కొంచెం భయం కొంచెం ఆనందం | 'Angel' is centred on my character: Hebah Patel | Sakshi
Sakshi News home page

కొంచెం భయం కొంచెం ఆనందం

Published Thu, Nov 2 2017 12:49 AM | Last Updated on Thu, Nov 2 2017 12:49 AM

'Angel' is centred on my character: Hebah Patel - Sakshi

‘‘నేనొక దేవకన్య. స్వర్గం నుంచి భూమిపైకి ఎందుకొచ్చాను? హీరోను ఎలా కలిశాను? తనతో నా జర్నీ ఏంటి? అనేదే ‘ఏంజెల్‌’ సినిమా కథ. నా పాత్ర రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో ఉన్నట్లు బబ్లీగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది’’ అని కథానాయిక హెబ్బా పటేల్‌ అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్‌ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్‌ సాగర్‌ నిర్మించిన ‘ఏంజెల్‌’ రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర ్భంగా హెబ్బా చెప్పిన విశేషాలు...

► ‘ఏంజెల్‌’ సినిమా రెగ్యులర్‌గా మనం చూసే హెవీ సబ్జెక్ట్‌ కాదు. చాలా సింపుల్‌గా, లైట్‌గా ఉంటుంది. ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో కథ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. నా గత సినిమాల కంటే ఇందులో నా బాధ్యత కొంచెం ఎక్కువగా ఉంటుంది.

► నేనిప్పటి వరకూ ‘ఏంజెల్‌’ సినిమా చూడలేదు. రేపు విడుదల అంటే కొంచెం కంగారుగా, సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఆత్రుతగా ఉంది. మంచి సినిమా చేశామనే ఆనందం ఉంది. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా.  

► నాగ అన్వేష్‌ చాలా మంచివాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు బాగా చేశాడు. తనతో పనిచేయడం హ్యాపీ. ‘ఏంజెల్‌’ మా ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుంది.

► ప్రస్తుతం సినిమా తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. చర్చల దశలో ఉన్నాయి.

వినాయక్‌ మాట సాయం
ఓ స్టార్‌ హీరో లేదా స్టార్‌ డైరెక్టర్‌ ఓ సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారంటే ఆ చిత్రంపై క్రేజ్‌ మరింతగా పెరుగుతుంది. తాజాగా ‘ఏంజెల్‌’ సినిమాకి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. కచ్చితంగా వినాయక్‌ మాటలు సినిమాకి ప్లస్‌ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement