ఏంజెల్‌ నాకు ఓ సవాల్‌ – నాగ అన్వేష్‌ | Angel is a challenge for me -Naga anvesh | Sakshi
Sakshi News home page

ఏంజెల్‌ నాకు ఓ సవాల్‌ – నాగ అన్వేష్‌

Published Sat, Mar 25 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

ఏంజెల్‌ నాకు ఓ సవాల్‌     – నాగ అన్వేష్‌

ఏంజెల్‌ నాకు ఓ సవాల్‌ – నాగ అన్వేష్‌

ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏంజెల్‌’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్‌ జంటగా భువనసాగర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. నాగ అన్వేష్‌ బర్త్‌డే వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

బర్త్‌డే కేక్‌ కట్‌ చేసిన అనంతరం నాగ అన్వేష్‌ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నాది ఛాలెంజింగ్‌ రోల్‌. మంచి కథ, కథనాలు కుదిరాయి. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అన్వేష్‌ తల్లి భారతి కూడా పాల్గొన్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement