నాగాన్వేష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది! | Vinavayya Ramayya movie 50days celebrations | Sakshi
Sakshi News home page

నాగాన్వేష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది!

Published Fri, Oct 9 2015 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

నాగాన్వేష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది!

నాగాన్వేష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది!

- వీవీ వినాయక్
‘‘ఓ నిర్మాత కొడుకులా కాకుండా ఓ కొత్త హీరోలా  సినిమా కోసం అన్ని విధాలుగా శిక్షణ తీసుకుని  నాగాన్వేష్ ఈ చిత్రంలో నటించాడు. డ్యాన్సులు బాగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం 50 రోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ-‘‘కొత్త హీరోలతో చిన్న బడ్జెట్‌లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికే  కష్టంగా ఉంది. కానీ మా చిత్రం 35 థియేటర్లలో 50 రోజుల పాటు విజయవంతంగా ఆడింది. చిన్న సినిమా అయినా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.  దర్శకుడు మాట్లాడుతూ-‘‘వినాయక్‌గారు ఈ సినిమా చూసి కచ్చితంగా 50 రోజులు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది’’ అని అన్నారు.

‘‘కృష్ణారెడ్డిగారు ఎంతో పేషన్‌తో ఈ సినిమా తీశారు. నాగాన్వేష్‌లో మంచి ఎనర్జీ ఉంది. తెరపై నాగాన్వేష్, కృతికల జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది’’అని  మారుతి చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత కేఎస్ రామారావు, నటుడు సీనియర్ నరేశ్, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement