యంగ్ హీరో నాగ అన్వేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో నాగ అన్వేష్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కాగా గత కొన్నాళ్లుగా నాగ అన్వేష్, కావ్య ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. నాగ అన్వేష్ తండ్రి ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment