Angel
-
ఏంజెల్ ఫండ్ పెట్టుబడి పరిమితి పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకి మరింతగా పెట్టుబడులు లభించేలా, ఇన్వెస్టర్లకు కూడా వెసులుబాట్లు కల్పించేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్టప్‌లలో ఏంజెల్ ఫండ్స్ చేసే పెట్టుబడులపై గరిష్ట పరిమితిని ప్రస్తుతమున్న రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.అలాగే కనిష్ట పరిమితిని రూ. 25 లక్షల నుంచి రూ. 10 లక్షలకు తగ్గించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. నిర్దిష్ట అర్హతలు, రిస్కు సామరŠాధ్యలు ఉండే ’అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ల’ను మాత్రమే ఏంజెల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది.ఏంజెల్ ఫండ్స్ తమ దగ్గరున్న మొత్తం నిధుల నుంచి, ఏదైనా ఒక స్టార్టప్‌లో 25 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయరాదనే నిబంధనను తొలగించనుంది. తద్వారా పెట్టుబడులపరంగా మరింత వెసులుబాటు కల్పించనుంది. -
ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమకు రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చిత్ర నిర్మాత కోర్టుకు వెళ్లారు. ఒకప్పుడు పాపులర్ హీరోగా కోలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన ఆయన గతేడాదిలో 'మామన్నన్' సినిమానే తన చివరి ప్రాజెక్ట్ అని ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడు పాలిటిక్స్‌లో ఆయన బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ అప్పటికే ఒప్పుకున్న ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆయన నష్టపరిహారం కట్టించాలని ఆ చిత్ర నిర్మాత రామశరవణన్ కోర్టుకు వెళ్లారు.'మామన్నన్' సినిమా కంటే ముందే 'ఏంజెల్' అనే చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, ఆనంది కథానాయికలు. 2018లో ప్రారంభమైన ఈ మూవీని కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. మరో 20 శాతం చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం నిర్మాత రూ.13 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యింది. ఇంతలో 'మామన్నన్' తన చివరి చిత్రమని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. దీంతో తను భారీగా నష్టపోయానని అందుకుగాను తనకు నష్టపరిహారంగా రూ. 25 కోట్లు ఉదయనిధి స్టాలిన్ చెల్లించేలా కోర్టు ఆదేశించాలని పిటీషన్లో నిర్మాత రామశరవణన్ పేర్కొన్నారు.ఏంజెల్ చిత్ర నిర్మాత వేసిన పిటీషన్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తరపున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో జస్టిస్ డీకారామన్ ముందుకు తాజాగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మొదట నిర్మాత తరపున న్యాయవాది తియాగేశ్వరన్ వాదనలు వినిపిస్తూ.. 'ఏంజెల్' చిత్రానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఎనిమిది రోజులు షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన సహకరించకపోవడం వల్ల సినిమా ఆగిపోయిందన్నారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు భారీగా నష్టం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఉదయనిధి స్టాలిన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో మాట్లాడుతూ.. ఏంజెల్ చిత్రానికి సంబంధించి ఉదయనిధి పలుమార్లు చిత నిర్మాతను సంప్రదించారని, సినిమాలో తన సన్నివేశాలు పూర్తి అయ్యాయని చెప్పిన తర్వాతే మామన్నన్‌లో నటించారని తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి డీకారామన్.. అక్టోబర్ 28న తుది తీర్పు వెళ్లడిస్తామని ప్రకటించారు. -
PM Narendra Modi: ఫిన్‌టెక్ ప్రోత్సాహానికి పాలసీల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పాలసీల్లో తగు మార్పులు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం, దేశీయంగా పరిశోధనలు.. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ. 1 లక్ష కోట్లు కేటాయించడం, వ్యక్తిగత డేటా భద్రత చట్టం రూపకల్పన వంటి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అంకుర సంస్థలను దెబ్బతీసే సైబర్ మోసాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలకు సూచించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2024లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు. ఆర్థిక సేవలను అందరికీ అందుబాటలోకి తేవడంలో ఫిన్‌టెక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గడిచిన పదేళ్లలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని ఆయన ప్రశంసించారు. డిజిటల్ టెక్నాలజీతో పారదర్శకత పెరిగిందని, దీనికి నగదు బదిలీ పథకంలాంటివి నిదర్శనమని వివరించారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ త్రయంతో నగదు లావాదేవీలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగభాగం భారత్‌లోనే ఉంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, పండుగల వేళ దేశ ఎకానమీ, క్యాపిటల్ మార్కెట్లలో వేడుకల వాతావరణం నెలకొందని చెప్పారు. అధునాతన టెక్నాలజీలు, నిబంధనలతో ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పారదర్శకమైన, సమర్ధమంతమైన భారీ యంత్రాంగాలను రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు. గూగుల్ పేలో యూపీఐ సర్కిల్.. జీఎఫ్ఎఫ్ సందర్భంగా గూగుల్ పే యూపీఐ సర్కిల్‌ను ఆవిష్కరించింది. బ్యాంకు ఖాతాలను లింక్ చేయకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేందుకు యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా యాడ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అటు ఈ–రూపీ (యూపీఐ వోచర్లు), రూపే కార్డులకు సంబంధించి మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను, యూపీఐ లైట్లో ఆటోపే ఆప్షన్‌ను కూడా గూగుల్ పే ఆవిష్కరించింది. -
ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌లకు బూస్ట్
వాషింగ్టన్: ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తూ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. దీన్నొక చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని టీఐఈ సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ అనిత మన్వానీ అన్నారు. దేశ వృద్ధికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతుండడాన్ని చూడొచ్చు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా, సేవలరంగం, తయారీలో మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా నేపథ్యంలో ఏంజెల్ ఇన్వెస్టర్లను పన్ను నుంచి మినహాయించే ఇలాంటి చట్టాలే అవసరం. ఇది భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నిబంధనల అమలుకు బదులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుంది. అంతిమంగా ఈ నిర్ణ యం భారత్–యూఎస్ కారిడార్‌లో ఏంజెల్ పెట్టు బడులను పెంచుతుంది’’అని మన్వానీ వివరించారు. పలువురు ఇతర పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిర్ణయాన్ని అభినందించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో ఏంజెల్ ట్యాక్స్ రద్దు కోసం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. స్టార్టప్‌కు నిధులు పెరుగుతాయి.. భారత ప్రభుత్వ నిర్ణయంతో స్టార్టప్‌లకు స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి పెట్టుబడుల సా యం పెరుగుతుందని యూఎస్ ఇండియా వ్యూహా త్మక భాగస్వామ్య సంస్థ పేర్కొంది. ఏంజెల్ ట్యాక్స్ రద్దు ద్వైపాక్షిక సాంకేతిక సహకారం, ఆవిష్కరణల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని యూ ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ తెలిపింది. ‘‘భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థకు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. స్టార్టప్ ఎకోసిస్టమ్ రాణించేందుకు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పోటీతత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది’’ అని యూఎస్ఏ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కరుణ్ రిషి పేర్కొన్నారు. రిపాట్రియేషన్లోనూ సంస్కరణలు అవసరం స్వదేశానికి నిధుల తరలింపులో(రిపాట్రియేషన్ )నూ సంస్కరణలు అవసరమని మన్వానీ అభిప్రాయపడ్డారు. ‘‘రిపాట్రియేషన్ అన్నది అధిక శాతం ఎన్ఆర్ఐలు, ఇన్వెస్టర్లకు ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలోనూ నిబంధనలను సడలించాలి. నేడు ఎవరైనా యూఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిపా్రటియేషన్కు సంబంధించి ఇదే విధమైన నిబంధనలు, నియంత్రణలను భారత్ కూడా పాటించొచ్చు’’అని మన్వానీ తెలిపారు. -
స్టార్టప్‌ల్లో రూ. 200 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ (ఐపీవీ) అంకుర సంస్థల్లో ఈ ఏడాది సుమారు రూ. 150–200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్ బన్సల్ తెలిపారు. డ్రోన్, స్పోర్ట్స్, హెల్త్, ఫిన్‌టెక్ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తమ దగ్గర రూ. 1,200 కోట్ల నిధులు ఉండగా ఇప్పటివరకు రూ. 750 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. 2023లో 56 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వీటిల్లో 46 కొత్తగా ఇన్వెస్ట్ చేసినవి కాగా మిగతావి ఫాలో–ఆన్ పెట్టుబడులని బన్సల్ పేర్కొన్నారు. గతేడాది సగటున 61 శాతం మేర రాబడులతో 14 సంస్థల నుంచి వైదొలిగినట్లు చెప్పారు. 2023లో ఒక మీడియా స్టార్టప్, కూవర్స్, స్పోర్టిడో మొదలైన వాటి నుంచి ఐపీవీ పూర్తిగా నిష్క్రమించింది. మీడియా వెంచర్లో పెట్టుబడులపై దాదాపు 200 శాతం రాబడి అందుకున్నట్లు బన్సల్ వివరించారు. -
స్టార్టప్‌లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్‌లిస్టెడ్ స్టార్టప్‌లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్‌ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్‌ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్‌లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
ఈ దేశాల నుంచి స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు.. పన్ను లేదు
న్యూఢిల్లీ: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర 21 దేశాల నుంచి అన్‌లిస్టెడ్ భారత స్టార్టప్‌ల్లోకి వచ్చే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సింగపూర్, నెదర్లాండ్స్, మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడులకు ఈ అవకాశం కల్పించలేదు. ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ ఆస్ట్రియా, కెనడా, చెక్ రిపబ్లిక్, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, ఐస్ లాండ్, జపాన్, కొరియా, రష్యా, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ ఏంజెల్ ట్యాక్స్ మినహాయింపు జాబితాలో ఉన్నాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను ఏంజెల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. అనంతరం కొన్ని రకాల విదేశీ ఇన్వెస్టర్ల తరగతులను మినహాయించాలంటూ పరిశ్రమ నుంచి వినతులు రావడంతో.. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. -
స్టార్టప్స్‌కు ఊరట..!
న్యూఢిల్లీ: ఏంజెల్ ట్యాక్స్ నోటీసులతో ఆందోళన చెందుతున్న స్టార్టప్ సంస్థలకు ఊరటనిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. స్టార్టప్ సంస్థల నిర్వచనాన్ని మార్చడంతో పాటు నిబంధనలను సడలించింది. ఇకపై రూ. 25 కోట్ల దాకా పెట్టుబడులపై పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపులు వర్తింపచేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రమోటర్లు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేసే పెట్టుబడులకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. ‘అర్హత కలిగిన లిస్టెడ్ కంపెనీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ చేసే పెట్టుబడులు కూడా ఈ పరిమితి పరిధిలోకి రావు. దీంతో పెట్టుబడులు రూ. 25 కోట్లకు మించినప్పటికీ స్టార్టప్ సంస్థలు పన్నుపరమైన ప్రయోజనాలు పొందవచ్చు‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఇప్పటిదాకా ఏంజెల్ ఇన్వెస్టర్లు సహా ఇతరత్రా సమీకరించిన మొత్తం పెట్టుబడులు రూ. 10 కోట్ల దాకా మాత్రమే ఈ పరిమితి ఉండేది. పన్ను రాయితీల ప్రయోజనాలు కల్పించే క్రమంలో స్టార్టప్ సంస్థ నిర్వచనాన్ని కూడా కేంద్రం మార్చింది. టర్నోవరు పరిమితి రూ. 25 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచింది. ఏర్పాటైనప్పట్నుంచీ ఏ ఆర్థిక సంవత్సరంలోనూ టర్నోవరు రూ. 100 కోట్లు దాటని సంస్థను స్టార్టప్‌గా పరిగణిస్తారు. పన్నుపరమైన ప్రయోజనాలు పొందేందుకు ఉద్దేశించిన కాల వ్యవధిని 7 సంవత్సరాల నుంచి పదేళ్లకు పెంచారు. పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను 2021 మార్చి 31 లోగా సమీక్షించే అవకాశం ఉంది. ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇప్పటికే జారీ చేసిన ట్యాక్స్ నోటీసులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులకు సీబీడీటీ సూచించింది. పెద్ద స్టార్టప్స్‌కూ ప్రయోజనం.. తాజాగా సడలించిన నిబంధనలతో పెద్ద స్టార్టప్‌లకు కూడా ప్రయోజనం చేకూరగలదని లక్ష్మీకుమరన్ అండ్ శ్రీధరన్ అటార్నీస్ సంస్థ పార్ట్నర్ ఎస్ వాసుదేవన్ పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పైబడి టర్నోవరు ఉండి, షేర్ల కేటాయింపు ద్వారా సమీకరించిన ప్రీమియం పెట్టుబడులపై ట్యాక్స్‌లు కట్టాల్సిన స్టార్టప్‌లకు కూడా ఊరట లభిస్తుందని వివరించారు. ఇప్పటిదాకా రూ. 5 కోట్ల కన్నా తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసే ఏంజెల్ ఇన్వెస్టర్లకూ పన్నుపోటు ఉంటోందని, తాజాగా పెట్టుబడుల పరిమితిని రూ. 25 కోట్లకు పెంచడం ద్వారా ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్స్కి మించి ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని డీపీఐఐటీ కార్యదర్శి రమేష్ అభిషేక్ చెప్పారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన స్టార్టప్స్ 16,000 పైచిలుకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సవరించిన నిబంధనల ప్రకారం.. రూ. 100 కోట్ల నికర విలువ లేదా టర్నోవరు రూ. 250 కోట్ల పైచిలుకు ఉన్న లిస్టెడ్ కంపెనీలు.. అర్హత కలిగిన స్టార్టప్స్‌లో చేసే పెట్టుబడులపై పన్నుపరమైన మినహాయింపులు పొందవచ్చు. ఇది రూ. 25 కోట్ల పెట్టుబడుల పరిమితికి అదనంగా ఉంటుంది. ఇక, అర్హత కలిగిన స్టార్టప్‌లలో ప్రవాస భారతీయులు, ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ (కేటగిరి1) మొదలైనవి చేసే ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మినహాయింపులు లభిస్తాయి. ఇవి కూడా రూ. 25 కోట్ల పరిమితికి అదనంగా ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న స్టార్టప్ సంస్థ డీపీఐఐటీ గుర్తింపు పొంది ఉండి, నిర్దిష్ట అసెట్స్‌లో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపులు పొందవచ్చు. స్థిరాస్తి, రూ. 10 లక్షలు దాటిన రవాణా వాహనాల కొనుగోలు, వ్యాపార అవసరార్థం తప్పితే ఇతరత్రా సంస్థలకు రుణాలివ్వడం, షేర్ల కొనుగోలు మొదలైన వాటికి ఈ మినహాయింపులు వర్తించవు. అయితే, ఆయా రంగాల్లోనే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు మినహాయింపు ఉంటుంది. స్టార్టప్ సంస్థలు ఈ మినహాయింపులు పొందాలంటే సమీకరించిన నిధుల వినియోగం గురించి డీపీఐఐటీకి సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే సరిపోతుంది. దీన్ని ఆ తర్వాత కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు డిపార్ట్మెంటు పంపుతుంది. ఏంజెల్ పెట్టుబడులకు మార్గం సుగమం.. నిబంధనలను సడలించడంపై పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. తాజా పరిణామంతో స్టార్టప్ సంస్థల్లో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్లు మళ్లీ పుంజుకోగలవని ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ (ఐఏఎన్) సహ వ్యవస్థాపకురాలు పద్మజా రూపారెల్ చెప్పారు. స్టార్టప్‌లకు పెద్ద అడ్డంకి తొలిగిపోయినట్లవుతుందని లోకల్‌సర్కిల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా చెప్పారు. ‘ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్కు మరింత ఊతమిస్తుంది. స్టార్టప్‌ల సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉన్న భారత్.. త్వరలోనే అగ్రస్థానానికి చేరేందుకు ఇది దోహదపడుతుంది‘ అని టీఐఈ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంత విభాగ గౌరవ చైర్మన్ సౌరభ్ శ్రీవాస్తవ చెప్పారు. వివాదమిదీ.. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)) నిబంధన స్టార్టప్ సంస్థలకు సమస్యాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. స్టార్టప్ సంస్థ నికర మార్కెట్ విలువకు మించి వచ్చిన పెట్టుబడులను ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించి 30 శాతం పన్ను రేటు వర్తింపచేసేలా ఈ నిబంధన ఉంది. స్టార్టప్‌లలో పెట్టుబడుల నిబంధనలు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 2012లో ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఇది ఏంజెల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నందున.. దీన్ని ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధన కింద ఇటీవల నోటీసులు జారీ అవుతుండటంతో పలు స్టార్టప్‌లు ఆందోళన చెందుతున్నాయి. దీన్ని ఎత్తివేయాలంటూ స్టార్టప్ సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఏంజెల్ ట్యాక్స్ సెక్షన్ ఎత్తివేయాలి
ముంబై: స్టార్టప్ సంస్థల్లో ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై పన్ను విధించాలన్న వివాదాస్పద సెక్షన్‌ను ఆదాయ పన్ను చట్టం నుంచి తొలగించాలని ముంబై ఏంజెల్స్ నెట్వర్క్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్య పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని సంస్థ సీఈవో నందిని మన్సింఖా పేర్కొన్నారు. అయితే, వివాద పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ.. సెక్షన్ ఎత్తివేయడం అంత సులభంగా జరగకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. స్టార్టప్, ఏంజెల్ ఇన్వెస్టర్ పదాలను సముచితంగా నిర్వచించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని నందిని చెప్పారు. స్టార్టప్స్‌కి సంబంధించిన పన్నుల చట్టాలు దుర్వినియోగమవుతున్నాయనే ఉద్దేశంతో వీటిల్లోకి వచ్చే పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక సెక్షన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56 (2) ప్రకారం.. సముచిత వేల్యుయేషన్‌కి మించి స్టార్టప్స్‌లో చేసే పెట్టుబడులను ప్రీమియంగా పరిగణించి, 30 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ఇప్పటికే, తొలి దశలో పెట్టుబడులు పెట్టే ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు దొరక్క సతమతమవుతున్న స్టార్టప్స్‌కి ఇది సమస్యాత్మకంగా మారింది. దీనివల్ల ఏంజెల్ ఇన్వెస్టర్లు పూర్తిగా దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్టార్టప్ సంస్థలు.. ఈ సెక్షన్‌ను ఎత్తివేయాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి సర్టిఫికేషన్ పొందిన సంస్థలకు దీన్నుంచి కొంత మినహాయింపు ఉంటుందని కేంద్రం చెబుతోంది. -
కొత్త ఏంజిల్
అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేశారు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్లు ఈ పంజాబీ బ్యూటీ తలుపు తట్టాయి. కానీ మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారీ సొగసరి. అలా ఓ కథ నచ్చి కోలీవుడ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారామె. ఉదయనిధి స్టాలిన్ హీరోగా కేఎస్ అదియమాన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ఒక హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ ఎంపికయ్యారు. ఈ సినిమాకు ‘ఏంజిల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్గా ఆనంది నటిస్తారని టాక్. ఆల్రెడీ పాయల్ తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేశారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్నారు పాయల్ రాజ్‌పుత్. మరోవైపు తెలుగులో హిట్ సాధించిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తమిళంలో రీమేక్ కానుంది. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తారు. ఇందులో కథానాయికగా ఇంకా ఎంపిక కాలేదు. పాయల్‌నే తీసుకున్నా ఆశ్చర్యపోవడానికి లేదు. -
ఆకాశంలో ‘దేవకన్య’
దేవకన్య నేలకు దిగి వస్తున్నట్లు భలే ఉంది కదా.. మేఘాలు రకరకాల ఆకారాలతో మనకు రోజూ కన్పిస్తాయి. కానీ ఇలా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మనం చూస్తాం. చూడగానే సరిపోదు వెంటనే సెల్ఫోన్లోనో లేదా కెమెరాలోనో బంధించాలి. అప్పుడే ఆ అద్భుతాన్ని మనం నలుగురికి పంచగలం. అచ్చం డానీ ఫెరారోలాగా అన్నమాట. డానీ ఫెరారో అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన వాడు. 57 ఏళ్ల ఫెరారో తన భార్యతో కలసి కారులో వెళుతుండగా ‘దేవకన్య’ కనిపించిందట. ఆ సమయంలో కొన్ని వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న తనకు ఆ రూపం ఎంతో సాంత్వన చేకూర్చిందని ఫెరారో చెబుతున్నాడు. అయితే ఆ ఆకారం కొద్దిసేపే ఉందట. తన కెమెరాలో బంధించి ఆ రూపాన్ని శాశ్వతంగా పదిల పరుచుకోవాలని భావించాడట. దీంతో ప్రపంచ నలుమూలల్లో నెటిజన్లు ఈ దేవకన్యను దర్శించుకునే భాగ్యం దక్కింది. -
సరికొత్త స్వర్గం చూపించాం!
‘పూలు అమ్మలకి నాన్నలు పెడతారు.. ఐ నో ఇట్. మరి, ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు.. అంత భయపడేవాడివి ఎందుకు పెట్టావ్? తల్లో మల్లెపూలు పెట్టాలి’ అంటూ ముద్దు ముద్దు మాటలతో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో వెంకటేశ్‌ని బ్లాక్మెయిల్ చేసిన బాలనటుడు నాగ అన్వేష్ ‘వినవయ్యా రామయ్యా’తో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ యువహీరో నటించిన చిత్రం ‘ఏంజెల్’. హెబ్బాపటేల్ కథానాయిక. ‘బాహుబలి’ పళని దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగ అన్వేష్ మీడియాతో ముచ్చటించారు. ► రెండో సినిమా సోషియో ఫాంటసీ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. కథ నచ్చింది. అందుకే చేశా. ‘ఏంజెల్’ సినిమాకు ఒకటిన్నర సంవత్సరం స్క్రిప్ట్ వర్క్ జరిగింది. 4 నెలలు షూటింగ్ చేశాం. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి ఆర్నెల్లు పట్టింది. నేను, సప్తగిరి ఒక విగ్రహాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాం. ఆ సమయంలోనే హెబ్బా పటేల్ స్వర్గం నుంచి భూమికి వస్తుంది. ఆమె మమ్మల్ని ఎందుకు కలిసింది? మా జర్నీ ఎలా సాగింది? అన్నదే కథ. ► ఈ సినిమాలో నాది ఫన్‌తో కూడుకున్న కొంచెం మాస్ క్యారెక్టర్. వినోద ప్రధానంగా ఉంటుంది. కథ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ► నా మొదటి సినిమాకంటే ఈ సినిమాకి కాస్త ఫిజిక్ పెంచా. నటన పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. శాటిలైట్ రైట్స్ కూడా బాగానే అమ్ముడయ్యాయి. తెలుగులో రిలీజ్ చేశాక తమిళం, హిందీలోనూ ‘ఏంజెల్’ ని విడుదల చేయాలనే ఆలోచన ఉంది. ► సినిమాలో ముందు 12 నిముషాల గ్రాఫిక్స్ అనుకున్నాం. కానీ, అవి కాస్తా 40 నిముషాలకు పెరిగాయి. అందుకే సినిమా విడుదల కాస్త ఆలస్యమైంది. స్వర్గాన్ని సరికొత్త తరహాలో చూపిస్తున్నాం. క్లైమాక్స్ ఫైట్ కూడా గ్రాఫిక్స్‌తోనే తీశాం. సినిమా పట్ల మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. -
దేవుణ్ణి చూడాలనుకుంటే షోకి రండి! – సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
‘‘ఇళయరాజా ఉన్న కాలంలో మనం ఉండడం అదృష్టం. అదీ మనందరి ముందు ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మరింత అదృష్టం. (‘మ్యూజిక్’) దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజా (ఇళయరాజా) గారి షోకి రండి. ఆయన సంగీత దర్శకత్వంలో ‘చిరుగాలి వీచెనే’ పాట పాడే చాన్స్, ఆయన్ని కలసే చాన్స్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకులు–నటుడు–దర్శక–రచయిత ఆర్పీ పట్నాయక్. ఈ ఆదివారం (నవంబర్ 5న) హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ‘‘ఇళయరాజా లైవ్ షోకి ఫ్రీ పాసులు కావాలా? అయితే... ‘రాజా కాలింగ్ ఆజా’ పోటీలో పాల్గొనండి’’ అని ‘సాక్షి’ పాఠకులకు ‘షో క్విజ్’ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి అనూహ్య స్పందన లభించింది. వాళ్లలో సరైన సమాధానాలు రాసి పంపిన 600 మందిని ఎంపిక చేశారు. 600 మందిలోంచి 200 మంది లక్కీ మెంబర్స్‌ను ఆర్పీ పట్నాయక్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంపిక చేశారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా, ‘వినవయ్యా రామయ్యా’, ఈ శుక్రవారం విడుదలవుతోన్న ‘ఏంజెల్’లో హీరోగా నటించిన నాగ అన్వేష్ మాట్లాడుతూ– ‘‘రాజాగారి పాటల్లో ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటంటే నాకెంతో ఇష్టం. టీవీలో ఆ పాట ఎప్పుడొచ్చినా... పనులన్నీ పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుంటా. లక్కీ డ్రాలో పాసులు పొందిన 200 మందికి కంగ్రాట్స్. నా ఫ్రెండ్స్, స్టాఫ్ కూడా పాసులు అడుగుతున్నారు. ఒక్క ఎక్స్రా›్ట పాస్ ఉంటే నాకు ఇవ్వండి’’ అన్నారు. ‘మీ దగ్గర ఒక్క పాస్ ఉంటే... ఇంట్లో ఇల్లాలిని తీసుకువెళతారా? వంటింట్లో ప్రియురాలిని తీసుకువెళతారా?’ అని నాగ అన్వేష్ని అడగ్గా... ‘‘నేను ఇంట్లో కూర్చుని ఇద్దరినీ రాజాగారి లైవ్ కన్సర్ట్కి పంపిస్తా’’ అని నవ్వేశారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం హ్యపీగా ఉందని హెబ్బా పటేల్ చెప్పారు. విజేతలు (200 మంది)... తమ వివరాలను ‘సాక్షి’ వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే, వాళ్ల మొబైల్ నంబర్లకు ఎసెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 2, 3, 4వ తేదీల్లో హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ఆఫీసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విజేతలు తమ మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. సుదూర ప్రాంతాల వాళ్లు 5వ తేదీ మధ్యహ్నం 2 గంటలలోపు వచ్చి పాసులు పొందవచ్చు. ఫార్వార్డ్ మెసేజ్‌లకు పాసులు ఇవ్వబడవు. ఏ నంబర్‌కి మెసేజ్ వస్తే.. ఆ నంబర్‌కే పాస్ ఇవ్వబడును. -
సినిమాయే దైవం.. బలం.. బాధ్యత
‘‘ఇటీవల యూనిట్ అంతా ‘ఏంజెల్’ సినిమా చూశాం. చాలా బాగుంది. సంతోషంగా అనిపించింది. ఆఫ్ స్క్రీన్ చేసి వర్క్‌ని స్క్రీన్‌పైన చూస్తే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. దాన్నే ప్యాషన్ అంటారు’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘ఏంజెల్’ నవంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ నాకు సినిమానే దైవం, బలం, బాధ్యత. ‘ఏంజెల్’ సినిమా బావుందంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం సంతోషంగా ఉంది. నాగ అన్వేష్ డ్యాన్సులు, ఫైట్స్, స్క్రీన్ ప్రెజన్స్ చూసి, త్వరలోనే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకడు అవుతాడనిపించింది. ‘ఏంజెల్’ సినిమా బిజినెస్ చూసిన తర్వాత నిర్మాతగా నమ్మకం కలిగింది. తెలుగులో నవంబర్ 3న రిలీజ్ చేస్తాం. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారం లేదా రెండు వారాల గ్యాప్‌తో అక్కడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మరో రెండు భాషల్లో రిలీజ్
‘వినవయ్యా రామయ్యా’ ఫేమ్ నాగ అన్వేష్, ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఏంజెల్’. రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శ కత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన్ సాగర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ మూవీ ఇది. 45 నిమిషాలకు పైగా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) సీన్స్ ఉండటంతో నాలుగు నెలలు విజువల్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ చేశాం. స్నో వైట్ అండ్ ద హంట్స్మాన్, థార్, ఎవెంజర్స్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ‘ఏంజెల్’ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరిగాయి. తెలుగులో నవంబర్ 3న తెలుగులో, వారం తర్వాత హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కళ్లు చెదిరే గ్రాఫిక్స్, బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. సెంటిమెంట్ సన్నివేశాల్లో నాగ అన్వేష్ పలికించిన ఎమోషన్స్ సూపర్బ్’’ అన్నారు పళని. ‘‘పాటలు, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిందన్నారు అన్వేష్. ఈ సినిమాకి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి. -
అతని ప్రపంచం అరక్షణంలో మారిపోయింది!
యెరూషలేము మందిరం దగ్గరలో బెతెస్థ అనే కోనేరుంది. ఒక దేవదూత కొన్నిసార్లు వచ్చి ఆ నీటిని కదిలించినపుడు ముందుగా ఎవరు దిగుతారో వారు ఎలాంటి రోగమున్నా బాగుపడతారని నమ్మేవారు. అలా బాగుపడేందుకు రకరకాల రోగులు, వికలాంగులు వందల సంఖ్యలో అక్కడ పడి ఉన్నారు. ఒక వ్యాధి వల్ల 38 ఏళ్లుగా పడకకంటుకుపోయిన ఒక వ్యక్తి కూడా వారిలో ఉన్నాడు. ఒకరోజు యేసు అక్కడికొచ్చి ‘స్వస్థతపడాలనుకొంటున్నావా?’ అనడిగాడు. దేవదూత నీటిని కదిలించినప్పుడు తనను ముందు నీళ్లలోకి దించేవారు లేక తానింకా రోగిగా ఉన్నానన్నాడా వ్యక్తి. సాక్షాత్తూ దేవుడే వచ్చి తన ఎదుట నిలబడి మాట్లాడుతుంటే, ఆయనకు ఒక దేవదూత సంగతి చెబుతున్నాడా అవివేకి. యేసు ఎవరు? అక్కడి దేవాలయంలో ఆరాధనలు పొందుతున్న దేవుడు. ఆయనే స్వయంగా తన వద్దకొస్తే, తనను ముందుగా నీళ్లలోకి దించలేకపోతున్న లోకాన్నే ఇంకా పట్టుకు వేలాడుతున్న దౌర్భాగ్యం అతనిది. కొందరంతే, ఆశీర్వాదం తమను వెదుక్కుంటూ వచ్చినా, శాపానికే పట్టం కడతారు! అయితే అతని 38 ఏళ్ల దుర్భర జీవితానికి, నిరాశకు యేసు అరక్షణంలో ముగింపు పలుకుతూ, ‘నీ పరుపెత్తుకొని నడువు’ అని ఆజ్ఞాపించగా, అతడు అత్యానందంతో నడుస్తూ వెళ్లిపోయాడు (యోహాను 5:2–9). దేవునికన్నా కోనేటి నీటికే శక్తి ఎక్కువ అని నమ్మే అతని అంధ విశ్వాసానికైతే అంతం వచ్చింది కాని లోకంలో దేవుని పిల్లలుగా చలామణి అయ్యే చాలామంది అనేకానేక అంధవిశ్వాసాలకు ఇంకా బానిసలుగానే బతుకుతున్నారు. అవి మందిర సేవకు వాడే నీళ్లు గనుక, అవి కూడా పవిత్రమైనవేనని ఎవరో కథలు చెబితే నమ్మి దేవుణ్ణి, దేవాలయాన్ని వదిలేసి కోనేటి నీటి దగ్గర అంధవిశ్వాసంతో మగ్గుతున్నారు వందలాది రోగులు. అందుకు తమను తాము కుటుంబాల నుండి బహిష్కరించుకొని ఆ దేవదూత దిగొచ్చే వేళకోసం అక్కడే జీవితకాలమంతా అనాథలుగా బతుకుతున్నారు వాళ్లంతా! అంధవిశ్వాసానికి, అవిశ్వాసానికి పెద్దగా తేడా లేదు, రెండూ ఒకటే! మనిషి రాకెట్ వేగంతో అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నాడు. కాని మానసికంగా, భావనల పరంగా రకరకాల సంకెళ్లు అంధ విశ్వాసాల రూపంలో తగిలించుకొని బానిసవుతున్నాడు. లోకమంతటినీ ‘ఒక్కటి చేసిన ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా కొందరు నిరుపేదల్ని కులం పేరుతో ‘సంఘబహిష్కరణ’ చేసే వారి అమానవీయతకు అసలు వివరణ ఏది? అయినా దేవుడి బిడ్డలూ! దేవుడే మీతో ఉంటే దేవదూతలు, కోనేటి నీళ్ళతో మీకేం పని?! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మే 19న 'ఏంజెల్' రిలీజ్
నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్‌పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఏంజెల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సినిమాను వేసవి కానుకగా మే 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న నాగ అన్వేష్ హీరో చేస్తున్న రెండో సినిమా ఏంజెల్. -
ఏంజెల్ టీజర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్
శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి నిర్మాణ సారధ్యంలో యంగ్ హీరో నాగ అన్వేశ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ఏంజెల్. దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడు. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంఛ్ సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరై ఏంజెల్ మూవీ టీజర్‌ను లాంఛ్ చేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ, సింధూరపువ్వ కృష్ణారెడ్డి గారితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం ఏంజెల్ కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమాకి మొదటి నుంచి తన సహాయ సహాకారులు అందిస్తున్నట్లుగా తెలిపారు. కథ విన్న వెంటనే తనకి చాలా ఆశక్తిగా అనిపించి కృష్ణారెడ్డిగారిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. అలానే హీరో నాగా అన్వేష్ చిన్నప్పటి నుంచి నటన పైనే ధ్యాస పెడుతూ చిత్ర సీమలో ఒక్కో మొట్టు పైకి ఎక్కుతున్నాడని, ఈ సినిమా కచ్ఛితంగా అన్వేష్ కెరీర్‌ని ఓ కీలక మలుపు తిప్పుతొందని అన్నారు. వినాయక్‌తో పాటు ఈ కార్యక్రమంలో ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్, సింధూరపువ్వు కృష్ణరెడ్డి, సప్తగిరి, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మాయి... ఆపద... ప్రేమ!
ఏంజెల్ అంటే... దేవత! అందంలో, మానవత్వంలో సరిగ్గా దేవత లాంటి అమ్మాయే ఎదుట ప్రత్యక్షమైతే... ఏ అబ్బాయి అయినా ప్రేమలో పడతాడుగా! అలాగే, ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాడు. దేవత ప్రేమతో పాటు అనుకోని ఆపద ఎదురైనప్పుడు అబ్బాయి ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘ఏంజెల్’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ సినిమాతో ‘బాహుబలి’ పళని దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మే రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ‘‘సోషియో ఫాంటసీ చిత్రమిది. ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. హిందీ రీమేక్‌కి అడుగుతున్నారు. సినిమాలో ప్రేమకథ, విజువల్ ఎఫెక్ట్స్, భీమ్స్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
ఏంజెల్ నాకు ఓ సవాల్ – నాగ అన్వేష్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏంజెల్’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా భువనసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. నాగ అన్వేష్ బర్త్‌డే వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. బర్త్‌డే కేక్ కట్ చేసిన అనంతరం నాగ అన్వేష్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నాది ఛాలెంజింగ్ రోల్. మంచి కథ, కథనాలు కుదిరాయి. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అన్వేష్ తల్లి భారతి కూడా పాల్గొన్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
విజువల్ వండర్‌గా 'ఏంజెల్'
ప్రముఖ నిర్మాత కృష్ణరెడ్డి తనయుడు భువన్ సాగర్ తొలిసారిగా నిర్మాతగా మారి, బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఏంజెల్. సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మాణ పర్వవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా అలరించనుంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. షియాజీ షిండే, ప్రదీప్ రావత్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది. -
పెద్ద దర్గాలో నాగ అన్వేష్ ప్రార్థనలు
కడప కల్చరల్: యువ సినీ నటుడు నాగ అన్వేష్ శనివారం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గాను దర్శించుకున్నారు. దర్గా ముజావర్ అమీర్ ఆయనకు దర్గా గురువుల విశిష్ఠత, చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత దర్గాలోని ప్రధాన గురువుల మజార్‌ను, అనంతరం ఆ ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించార. అనంతరం నాగ అన్వేష్ మాట్లాడుతూ తాను నటించిన వినవయ్యా రామయ్య చిత్రం విజయవంతమైందని, ప్రస్తుతం తాను హీరోగా నటించిన ఏంజిల్ చిత్రం త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఆ చిత్రం విజయవంతం కావాలని దర్గా గురువుల ఆశీస్సుల కోసం వచ్చానని తెలిపారు. -
చెప్పుకోదగ్గ పని
పిల్లలు అంటే... వెన్నెల్లో అందమైన ఆటలు.పిల్లలు అంటే.... ముద్దు ముద్దు ముచ్చట్లు.పిల్లలు అంటే... ఇంటిపై వెలిగే ఇంద్రచాపాలు.అయితే పిల్లలంటే... ఇప్పుడు పసితనం మాత్రమే కాదు... పరుల కోసం ఆలోచించడం కూడా. వారికి తమ పరిధిలో సేవ చేయడం కూడా. పిల్లలకు చదివే లోకం. అయితే వారు ఆ లోకానికే పరిమితమైపోవడం లేదు. ఆ లోకం నుంచి మరో లోకంలోకి చూస్తున్నారు. తమలాంటి పిల్లల గురించి ఆలోచిస్తున్నారు.పొద్దుట, సాయంత్ర వేళల్లో ‘ఎక్స్‌వెజైడ్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు ఉన్న వంద మంది పిల్లలు ముంబైలోని ఇరవైకి పైగా కాలనీలు తిరిగి పన్నెండు వేలకు పైగా చెప్పుల జతలను సేకరించి... ‘హమారా ఫుట్‌పాత్’ ‘గూంజ్’ ‘ఏంజెల్’ ‘ఆస్కార్’... మొదలైన ఫౌండేషన్లకు ఇచ్చారు. ‘‘స్కూలుకు వెళ్లే చాలామంది పేద పిల్లలకు కాళ్లకు చెప్పులు ఉండవు. అలాంటి పిల్లలకు చెప్పులు సమకూర్చడానికి పిల్లలందరూ కదిలారు. దీనివల్ల రెండు మంచి పనులు జరుగుతాయి. ఒకటి... పేద పిల్లలకు సహాయపడటం. రెండు... వారిలో మానవతాదృక్పథం పెరగడం. ఇప్పుడు ఏర్పడిన పునాది మీద వారు సమాజానికి ఉపయోగపడే ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలరు’’ అంటున్నాడు ఎక్స్‌వెజైడ్ వ్యవస్థాకుడు హుషాంగ్ గొట్టె. కేవలం చెప్పుల జతల సేకరణ మాత్రమే కాదు.... రకరకాల కాలనీలు తిరిగి చందాలు వసూలు చేసి ఆ సొమ్మును పేద విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారు. ‘‘కాళ్లకు చెప్పులు లేని పేదలు ఒక పక్క... చెప్పులు పాత పడకుండానే... కొత్తవి కొనేవారు ఇంకో పక్క. పాత చెప్పులను అలా మూలకు పడేసే బదులు వాటిని పేదలకు ఇవ్వడం ద్వారా వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చినట్లు ఉంటుంది. మనసుకు తృప్తి మిగులుతుంది. ధనవంతుల ఇళ్లలోనే కాదు... మధ్యతరగతి ఇళ్లలో కూడా ఒకటి రెండు ఎక్స్ట్రా చెప్పుల జతలు ఉంటున్నాయి’’ అంటున్నారు గొట్టె.పదమూడు సంవత్సరాల రియాన్ కర్బాయి ఎన్నోసార్లు చెప్పుల సేకరణకు వెళ్లాడు. అయితే కొద్దిమంది మాత్రం ప్రతికూలంగా స్పందించారు. అంతమాత్రాన... రియాన్ బాధపడి వెనక్కు తగ్గలేదు. తన ముద్దు మాటలతో వారిలో మార్పు వచ్చేలా చేశాడు. ఇలాంటి పిల్లలు ‘ఎక్స్‌వెజైడ్’లో ఎంతోమంది ఉన్నారు.కొత్త చెప్పుల జత పాతబడకుండానే... కొత్త చెప్పులు కొనమని మారాం చేసేవాడు రియాన్. అలాంటి రియాన్... ఇప్పుడు తన చెప్పుల గురించి ఆలోచించకుండా చెప్పులు లేని పేద పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు.‘‘మా పిల్లాడిలో నాయకత్వ లక్షణాలు పెరగడం గమనించాను’’ అని సంతోషంగా చెబుతుంది రియాన్ తల్లి నాజ్నీన్.‘‘రకరకాల వ్యక్తులతో, రకరకాల వయసు వారితో మాట్లాడడం వల్ల తమదైన దృక్పథం ఏర్చర్చుకునే అవకాశం ఏర్పడుతుంది’’ అంటున్నారు నాజ్నీన్.‘ఎక్స్‌వెజైడ్’ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ మరింత పెరగడమే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతున్నాయి.పదమూడు సంవత్సరాల పక్జిన్ తాను డ్రైవ్‌లో పాల్గొనడమే కాదు... స్కూల్లో తన ఫ్రెండ్స్ ఆసక్తి చూపేలా ప్రయత్నిస్తోంది. ‘‘మంచి పని చేస్తున్నావు... అని టీచర్లు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది’’ అంటుంది పక్జిన్.కొందరు పిల్లలు అయితే... తమ పాకెట్ మనీని కూడా పేద పిల్లల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. దాతల పేర్లను పార్శీ కమ్యూనిటి న్యూస్‌పేపర్ ‘పార్శీ టైమ్’లో ప్రచురించడం ద్వారా ఇతరులలో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు పిల్లలు ‘షూ డొనేట్’పై ఆకర్షణీయమైన పోస్టర్లు రూపొందిస్తున్నారు.మరికొందరు తమ సేవాకార్యక్రమాలకు వేదికగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. దాతల నుంచి మంచి స్పందన ఉంది. అయితే సేకరించిన చెప్పులను స్టోర్ చేయడమే కష్టంగా మారింది. దీంతో మరో గోడౌన్‌ను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. ‘‘సేవ గురించి పాఠ్య పుస్తకాల్లోనో, ఇతర పుస్తకాల్లోనో చదువుకోవడం వేరు. స్వయంగా అందులో భాగం కావడం వేరు. దీనివల్ల సేవాగుణంలో ఉన్న తృప్తి స్వయంగా గ్రహించగలుగుతారు’’ అంటున్నాడు అంధేరీలోని ఒక రిటైర్డ్ ఉద్యోగి.చెప్పుల జతలను సేకరించడం, అవసరం ఉన్నవారికి వాటిని పంచడం... అనేది ప్రస్తుతానికైతే ‘ఎక్స్‌వెజైడ్’ ముఖ్యకార్యక్రమం కావచ్చుగానీ... భవిష్యత్‌లో మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటారు. వారు మరిన్ని మంచిపనులు చేయాలని ఆశిద్దాం. -
‘ఏంజిల్’ మూవీ స్టిల్స్
-
'ఏంజెల్' మూవీ వర్కింగ్ స్టిల్స్