naga Anvesh
-
ప్రేయసితో యంగ్ హీరో ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నాగ అన్వేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో నాగ అన్వేష్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా గత కొన్నాళ్లుగా నాగ అన్వేష్, కావ్య ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. నాగ అన్వేష్ తండ్రి ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అన్న విషయం తెలిసిందే. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో!
‘వినవయ్యా రామయ్య’,‘ఏంజెల్’ చిత్రాల ఫేమ్ నాగ అన్వేష్ కథానాయకుడిగా శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో రూపొందనున్న ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ,ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షో టైమ్ స్టూడియోస్ సమర్పణలో గణేష్ క్రియేషన్స్ పతాకంపై లండన్ గణేశ్, సీహెచ్‌వీ. నాగేశ్వరరావు నిర్మించనున్నారు. ‘‘ వినగానే కథ నచ్చింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో క్లైమాక్స్ వచ్చే వరకు అర్థం కాదు’’ అన్నారు నాగ అన్వేష్. ‘‘సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శ్రీ కృష్ణ గొర్లె. ‘‘నాగ అన్వేష్ని చూస్తే బాలీవుడ్ హీరోని చూసినట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది’’ అన్నారు లండన్ గణేశ్. ‘‘మూడు షెడ్యూల్స్‌లో సినిమాను కంప్లీట్ చేస్తాం’’ అన్నారు నాగేశ్వరరావు. -
సరికొత్త స్వర్గం చూపించాం!
‘పూలు అమ్మలకి నాన్నలు పెడతారు.. ఐ నో ఇట్. మరి, ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు.. అంత భయపడేవాడివి ఎందుకు పెట్టావ్? తల్లో మల్లెపూలు పెట్టాలి’ అంటూ ముద్దు ముద్దు మాటలతో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో వెంకటేశ్‌ని బ్లాక్మెయిల్ చేసిన బాలనటుడు నాగ అన్వేష్ ‘వినవయ్యా రామయ్యా’తో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ యువహీరో నటించిన చిత్రం ‘ఏంజెల్’. హెబ్బాపటేల్ కథానాయిక. ‘బాహుబలి’ పళని దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగ అన్వేష్ మీడియాతో ముచ్చటించారు. ► రెండో సినిమా సోషియో ఫాంటసీ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. కథ నచ్చింది. అందుకే చేశా. ‘ఏంజెల్’ సినిమాకు ఒకటిన్నర సంవత్సరం స్క్రిప్ట్ వర్క్ జరిగింది. 4 నెలలు షూటింగ్ చేశాం. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి ఆర్నెల్లు పట్టింది. నేను, సప్తగిరి ఒక విగ్రహాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాం. ఆ సమయంలోనే హెబ్బా పటేల్ స్వర్గం నుంచి భూమికి వస్తుంది. ఆమె మమ్మల్ని ఎందుకు కలిసింది? మా జర్నీ ఎలా సాగింది? అన్నదే కథ. ► ఈ సినిమాలో నాది ఫన్‌తో కూడుకున్న కొంచెం మాస్ క్యారెక్టర్. వినోద ప్రధానంగా ఉంటుంది. కథ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ► నా మొదటి సినిమాకంటే ఈ సినిమాకి కాస్త ఫిజిక్ పెంచా. నటన పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. శాటిలైట్ రైట్స్ కూడా బాగానే అమ్ముడయ్యాయి. తెలుగులో రిలీజ్ చేశాక తమిళం, హిందీలోనూ ‘ఏంజెల్’ ని విడుదల చేయాలనే ఆలోచన ఉంది. ► సినిమాలో ముందు 12 నిముషాల గ్రాఫిక్స్ అనుకున్నాం. కానీ, అవి కాస్తా 40 నిముషాలకు పెరిగాయి. అందుకే సినిమా విడుదల కాస్త ఆలస్యమైంది. స్వర్గాన్ని సరికొత్త తరహాలో చూపిస్తున్నాం. క్లైమాక్స్ ఫైట్ కూడా గ్రాఫిక్స్‌తోనే తీశాం. సినిమా పట్ల మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. -
కొంచెం భయం కొంచెం ఆనందం
‘‘నేనొక దేవకన్య. స్వర్గం నుంచి భూమిపైకి ఎందుకొచ్చాను? హీరోను ఎలా కలిశాను? తనతో నా జర్నీ ఏంటి? అనేదే ‘ఏంజెల్’ సినిమా కథ. నా పాత్ర రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్లు బబ్లీగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది’’ అని కథానాయిక హెబ్బా పటేల్ అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ నిర్మించిన ‘ఏంజెల్’ రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర ్భంగా హెబ్బా చెప్పిన విశేషాలు... ► ‘ఏంజెల్’ సినిమా రెగ్యులర్‌గా మనం చూసే హెవీ సబ్జెక్ట్ కాదు. చాలా సింపుల్‌గా, లైట్‌గా ఉంటుంది. ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో కథ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. నా గత సినిమాల కంటే ఇందులో నా బాధ్యత కొంచెం ఎక్కువగా ఉంటుంది. ► నేనిప్పటి వరకూ ‘ఏంజెల్’ సినిమా చూడలేదు. రేపు విడుదల అంటే కొంచెం కంగారుగా, సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఆత్రుతగా ఉంది. మంచి సినిమా చేశామనే ఆనందం ఉంది. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా. ► నాగ అన్వేష్ చాలా మంచివాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు బాగా చేశాడు. తనతో పనిచేయడం హ్యాపీ. ‘ఏంజెల్’ మా ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుంది. ► ప్రస్తుతం సినిమా తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. చర్చల దశలో ఉన్నాయి. వినాయక్ మాట సాయం ఓ స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ ఓ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే ఆ చిత్రంపై క్రేజ్ మరింతగా పెరుగుతుంది. తాజాగా ‘ఏంజెల్’ సినిమాకి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ వాయిస్ ఓవర్ అందించారు. కచ్చితంగా వినాయక్ మాటలు సినిమాకి ప్లస్ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. -
దేవుణ్ణి చూడాలనుకుంటే షోకి రండి! – సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
‘‘ఇళయరాజా ఉన్న కాలంలో మనం ఉండడం అదృష్టం. అదీ మనందరి ముందు ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మరింత అదృష్టం. (‘మ్యూజిక్’) దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజా (ఇళయరాజా) గారి షోకి రండి. ఆయన సంగీత దర్శకత్వంలో ‘చిరుగాలి వీచెనే’ పాట పాడే చాన్స్, ఆయన్ని కలసే చాన్స్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకులు–నటుడు–దర్శక–రచయిత ఆర్పీ పట్నాయక్. ఈ ఆదివారం (నవంబర్ 5న) హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ‘‘ఇళయరాజా లైవ్ షోకి ఫ్రీ పాసులు కావాలా? అయితే... ‘రాజా కాలింగ్ ఆజా’ పోటీలో పాల్గొనండి’’ అని ‘సాక్షి’ పాఠకులకు ‘షో క్విజ్’ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి అనూహ్య స్పందన లభించింది. వాళ్లలో సరైన సమాధానాలు రాసి పంపిన 600 మందిని ఎంపిక చేశారు. 600 మందిలోంచి 200 మంది లక్కీ మెంబర్స్‌ను ఆర్పీ పట్నాయక్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంపిక చేశారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా, ‘వినవయ్యా రామయ్యా’, ఈ శుక్రవారం విడుదలవుతోన్న ‘ఏంజెల్’లో హీరోగా నటించిన నాగ అన్వేష్ మాట్లాడుతూ– ‘‘రాజాగారి పాటల్లో ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటంటే నాకెంతో ఇష్టం. టీవీలో ఆ పాట ఎప్పుడొచ్చినా... పనులన్నీ పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుంటా. లక్కీ డ్రాలో పాసులు పొందిన 200 మందికి కంగ్రాట్స్. నా ఫ్రెండ్స్, స్టాఫ్ కూడా పాసులు అడుగుతున్నారు. ఒక్క ఎక్స్రా›్ట పాస్ ఉంటే నాకు ఇవ్వండి’’ అన్నారు. ‘మీ దగ్గర ఒక్క పాస్ ఉంటే... ఇంట్లో ఇల్లాలిని తీసుకువెళతారా? వంటింట్లో ప్రియురాలిని తీసుకువెళతారా?’ అని నాగ అన్వేష్ని అడగ్గా... ‘‘నేను ఇంట్లో కూర్చుని ఇద్దరినీ రాజాగారి లైవ్ కన్సర్ట్కి పంపిస్తా’’ అని నవ్వేశారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం హ్యపీగా ఉందని హెబ్బా పటేల్ చెప్పారు. విజేతలు (200 మంది)... తమ వివరాలను ‘సాక్షి’ వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే, వాళ్ల మొబైల్ నంబర్లకు ఎసెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 2, 3, 4వ తేదీల్లో హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ఆఫీసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విజేతలు తమ మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. సుదూర ప్రాంతాల వాళ్లు 5వ తేదీ మధ్యహ్నం 2 గంటలలోపు వచ్చి పాసులు పొందవచ్చు. ఫార్వార్డ్ మెసేజ్‌లకు పాసులు ఇవ్వబడవు. ఏ నంబర్‌కి మెసేజ్ వస్తే.. ఆ నంబర్‌కే పాస్ ఇవ్వబడును. -
సినిమాయే దైవం.. బలం.. బాధ్యత
‘‘ఇటీవల యూనిట్ అంతా ‘ఏంజెల్’ సినిమా చూశాం. చాలా బాగుంది. సంతోషంగా అనిపించింది. ఆఫ్ స్క్రీన్ చేసి వర్క్‌ని స్క్రీన్‌పైన చూస్తే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. దాన్నే ప్యాషన్ అంటారు’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘ఏంజెల్’ నవంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ నాకు సినిమానే దైవం, బలం, బాధ్యత. ‘ఏంజెల్’ సినిమా బావుందంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం సంతోషంగా ఉంది. నాగ అన్వేష్ డ్యాన్సులు, ఫైట్స్, స్క్రీన్ ప్రెజన్స్ చూసి, త్వరలోనే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకడు అవుతాడనిపించింది. ‘ఏంజెల్’ సినిమా బిజినెస్ చూసిన తర్వాత నిర్మాతగా నమ్మకం కలిగింది. తెలుగులో నవంబర్ 3న రిలీజ్ చేస్తాం. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారం లేదా రెండు వారాల గ్యాప్‌తో అక్కడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మరో రెండు భాషల్లో రిలీజ్
‘వినవయ్యా రామయ్యా’ ఫేమ్ నాగ అన్వేష్, ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఏంజెల్’. రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శ కత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన్ సాగర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ మూవీ ఇది. 45 నిమిషాలకు పైగా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) సీన్స్ ఉండటంతో నాలుగు నెలలు విజువల్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ చేశాం. స్నో వైట్ అండ్ ద హంట్స్మాన్, థార్, ఎవెంజర్స్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ‘ఏంజెల్’ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరిగాయి. తెలుగులో నవంబర్ 3న తెలుగులో, వారం తర్వాత హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కళ్లు చెదిరే గ్రాఫిక్స్, బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. సెంటిమెంట్ సన్నివేశాల్లో నాగ అన్వేష్ పలికించిన ఎమోషన్స్ సూపర్బ్’’ అన్నారు పళని. ‘‘పాటలు, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిందన్నారు అన్వేష్. ఈ సినిమాకి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి. -
ఏంజెల్ రిలీజ్‌కు భారీ ప్లాన్స్
తమిళ సినిమా: విన్నైతాండి వంద ఏంజల్ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలింస్ పతాకంపై సింధూర పూవ్వు కృష్ణారెడ్డి కథనం, నిర్మాణ బాధ్యతలను చేపట్టిన ఈ చిత్రానికి బాహుబలి కె.పళని దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు రాజమౌళి వద్ద బాహుబలి చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారు. నాగఅన్వేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సుమన్, షియాజీషిండే, ప్రదీప్రావత్లు నటిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ జీవితం చాలా చిన్నది. త్వరగా సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలని భావించే కథానాయకుడు, సరిగ్గా అలాంటి భావాలు కలిగిన అతని స్నేహితుడి మధ్య కలలో కూడా ఊహించని విధంగా ఒక యువతి వచ్చి చేరుతుంది. తను కూడా ఈ భూమిపై ఉన్న అన్ని సంతోషాలను అనుభవించాలని కోరుకుంటుంది. అలాంటి ఈ ముగ్గురూ అనూహ్యంగా ఒక ఆపదలో చిక్కుకుంటారు. అది ఎలాంటి ఆపద? అందులోంచి వారు ఎలా భయట పడగలిగారన్న పలు ఆసక్తికరమైన ఆశాలతో కూడిన ఈ చిత్రం విన్నైతాండి వంద ఏంజల్ కథ అని తెలిపారు. -
మే 19న 'ఏంజెల్' రిలీజ్
నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్‌పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఏంజెల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సినిమాను వేసవి కానుకగా మే 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న నాగ అన్వేష్ హీరో చేస్తున్న రెండో సినిమా ఏంజెల్. -
దేవకన్య ప్రేమకథ కొత్తగా ఉంటుంది! – వీవీ వినాయక్
‘‘దేవలోకం నుంచి వచ్చిన ఓ అమ్మాయి సాధారణ యువకుడితో ప్రేమలో ఎలా పడింది? అనేది ఈ చిత్రకథ. ‘ఠాగూర్’ నుంచి నిర్మాత కృష్ణారెడ్డిగారితో పరిచయ ముంది. దర్శకుడు కథ చెప్పారు. కొన్ని సీన్స్ చూశా. చాలా కొత్తగా ఉంటుందీ సినిమా. నాగ అన్వేష్ బాగా హార్డ్‌వర్క్ చేస్తున్నాడు. తనకు హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన్ సాగర్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘ఏంజెల్’. గురువారం వీవీ వినాయక్ టీజర్‌ను విడుదల చేశారు. ‘‘తొమ్మిది నెలలు కథపై వర్క్ చేశాం. నాగ అన్వేష్ లుక్, గెటప్ అన్నీ కొత్తగా ఉంటాయి. హెబ్బా పటేల్ బాగా నటించింది. ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి. ‘‘వినాయక్‌గారు కథ విని బాగా సపోర్ట్ చేశారు. సప్తగిరి కామెడీ, భీమ్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు దర్శకుడు పళని. భువన్ సాగర్, నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సంగీత దర్శకుడు భీమ్స్, హాస్యనటుడు సప్తగిరి, కథా రచయిత రమేష్ రెడ్డి, మాటల రచయిత శ్రీనివాస్ సంకల్ప్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి. -
అమ్మాయి... ఆపద... ప్రేమ!
ఏంజెల్ అంటే... దేవత! అందంలో, మానవత్వంలో సరిగ్గా దేవత లాంటి అమ్మాయే ఎదుట ప్రత్యక్షమైతే... ఏ అబ్బాయి అయినా ప్రేమలో పడతాడుగా! అలాగే, ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాడు. దేవత ప్రేమతో పాటు అనుకోని ఆపద ఎదురైనప్పుడు అబ్బాయి ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘ఏంజెల్’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ సినిమాతో ‘బాహుబలి’ పళని దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మే రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ‘‘సోషియో ఫాంటసీ చిత్రమిది. ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. హిందీ రీమేక్‌కి అడుగుతున్నారు. సినిమాలో ప్రేమకథ, విజువల్ ఎఫెక్ట్స్, భీమ్స్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
ఏంజెల్ నాకు ఓ సవాల్ – నాగ అన్వేష్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏంజెల్’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా భువనసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. నాగ అన్వేష్ బర్త్‌డే వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. బర్త్‌డే కేక్ కట్ చేసిన అనంతరం నాగ అన్వేష్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నాది ఛాలెంజింగ్ రోల్. మంచి కథ, కథనాలు కుదిరాయి. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అన్వేష్ తల్లి భారతి కూడా పాల్గొన్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
విజువల్ వండర్‌గా 'ఏంజెల్'
ప్రముఖ నిర్మాత కృష్ణరెడ్డి తనయుడు భువన్ సాగర్ తొలిసారిగా నిర్మాతగా మారి, బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఏంజెల్. సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మాణ పర్వవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా అలరించనుంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. షియాజీ షిండే, ప్రదీప్ రావత్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది. -
'ఏంజెల్' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
ఏంజిల్ అనుకుంటే డేంజర్ ఎదురైంది!
ఈ జీవితం చాలా చిన్నది. అందుకే త్వరగా సంపాదించేసి, హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు ఆ కుర్రాడు. అతని స్నేహితుడు కూడా అలాంటోడే. వీళ్లిద్దరికీ భూమ్మీద సంతోషాన్నంతటినీ అనుభవించాలనుకునే ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. జీవితం జాలీగా వెళ్తుందనుకునే సమయంలో స్నేహితులిద్దరూ ఓ ప్రమాదంలో పడతారు. ఆ ప్రమాదం ఏంటో తెలుసా? ఆ అమ్మాయే. అసలు ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయితో ప్రమాదం ఏంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ ‘ఏంజిల్’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు. ‘బాహుబలి’ పళని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పెద్ద కుమారుడు భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత‘ఠాగూర్’ మధు కెమేరా స్విచాన్ చేయగా, హీరో సాయిధరమ్ తేజ్ క్లాప్ ఇచ్చారు. పళని గౌరవ దర్శకత్వం వహించారు. ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ‘‘నాగ అన్వేష్ ఎటువంటి పాత్రనైనా చేయగలడనే విధంగా ఉంటుందీ చిత్రం. హీరో స్నేహితుడిగా సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్‌కి ముందే భీమ్స్ అన్ని పాటల రికార్డింగ్ పూర్తి చేశాడు. నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్‌కి మూడు నెలల టైమ్ పడుతుంది’’ అన్నారు. సుమన్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: గుణ, సహ నిర్మాత: యోగీశ్వర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
నాగ అన్వేష్ ఏంజెల్ ఓపెనింగ్
-
ఏంజిల్‌తో...
‘వినవయ్యా రామయ్యా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ‘సిందూర పువ్వు’ కృష్ణారెడ్డి కుమారుడు నాగ అన్వేష్ రెండో చిత్రం త్వరలో ఆరంభం కానుంది. రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వంలో ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో ‘కుమారి 21 ఎఫ్’ ఫేం హెబ్బా పటేల్ కథానాయిక. టైటిల్ ‘ఏంజిల్’. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యాక్షన్, కామెడీ, లవ్, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జోడీ అందర్నీ అలరించే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
నాగాన్వేష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది!
- వీవీ వినాయక్ ‘‘ఓ నిర్మాత కొడుకులా కాకుండా ఓ కొత్త హీరోలా సినిమా కోసం అన్ని విధాలుగా శిక్షణ తీసుకుని నాగాన్వేష్ ఈ చిత్రంలో నటించాడు. డ్యాన్సులు బాగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం 50 రోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ-‘‘కొత్త హీరోలతో చిన్న బడ్జెట్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికే కష్టంగా ఉంది. కానీ మా చిత్రం 35 థియేటర్లలో 50 రోజుల పాటు విజయవంతంగా ఆడింది. చిన్న సినిమా అయినా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘వినాయక్‌గారు ఈ సినిమా చూసి కచ్చితంగా 50 రోజులు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది’’ అని అన్నారు. ‘‘కృష్ణారెడ్డిగారు ఎంతో పేషన్‌తో ఈ సినిమా తీశారు. నాగాన్వేష్లో మంచి ఎనర్జీ ఉంది. తెరపై నాగాన్వేష్, కృతికల జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది’’అని మారుతి చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత కేఎస్ రామారావు, నటుడు సీనియర్ నరేశ్, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ తదితరులు పాల్గొన్నారు. -
'మా సినిమాపై దుష్ప్రచారం తగదు'
‘‘ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీవీ వినాయక్‌గారు కూడా ఫోన్ చేసి అభినందించారు. కొంతమంది ఈ సినిమా చూసి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రెంటినీ సమీక్షల్లో ప్రస్తావించారు. కొంతమంది పనిగట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఎంతో కష్టపడి తీసిన సినిమాపై ఇలాంటి ప్రచారాలు తగదు’’ అని నిర్మాత కృష్ణారెడ్డి అన్నారు. జి. రామ్‌ప్రసాద్ దర్శక త్వంలో తన తనయుడు నాగ అన్వేష్ని హీరోగా పరిచయం చేస్తూ, ఆయన నిర్మించిన చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అన్నారు. సినిమా ఫస్ట్‌హాఫ్‌లో కామెడీ, ద్వితీయార్ధంలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా పండాయని నాగ అన్వేష్ అన్నారు. -
ఆయన్ను ఇరిటేట్ చేశాను!
‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’లో ‘నాన్నా.. పూలు’ అని తండ్రిని ఏడిపించిన బుడతడు గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు తనే హీరోగా మన ముందుకు రానున్నాడు. నాగ అన్వేష్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘వినవయ్యా రామయ్య’ నేడు తెరకొస్తోంది. ‘సిందూరపువ్వు’వంటి ఘనవిజయం అందించిన నిర్మాత కృష్ణారెడ్డి తనయుడే ఈ నాగ అన్వేష్. తనయుడు హీరోగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక, నాగ అన్వేష్ చెప్పిన ముచ్చట్లు.. *** చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అరుణ్ పాండ్యన్ హీరోగా చేసిన ఓ సినిమాలో బాలనటుడిగా చేశా. ఆ సినిమా పేరు గుర్తు లేదు. ఆ సినిమా చూసి, ఈవీవీ సత్యనారాయణగారు నన్ను ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ సినిమాకి తీసుకున్నారు. ఆ సినిమా సెట్లో తెగ అల్లరి చేసేవాణ్ణి. ఇక వెంకటేశ్ అంకుల్నైతే ఆన్ స్క్రీన్లోనే కాకుండా, ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఇరిటేట్ చేసేవాడిని. సౌందర్య ఆంటీ కూడా బాగా గారం చేసేవారు. ఆ చిత్రం తర్వాత ‘ఆయనగారు’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, సైనికుడు (సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం), ‘సాహసబాలుడు విచిత్రకోతి’ చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి, చదువు కొనసాగించాను. *** నేను సీబీఐటీలో బీటెక్ చేశాను. కాలేజీలో కూడా నా మనసంతా సినిమాల పైనే. మా ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేయడంతో హీరోగా అడుగులు వేయాలనుకున్నాను. దాంతో యాక్టింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే దర్శకుడు రామ్‌ప్రసాద్‌గారు ఈ కథ చెప్పారు. కథ బాగుండటంతో నాన్న ఓకే అన్నారు. *** ఈ చిత్రంలో బ్రహ్మానందం అంకుల్ కాంబినేషన్లో నటించాను. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను హీరో అవుతానని చెప్పగానే... ‘హీరో అంటే ఎలా ఉండాలి? ఎలాంటి కథలు తీసుకోవాలి?’ అనే అంశాల గురించి చెప్పారు. బ్రహ్మానందంగారు నాకు గురువులాంటివారు. ప్రకాశ్రాజ్గారైతే ఏ సీన్లో ఎలా నటించాలి? అనే అంశాలపై చాలా సూచనలు, సలహాలు ఇచ్చారు. వాళ్లతో పనిచేయడం మర్చిపోలేని అనుభవం. *** రామ్‌ప్రసాద్‌గారు ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. లవ్ ట్రాక్, కామెడీతో సకుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు స్క్రిప్టే హీరో. ఈ సినిమా షూటింగ్ చాలా ఆహ్లాదంగా గడి చిపోయింది. నేను, కృతిక చిన్నవాళ్లమైనా చిత్ర బృందం అంతా చాలా బాగా సహకరించారు. పతాక సన్నివేశాల్లో ఆ అమ్మాయి నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. వినాయక్గారైతే నన్ను ఇంటికి పిలిచి. నా యాక్టింగ్‌ను అభినందించారు. నాకు అల్లు అర్జున్ డాన్స్‌లు, నటన అంటే చాలా ఇష్టం. ‘రేసుగుర్రం’ సెట్లోనే అల్లు అర్జున్ గారిని కలిశాను. బ్రహ్మానందం గారే నన్ను ఆయనకు పరిచయం చేశారు. నాన్నగారు నిర్మాత అయినప్పటికీ నాకు నిర్మాణ రంగం మీద ఆసక్తి లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. -
అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!
‘‘ ‘ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నాగాన్వేష్ బాలనటునిగా చేశాడు. సినిమాపై ప్రేమతో చాలా కష్టపడి హీరో అయ్యాడు. ఫైట్స్, డాన్స్‌లు బాగా చేశాడు’’ అని బ్రహ్మానందం అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బిగ్ సీడీని ఆవిష్కరించగా, పాటల సీడీలను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విడుదల చేశారు. తలసాని మాట్లాడుతూ -‘‘భారత చిత్రపరిశ్రమకు హైదరాబాద్ త్వరలోనే కేంద్ర బిందువుగా మారుతుంది. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది’’ అన్నారు. నాగాన్వేష్ మాట్లాడుతూ -‘‘ముంబై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నా. ఎంతోమంది పెద్ద హీరోలతో పనిచేసిన రామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
అందమైన ప్రేమ
వెంకటేశ్, సౌందర్య, వినీత కాంబినేషన్లో రూపొందిన ‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ చిత్రం గుర్తుందా? అందులో వెంకీ, వినీతల కొడుకుగా నటించిన నాగ అన్వేష్ ఇప్పుడు హీరోగా రంగప్రవేశం చేశాడు. గతంలో ‘సింధూరపువ్వు’ వంటి హిట్ సినిమా తీసిన కృష్ణారెడ్డి తనయుడే ఇతను. నాగ అన్వేష్, కృతిక జంటగా జి. రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ‘వినవయ్యా రామయ్యా’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘పదేళ్ల తర్వాత నిర్మిస్తున్న చిత్రం ఇది. మా అబ్బాయి కోసమే మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. సినిమాలంటే తనకు ఉన్న ఆసక్తి గమనించి, ముంబయ్‌లో సుభాష్ ఘై ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పించాను. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మనం కొత్తి పరవై’ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. చిరునవ్వుతో, సందడే సందడి వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను అద్భుతంగా తెరకెక్కించిన రామ్ప్రసాదే ఈ చిత్రానికి కరెక్ట్’’ అన్నారు. ఒక అందమైన కుటుంబంలో ప్రేమలు ఎలా ఉంటాయో చూపించే చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. మంచి హీరోగా పేరు తెచ్చుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానని నాగ అన్వేష్ అన్నారు. ఈ సమావేశంలో కృతిక, ఛాయాగ్రాహకులు రసూల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: ఎళిల్, మాటలు: ‘సింధూరపువ్వు’ కృఫ్ణారెడ్డి, వీరబాబు బాసిన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కడప గోపి.