వింటున్నావా రామయ్యా..! | Vinavayya Ramayya Movie Trailer Launched | Sakshi
Sakshi News home page

వింటున్నావా రామయ్యా..!

Published Fri, May 8 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

వింటున్నావా రామయ్యా..!

వింటున్నావా రామయ్యా..!

 నాగ అన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత నల్లమలుపు బుజ్జి హదరాబాద్‌లో విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక కుటుంబ కథా చిత్రం. అనూప్ చాలా మంచి పాటలు ఇచ్చారు. రసూల్ ఎల్లోర్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్’’ అని చెప్పారు. ‘‘‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ చిత్రంతో బాలనటునిగా పరిచయం అయ్యా. రామ్‌ప్రసాద్ గారు ఈ సినిమా చాలా బాగా తీశారు’’ అని నాగ అన్వేష్ చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement