అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో! | vinavayya ramayya audio released | Sakshi
Sakshi News home page

అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!

Published Sun, May 24 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!

అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!

 ‘‘ ‘ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నాగాన్వేష్ బాలనటునిగా చేశాడు. సినిమాపై ప్రేమతో చాలా కష్టపడి హీరో అయ్యాడు. ఫైట్స్, డాన్స్‌లు బాగా చేశాడు’’ అని బ్రహ్మానందం అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

 తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బిగ్ సీడీని ఆవిష్కరించగా, పాటల సీడీలను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విడుదల చేశారు. తలసాని మాట్లాడుతూ -‘‘భారత చిత్రపరిశ్రమకు హైదరాబాద్ త్వరలోనే కేంద్ర బిందువుగా మారుతుంది. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది’’ అన్నారు. నాగాన్వేష్ మాట్లాడుతూ -‘‘ముంబై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నా. ఎంతోమంది పెద్ద హీరోలతో పనిచేసిన రామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement