న్యూఢిల్లీ: అంకుర సంస్థలకి మరింతగా పెట్టుబడులు లభించేలా, ఇన్వెస్టర్లకు కూడా వెసులుబాట్లు కల్పించేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్టప్‌లలో ఏంజెల్ ఫండ్స్ చేసే పెట్టుబడులపై గరిష్ట పరిమితిని ప్రస్తుతమున్న రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.
అలాగే కనిష్ట పరిమితిని రూ. 25 లక్షల నుంచి రూ. 10 లక్షలకు తగ్గించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. నిర్దిష్ట అర్హతలు, రిస్కు సామరŠాధ్యలు ఉండే ’అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ల’ను మాత్రమే ఏంజెల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది.
ఏంజెల్ ఫండ్స్ తమ దగ్గరున్న మొత్తం నిధుల నుంచి, ఏదైనా ఒక స్టార్టప్‌లో 25 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయరాదనే నిబంధనను తొలగించనుంది. తద్వారా పెట్టుబడులపరంగా మరింత వెసులుబాటు కల్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment