో విషయం ఏమంటే–మీడియా పెద్దలు డబ్బుకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కని పిస్తే–మనమంతా అమ్మకానికి అంగీకరించే సరు కులా ప్రజలకు కనిపిస్తాం. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ వల్ల జర్నలిస్టులకు చెడ్డపేరొస్తుంది. అందుకే ఏది వాస్తవమో, ఏది కల్పనో పరిశీలించాలి. ఐదో అంశం ఏమంటే, అత్యధిక భాషల్లో నడిచే ప్రధాన స్రవంతి మీడియాలో అధిక భాగం సక్ర మంగానే వ్యవహరిస్తోందని నేను చెప్పగలను. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై కలత చెందకుండా మనం సరైన ప్రశ్నలు సంధించాలి. మొత్తం మీడియా విశ్వస నీయత దెబ్బ తినకుండా చూసుకోవాలి. అనేక మీడియా సంస్థలతోపాటు వాటిలో పనిచేసే వేలాది మంది జర్నలిస్టులు నిజాయితీగా వ్యవహరిస్తున్నార నేది వాస్తవం. ఆరోది, ప్రమాదకరమైన విషయం ఏమంటే, ప్రధాన స్రవంతి మీడియా కుప్పకూలి పోయిందనీ, సామాజిక మాధ్యమమే సర్వ సమస్యలకు పరి ష్కారమార్గమనే భావన. నిజానికి, నరేంద్ర మోదీ సర్కారును ఇబ్బందులకు గురిచేసే కథనాలు వెలుగు లోకి తెచ్చినవన్నీ ప్రధాన మీడియా సంస్థలే. మోదీకి బహుమతిగా లభించిన ఖరీదైన సూటు గురించి వెల్లడించింది కూడా పెద్ద పత్రికే. వాస్తవా నికి, 99 శాతం నకిలీ వార్తలు పుట్టేది సామాజిక మాధ్యమాల నుంచే. ఏడో విషయం, పత్రికలు తమ ఆదాయం కోసం వ్యాపార ప్రకటనలపై ఆధారపడే నమూనా నుంచి బయటపడుతున్నాయనే అభిప్రాయాన్ని ఈ స్టింగ్ ఆపరేషన్ కలిగిస్తోంది. ఇది వాస్తవం కాదు. మీడియా సంస్థలు ఎలాంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటున్నా అవి ఎంత స్వేచ్ఛగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయనేదే కీలకం. ఇక, ఎనిమిదో అంశం– ఈ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై రాజకీయ నాయకులు సంతోషపడు తున్నారు. వార్తా ప్రసార మాధ్యమాలు ప్రజాస్వా మ్యానికి ముప్పుగా పరిణమించాయని ప్రసిద్ధ విద్యా వేత్త∙ప్రతాప్ భాను మెహతా చేసిన దురదృష్టకర వ్యాఖ్యపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఘనశ్యామ్ తివారీ ట్వీటర్లో వ్యక్తం చేసిన పట్టరాని ఆనందం ఇదే విషయం చెబుతోంది. బీజేపీ–ఆరెస్సెస్, ప్రభు త్వం దీంతో ఏకీభవిస్తాయనే నేను నమ్ముతున్నాను. తొమ్మిదో విషయం ఏమంటే–స్టింగ్ ఆపరేషన్లు ‘పరిశోధనాత్మక జర్నలిజం’ వంటివేనా? ఎలాంటి పారదర్శకత లేకుండా, ఎలాంటి సంస్థాగత పునాది, జవాబుదారీతనం లేకుండా ఇలాంటి ‘స్టింగ్’ ఆప రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు వీటిని అభిమానిస్తాయి. మరికొన్ని (మా ‘ద ప్రింట్’ సహా) సంస్థలకు ఇవి నచ్చవు. అనేక ఇతర ప్రదేశాల్లో ఎవరైనా జర్నలిస్టు ఆయుధాల వ్యాపారుల తరఫున దళారిగా నటిస్తూ అవతలి వ్యక్తి తాను వేసే ఎరకు లొంగుతాడా? లేదా అని పరీక్షించడానికి రహస్య కెమెరాతో సంభాషణలు రికార్డు చేస్తే– ఈ జర్న లిస్టును ప్రాసిక్యూట్ చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి స్టింగ్ వ్యవహారాలు జర్నలిజమా? కాదా? అనేది చర్చనీయాంశం. ముఖ్యంగా అవతలి వ్యక్తుల అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి ‘స్టింగ్’ వార్తలు ప్రచురించినప్పుడు మనం దీన్ని మనం గట్టిగా ప్రశ్నించాలి. చివరగా మన యజమా నులపై మనకు అనేక అభ్యంతరాలు, నచ్చని విష యాలు, వ్యక్తిగత దురభిప్రాయాలుంటాయి. వీట న్నింటినీ వాస్తవాలుగా ప్రచారం చేయవద్దు. మీడియా సంస్థల యజమానులందరూ దొంగలు, తెలివిలేని దద్దమ్మలు కాదు. నేను 37 ఏళ్లు (1977– 2014) రెండు బడా మీడియా సంస్థల్లో పనిచేశాను. వార్తలను డబ్బుకు అమ్మాలని నన్ను ఎప్పుడైనా యజమానులు అడిగారా? అంటే లేదనే చెబుతాను. కాబట్టి, వార్తలను అమ్ముకునే జర్నలిస్టులున్నారేమో తనిఖీ చేసే పనిని ప్రతాప్ భానుమెహతా కొనసా గించాలని నా కోరిక. అయితే, భారత జర్నలిజం చచ్చిపోయిందంటూ మరణానికి ముందే సమాధి చేయడం న్యాయం కాదు. మేం చనిపోయామని మీర నుకుంటే ఇది ఖచ్చితంగా గాలివార్తే. మేం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదంగా మారలేదు. మీరు సరైన చానల్స్ చూడడం లేదనే భావిస్తాను. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కొత్త బ్యాంకింగ్ లెసైన్సులు..రేసుకు టాటా
ముంబై: కొత్త బ్యాంకుల ఏర్పాటు రేసు నుంచి టాటా గ్రూప్ వైదొలగింది. బ్యాంక్ లెసైన్స్ కోసం చేసిన దరఖాస్తును వాపసు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించినట్లు తెలిపింది. ప్రస్తుతం గ్రూప్ అనుసరిస్తున్న ఆర్థిక సేవల విధానం ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయ స్థాయిలోనూ తమ వ్యాపారాలకు అవసరమైన మద్దతును అందిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాటా సన్స్ పేర్కొంది. రేసులో బిర్లా, అంబానీ... కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల రేసు నుంచి టాటా సన్స్ తప్పుకున్నప్పటికీ ఇంకా 24 సంస్థలు పోటీలో నిలిచాయి. వీటిలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ తదితరాలున్నాయి. కాగా, రెండు నెలల క్రితమే వేణుగోపాల్ ధూత్‌కు చెందిన వీడియోకాన్ కూడా రంగం నుంచి తప్పుకోవడం గమనార్హం. గ్రూప్‌నకు చెందిన దేశ, విదేశీ వ్యాపార అవసరాలకు తగిన స్థాయిలో తమ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం సహకరిస్తున్నందున బ్యాంకింగ్ దరఖాస్తునుఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ వివరించిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీంతోపాటు వాటాదారుల అభిప్రాయంమేరకు వెనక్కు తగ్గుతున్నట్లు పేర్కొన్నదని వెల్లడించింది. వెరసి ఇందుకు తాము అనుమతించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తగిన సమయంలో మళ్లీ ప్రస్తుతానికి బ్యాంకింగ్ ఏర్పాటు అంశం నుంచి తప్పుకుంటున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పరిణామాలను గమనిస్తూనే ఉంటామని టాటా గ్రూప్ పేర్కొంది. తగిన సమయంలో మళ్లీ బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆహ్వానంమేరకు జూలైలో మొత్తం 26 కంపెనీలు కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేశాయి. జనవరికల్లా బ్యాంకింగ్ లెసైన్స్‌ల ఎంపికను రిజర్వ్ బ్యాంక్ చేపడుతుందని ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇటీవలే తెలిపారు. గత 20ఏళ్లలో 12 బ్యాంకుల ఏర్పాటుకు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ లెసైన్స్‌లు జారీ చేసింది. వీటిలో 10 బ్యాంకులను 1993 మార్గదర్శకాల ప్రకారం అనుమతించగా, 2001లో సవరించిన నిబంధనల ప్రకారం మరో రెండు బ్యాంకులు(కోటక్ మహీంద్రా, యస్ బ్యాంక్) ఏర్పాటయ్యాయి.