దేవకన్య ప్రేమకథ కొత్తగా ఉంటుంది! – వీవీ వినాయక్‌ | vv vinayak wishes to angel movie | Sakshi
Sakshi News home page

దేవకన్య ప్రేమకథ కొత్తగా ఉంటుంది! – వీవీ వినాయక్‌

Published Thu, Apr 20 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

దేవకన్య ప్రేమకథ కొత్తగా ఉంటుంది! – వీవీ వినాయక్‌

దేవకన్య ప్రేమకథ కొత్తగా ఉంటుంది! – వీవీ వినాయక్‌

‘‘దేవలోకం నుంచి వచ్చిన ఓ అమ్మాయి సాధారణ యువకుడితో ప్రేమలో ఎలా పడింది? అనేది ఈ చిత్రకథ. ‘ఠాగూర్‌’ నుంచి నిర్మాత కృష్ణారెడ్డిగారితో పరిచయ ముంది. దర్శకుడు కథ చెప్పారు. కొన్ని సీన్స్‌ చూశా. చాలా కొత్తగా ఉంటుందీ సినిమా. నాగ అన్వేష్‌ బాగా హార్డ్‌వర్క్‌ చేస్తున్నాడు. తనకు హీరోగా మంచి భవిష్యత్‌ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. నాగ అన్వేష్, హెబ్బా పటేల్‌ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్‌ పతాకంపై భువన్‌ సాగర్‌ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘ఏంజెల్‌’. గురువారం వీవీ వినాయక్‌ టీజర్‌ను విడుదల చేశారు.

‘‘తొమ్మిది నెలలు కథపై వర్క్‌ చేశాం. నాగ అన్వేష్‌ లుక్, గెటప్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. హెబ్బా పటేల్‌ బాగా నటించింది. ప్రతి సీన్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి. ‘‘వినాయక్‌గారు కథ విని బాగా సపోర్ట్‌ చేశారు. సప్తగిరి కామెడీ, భీమ్స్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు దర్శకుడు పళని. భువన్‌ సాగర్, నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సంగీత దర్శకుడు భీమ్స్, హాస్యనటుడు సప్తగిరి, కథా రచయిత రమేష్‌ రెడ్డి, మాటల రచయిత శ్రీనివాస్‌ సంకల్ప్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement