
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ ప్రారంభించింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 4తో ముగుస్తుంది. ప్రధానంగా దేశీ ఫార్మా, హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్, స్పెషాలిటీ కెమికల్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్, తయారీ సేవలందించే సంస్థల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000. ధరలు, నియంత్రణసంస్థల నిబంధనలపరమైన ఒత్తిళ్లన్నీ అధిగమించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఫార్మా విభాగం మెరుగైన రాబడులు అందించగలవని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సీఈవో ఎ. బాలసుబ్రమణ్యన్ తెలిపారు.