![Hero Sharwanand Got Engaged To Software Engineer Rakshitha Reddy on January 26 - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/26/ram.jpg.webp?itok=WtAkZYld)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరవైన శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు.యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.
అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. శర్వానంద్ బెస్ట్‌ఫ్రెండ్స్‌లో ఒకరైన రామ్‌చరణ్ భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు.
ఇక శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరాతీయగా..రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment