Vinavayya Ramayya
-
నాగాన్వేష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది!
- వీవీ వినాయక్ ‘‘ఓ నిర్మాత కొడుకులా కాకుండా ఓ కొత్త హీరోలా సినిమా కోసం అన్ని విధాలుగా శిక్షణ తీసుకుని నాగాన్వేష్ ఈ చిత్రంలో నటించాడు. డ్యాన్సులు బాగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం 50 రోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ-‘‘కొత్త హీరోలతో చిన్న బడ్జెట్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికే కష్టంగా ఉంది. కానీ మా చిత్రం 35 థియేటర్లలో 50 రోజుల పాటు విజయవంతంగా ఆడింది. చిన్న సినిమా అయినా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘వినాయక్‌గారు ఈ సినిమా చూసి కచ్చితంగా 50 రోజులు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది’’ అని అన్నారు. ‘‘కృష్ణారెడ్డిగారు ఎంతో పేషన్‌తో ఈ సినిమా తీశారు. నాగాన్వేష్లో మంచి ఎనర్జీ ఉంది. తెరపై నాగాన్వేష్, కృతికల జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది’’అని మారుతి చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత కేఎస్ రామారావు, నటుడు సీనియర్ నరేశ్, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ తదితరులు పాల్గొన్నారు. -
దుష్ర్పచారం తగదు : నిర్మాత కృష్ణారెడ్డి
‘‘ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీవీ వినాయక్‌గారు కూడా ఫోన్ చేసి అభినందించారు. కొంతమంది ఈ సినిమా చూసి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రెంటినీ సమీక్షల్లో ప్రస్తావించారు. కొంతమంది పనిగట్టుకుని మరీ దుష్ర్పచారం చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఎంతో కష్టపడి తీసిన సినిమాపై ఇలాంటి ప్రచారాలు తగదు’’ అని నిర్మాత కృష్ణారెడ్డి అన్నారు. జి. రామ్‌ప్రసాద్ దర్శక త్వంలో తన తనయుడు నాగ అన్వేష్ని హీరోగా పరిచయం చేస్తూ, ఆయన నిర్మించిన చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అన్నారు. సినిమా ఫస్ట్‌హాఫ్‌లో కామెడీ, ద్వితీయార్ధంలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా పండాయని నాగ అన్వేష్ అన్నారు. -
'వినవయ్యా రామయ్య' టీం తో చిట్ చాట్
-
అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!
‘‘ ‘ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నాగాన్వేష్ బాలనటునిగా చేశాడు. సినిమాపై ప్రేమతో చాలా కష్టపడి హీరో అయ్యాడు. ఫైట్స్, డాన్స్‌లు బాగా చేశాడు’’ అని బ్రహ్మానందం అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బిగ్ సీడీని ఆవిష్కరించగా, పాటల సీడీలను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విడుదల చేశారు. తలసాని మాట్లాడుతూ -‘‘భారత చిత్రపరిశ్రమకు హైదరాబాద్ త్వరలోనే కేంద్ర బిందువుగా మారుతుంది. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది’’ అన్నారు. నాగాన్వేష్ మాట్లాడుతూ -‘‘ముంబై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నా. ఎంతోమంది పెద్ద హీరోలతో పనిచేసిన రామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
వింటున్నావా రామయ్యా..!
నాగ అన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత నల్లమలుపు బుజ్జి హదరాబాద్‌లో విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక కుటుంబ కథా చిత్రం. అనూప్ చాలా మంచి పాటలు ఇచ్చారు. రసూల్ ఎల్లోర్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్’’ అని చెప్పారు. ‘‘‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ చిత్రంతో బాలనటునిగా పరిచయం అయ్యా. రామ్‌ప్రసాద్ గారు ఈ సినిమా చాలా బాగా తీశారు’’ అని నాగ అన్వేష్ చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
అందమైన ప్రేమ
వెంకటేశ్, సౌందర్య, వినీత కాంబినేషన్లో రూపొందిన ‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ చిత్రం గుర్తుందా? అందులో వెంకీ, వినీతల కొడుకుగా నటించిన నాగ అన్వేష్ ఇప్పుడు హీరోగా రంగప్రవేశం చేశాడు. గతంలో ‘సింధూరపువ్వు’ వంటి హిట్ సినిమా తీసిన కృష్ణారెడ్డి తనయుడే ఇతను. నాగ అన్వేష్, కృతిక జంటగా జి. రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ‘వినవయ్యా రామయ్యా’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘పదేళ్ల తర్వాత నిర్మిస్తున్న చిత్రం ఇది. మా అబ్బాయి కోసమే మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. సినిమాలంటే తనకు ఉన్న ఆసక్తి గమనించి, ముంబయ్‌లో సుభాష్ ఘై ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పించాను. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మనం కొత్తి పరవై’ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. చిరునవ్వుతో, సందడే సందడి వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను అద్భుతంగా తెరకెక్కించిన రామ్ప్రసాదే ఈ చిత్రానికి కరెక్ట్’’ అన్నారు. ఒక అందమైన కుటుంబంలో ప్రేమలు ఎలా ఉంటాయో చూపించే చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. మంచి హీరోగా పేరు తెచ్చుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానని నాగ అన్వేష్ అన్నారు. ఈ సమావేశంలో కృతిక, ఛాయాగ్రాహకులు రసూల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: ఎళిల్, మాటలు: ‘సింధూరపువ్వు’ కృఫ్ణారెడ్డి, వీరబాబు బాసిన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కడప గోపి. -
‘వినవయ్య రామయ్యా’ షూటింగ్ ప్రారంభం