అందమైన ప్రేమ | Naga Anvesh's Debut With “Vinavayya Ramayya” | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమ

Published Wed, Nov 5 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

అందమైన ప్రేమ

అందమైన ప్రేమ

వెంకటేశ్, సౌందర్య, వినీత కాంబినేషన్‌లో రూపొందిన ‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ చిత్రం గుర్తుందా? అందులో వెంకీ, వినీతల కొడుకుగా నటించిన నాగ అన్వేష్ ఇప్పుడు హీరోగా రంగప్రవేశం చేశాడు. గతంలో ‘సింధూరపువ్వు’ వంటి హిట్ సినిమా తీసిన కృష్ణారెడ్డి తనయుడే ఇతను. నాగ అన్వేష్, కృతిక జంటగా జి. రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ‘వినవయ్యా రామయ్యా’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘పదేళ్ల తర్వాత నిర్మిస్తున్న చిత్రం ఇది.
 
 మా అబ్బాయి కోసమే మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. సినిమాలంటే తనకు ఉన్న ఆసక్తి గమనించి, ముంబయ్‌లో సుభాష్ ఘై ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇప్పించాను. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మనం కొత్తి పరవై’ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. చిరునవ్వుతో, సందడే సందడి వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను అద్భుతంగా తెరకెక్కించిన రామ్‌ప్రసాదే ఈ చిత్రానికి కరెక్ట్’’ అన్నారు. ఒక అందమైన కుటుంబంలో ప్రేమలు ఎలా ఉంటాయో చూపించే చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. మంచి హీరోగా పేరు తెచ్చుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానని నాగ అన్వేష్ అన్నారు. ఈ సమావేశంలో కృతిక, ఛాయాగ్రాహకులు రసూల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: ఎళిల్, మాటలు: ‘సింధూరపువ్వు’ కృఫ్ణారెడ్డి, వీరబాబు బాసిన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కడప గోపి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement