Rakshitha
-
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్‌బళ్లాపూర్‌లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్‌లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్‌గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్‌లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అవి మనసులైనా, మనుషులైనా! ఒకప్పుడు అందంతో, నటనతో ఊదరగొట్టిన ఎంతోమంది తారలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైన కనిపిస్తున్న నటి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తండ్రి గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్.. తల్లి మమతా రావ్ కన్నడలో హీరోయిన్. సినీ బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉన్న ఈమెను ఇప్పటికైనా గుర్తుపట్టారా? తన పేరు రక్షిత.తొలి చిత్రంతోనే హిట్2002లో అప్పు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఇడియట్గా, తమిళంలో ధమ్‌గా రీమేక్ చేశారు. ఈ రెండుచోట్లా రక్షితే కథానాయిక. ఈ మూవీ విజయం సాధించడంతో తెలుగులో పెళ్లాం ఊరెళితే.., నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు.. ఇలా అనేక సినిమాల్లో నటించింది.సినిమాలకు గుడ్బైకన్నడలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లినాటి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'కొన్నిచోట్ల మామయ్యే పెళ్లికూతుర్ని మండపానికి తీసుకెళ్తుంటాడు. అలా నన్ను కూడా మా మామయ్య తీసుకెళ్లాల్సి ఉంది. ఆ రోజు అంతా రెడీ అయ్యాం.నో ఎంట్రీసమయానికి ఆయన కనిపించలేదు. తీరా ఆయన బయట ఏదో పనిమీద వెళ్లాడని తెలిసింది. తిరిగి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. నేను ఆమె మామయ్యను.. వెళ్లనివ్వండి అని చెబుతున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆయన ఎలాగోలా లోపలికి వచ్చేసరికే పెళ్లి తంతు దాదాపు పూర్తయింది. ఇప్పటికీ ఇది గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటాం' అని రక్షిత చెప్పుకొచ్చింది.చదవండి: ఆ వివాదంతో వార్తల్లో.. గుడ్‌న్యూస్ చెప్పిన సీరియల్ జంట -
శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్ దంపతులు
-
వైరల్ అవుతున్న శర్వా మ్యారేజ్ వీడియోలు..!
-
శర్వానంద్ రాయల్ వెడ్డింగ్...తేదీ ఎప్పుడూ? గెస్ట్‌లు ఎవరంటే
-
కాబోయే భార్యతో ఫస్ట్ పోస్ట్ చేసిన శర్వానంద్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గు్డ్బై చెప్పబోతున్నారు. రక్షితా రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇవాళ(జనవరి26)న హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి శర్వా, రామ్‌చరణ్‌లు మంచి స్నేహితులు. ఇక శర్వానంద్ తనను కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకున్నారు. నా జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ కాబోయే భార్యను పరిచయం చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
ఘనంగా శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరవైన శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు.యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. శర్వానంద్ బెస్ట్ఫ్రెండ్స్లో ఒకరైన రామ్‌చరణ్ భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. ఇక శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరాతీయగా..రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
త్వరలోనే శర్వానంద్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కానున్నారు. యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమ్మాయి మెడలో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. అయితే శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా ఆ అమ్మాయి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. ఈనెల 26న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రక్షితా రెడ్డితో ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. త్వరలోనే రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు. ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. అయితే ఇటీవల అన్‌స్టాపబుల్ షో పాల్గొన్న శర్వానంద్ పెళ్లి వార్తలపై స్పందించారు. -
ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్ (వంగూరు): ‘‘అమ్మా... నాన్న... న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారు? తమ్ముడితో కలసి కేక్ కట్ చేస్తున్నారా? నేను బాగా చదవాలని గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించండి. తమ్ముడు అల్లరి చేసినా ఏమీ అనకండి’’ అంటూ విదేశీ గడ్డ నుంచి తల్లి దండ్రులను ఫోన్లో పలకరించిన ఆ స్వరం కొన్ని గంటలకే మూగబోయింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన తెలంగాణ బిడ్డ కల నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. సిడ్నీ నగరంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మల్లెపల్లి రక్షిత (22) దుర్మరణం పాలైంది. ఆమె మరణవార్త కుటుంబ సభ్యులకు శనివారం అందింది. యూనివర్సిటీకి వెళ్తుండగా... నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మల్లెపల్లి వెంకట్‌రెడ్డి, అనిత దంపతులకు కుమార్తె రక్షిత, కుమారుడు అక్షత్ ఉన్నాడు. మాజీ సైనికోద్యోగి అయిన వెంకట్‌రెడ్డి డీఆర్డీవోలో చేరడంతో కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని కేశవరెడ్డి కాలనీ జీఎంఆర్‌సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. రక్షిత హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేయగా ఆమె తమ్ముడు అక్షత్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రక్షిత ఉన్నత చదువుల కోసం 2019 నవంబర్ 19న ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లింది. ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. అయితే నూతన సంవత్సర రోజున ఆమె స్కూటీపై యూనివర్సిటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందో మాత్రం వెంటనే తెలియరాలేదు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న ఆమె బంధువులు తండ్రి వెంకట్‌రెడ్డికి శనివారం ఫోన్ చేసి చెప్పారు. కుమార్తె పరిస్థితి తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మరికొన్ని నెలల్లో హైదరాబాద్ వస్తానని చెప్పి అంతలోనే దూరమయ్యావా అంటూ విలపించారు. ఇంతటి దుఃఖంలోనూ వారు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. రక్షిత అవయవాలను ఇతరులకు దానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ అంగీకారాన్ని ఆస్పత్రికి తెలియజేశారు. కాగా, రక్షిత మృతదేహన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఆ విశ్వాసం నన్ను ఐపీఎస్ స్థాయికి చేర్చింది..
చిన్నప్పటి నుంచే చదువంటే చాలా ఇష్టం.. ఆడపిల్ల అనే ఆంక్షలు దరిదాపునకు కూడా రానీయని తల్లిదండ్రులు. అమ్మనాన్న ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ ఉన్నత విద్యభ్యాసానికి దారితీసింది. పుట్టింది.. పెరిగింది.. చదివింది అంతా బెంగళూరులోనే. అందుకే ఉన్నత విద్య మరింత చేరువైంది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీ అయినా.. మా చదువు దెబ్బతినొద్దనే ఉన్నత ఆశయంతో బెంగళూరులోనే కుటుంబాన్ని ఉంచారు. ఆయన త్యాగంతోనే నా విద్యభ్యాసానికి ఎక్కడా ఎలాంటి ఆటంకమూ కలగలేదు. నాన్న పెట్టుకున్న అచంచల విశ్వాసం నన్ను ఐపీఎస్ స్థాయికి చేర్చింది.. అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు మంచిర్యాల జిల్లా డీసీపీ రక్షిత కె.మూర్తి. ఉన్నత చదువు.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. అత్యున్నత వ్యక్తిత్వంలో నాన్నే నాకు స్ఫూర్తి అంటున్న డీసీపీ.. ‘సాక్షి’ పర్సనల్ టైంలో మరిన్ని విశేషాలు పంచుకున్నారు. సాక్షి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: మా నాన్న కృష్ణమూర్తి. సేల్స్‌ట్యాక్స్ విభాగంలో ఉద్యోగి. ఉద్యోగరీత్యా నాన్న తరచూ ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లేవారు. అయినా.. తనవల్ల కుటుంబం ఇబ్బంది పడొద్దని.. పిల్లల చదువుకు ఆటంకం కలగొద్దని కుటుంబాన్ని బెంగళూరు నుంచి కదలనీయలేదు. ఆయన మాత్రమే బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లే వారు. నాన్నకు మాపై నమ్మకం ఎక్కువ. మాకు పూర్తిస్వేచ్ఛ కల్పించారు. నాన్నకు నన్ను ఉన్నతంగా చూడాలని ఉండేది. ఇదే చదవాలని.. ఇదే చేయాలని ఏనాడూ పట్టుబట్టలేదు. చదువులో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే ఇష్టమైన చదువును ఎలాంటి ఇబ్బంది లేకుండా చదవగలిగాను. మా నాన్న బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి రావడంతో అమ్మ ఉష అన్నీ చక్కబెట్టేది. నాకు తమ్ముడు అర్జున్, చెల్లి రిషిక ఉన్నారు. మా ముగ్గురిలో నేనే చదువులో ముందుండేదాన్ని. ఇంటికి పెద్దదాన్ని కావడంతో చెల్లి, తమ్ముడికి చదువులో కొద్దిగా మెరుగయ్యేందుకు సాయం చేసేదాన్ని. మొదట చదువులో కొంత వెనుకబడి ఉన్న తమ్ముడు, చెల్లి ఇద్దరూ ఆ తరువాత ముందుకు దూసుకెళ్లారు. తమ్ముడు బీకాం పూర్తిచేసి యూఎస్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. చెల్లి బీటెక్ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. నేను ఐపీఎస్ పూర్తిచేసి డీసీపీగా పనిచేస్తున్న. అందుకే మా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. బెంగళూరులోనే విద్యాభ్యాసం నా విద్యభ్యాసమంతా బెంగళూరులోనే సాగింది. బెంగళూరులోని బోల్డ్ విన్స్ గరల్స్ పాఠశాలలో చదువు ప్రారంభించి.. అక్కడే ఇంటర్ పూర్తి చేశాను. 2008లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో బెంగళూరులోని ఎంఎస్ సిద్దరామయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తయ్యింది. 2012లో మొదటిసారి యూపీఎస్సీ రాశాను. 2013లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కు ఎంపికై ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకున్న. 2013లో మరోసారి యూపీఎస్సీ రాసి.. రెవెన్యూ సర్వీస్ విభాగానికి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న. 2014లో 117వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2015 ఐపీఎస్ బ్యాచ్‌లో నన్ను తెలంగాణకు కేటాయించారు. 2018 మార్చి 13న గోదావరిఖని ఏసీపీగా బాధ్యతలు స్వీకరించాను. చదువు తప్ప మరో ధ్యాస లేదు అమ్మ చెబుతూ ఉండడం వల్లనో.. చదువు కోవాలన్న కోరికతోనో తెలియదుగానీ.. నాకు చిన్ననాటి నుంచి బాగా చదువుకోవాలనే తాపత్రయం ఎక్కువ. నాకు చదువు తప్ప మరో ధ్యాసలేదు. వంట చేయడం అస్సలు రాదు. అన్ని అవసరాలూ అమ్మనే తీర్చేది. మేం కిచెన్‌లోకి వెళ్లింది తక్కువే. ఏ అవసరం ఉన్నా మా అమ్మనే చూసుకోవడంతో వంట చేయాల్సిన అవసరం రాలేదు. అమ్మ వండిన వంటలంటే చాలా ఇష్టం. ఎవరు వండినా తినేదాన్ని కాదు. అందుకేనేమో నాకు నేను వంట చేసుకోవాలనో.. నేర్చుకోవాలనో అనుకోలేకపోయి ఉంటాను. అందుకే నన్ను వంటవచ్చా అని ఎవరైనా అడిగితే నాకు చదువు ఒక్కటే వచ్చు.. వంట రాదు అని చెప్పేస్తా. స్నేహితుల్లో నేనే పోలీస్ మా కుటుంబంలో ఎక్కువమంది పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. అదే నాకు స్ఫూర్తినిచ్చి ఐపీఎస్ కావాలన్న ఆలోచన వచ్చిందో.. ఏమో తెలియదుగానీ.. మా స్నేహితుల్లో నేనొక్కదానే పోలీస్. నాతో పాటు చదువుకున్న స్నేహితులు వివిధ రంగాల్లో.. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు. నేను పోలీసు కావడంతో మా స్నేహితులు కూడా నన్ను చూసి ఆనందిస్తుంటారు. పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే కావడంతో స్నేహితులంతా అక్కడివారే. మొదటిసారి బెంగళూరును వదిలి గోదావరిఖనిలో ఉద్యోగంలో చేరడంతో మా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అమ్మ చేతి వంటనే నాకు అలవాటు. ఇక్కడ నేను ఏంతింటానో అనే బెంగ పట్టుకుంది. ఇక్కడ వంటవారికి మా అమ్మ అన్ని వంటకాలను దగ్గరుండి నేర్పించింది. ప్రతిరోజు నా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. అన్నిరకాల వంటకాలను ఇష్టంగా తింటా. ఆటల్లో టెన్నీస్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్ నుంచి కళాశాల వరకు ఎక్కువగా బాస్కెట్‌బాల్, ఖోఖో, త్రోబాల్ ఎక్కువగా ఆడేదాన్ని. అలా అని జిల్లాస్థాయి ప్లేయర్‌ను కాదు. ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. అందుకే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. విద్యతోనే ఆత్మవిశ్వాసం విద్యతోనే ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో చదువు ఉంటే వారిలో ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. నేను పోలీస్రంగాన్ని ఎంచుకున్న. నా ఉద్యోగ బాధ్యతను సమర్థవంతగా నిర్వహిస్తా. మరో ఉద్యోగంలోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. నిందితులను పట్టుకోవడం.. బాలికలు, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడడం నా ప్రధాన లక్ష్యం. దొంగతనాలు, నేరాల అదుపునకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు తీసుకుంటా. ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండడంతో కుటుంబసభ్యులతో ఎక్కువగా గడపలేకపోతున్నాననే భావన ఉంది. ఉద్యోగాల్లో ఇవన్నీ సహజం. మహిళలు ధైర్యంగా ఉండాలి. కచ్చితంగా ప్రతి బాలికనూ చదివించడం ద్వారా వారి భవిష్యత్‌కు బాటలు వేయాలి. -
రీ–ఎంట్రీతో వినిపించబోతున్నారు
‘ఇడియట్, శివమణి’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరు బ్యూటీ రక్షిత. 2007లో దర్శకుడు ప్రేమ్‌తో పెళ్లి జరగడంతో సినిమాలకు స్వస్తి చెప్పేశారామె. సిల్వర్ స్క్రీన్కు దూరం అయినప్పటికీ టెలివిజన్ షోలకు న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు రక్షిత. ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు రక్షిత. కానీ ఈసారి రక్షిత కనిపించరు.. వినిపించబోతున్నారు. సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా భర్త ప్రేమ్ రూపొందిస్తున్న కన్నడ సినిమా ‘విలన్’లో హీరోయిన్ అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నారట. ‘‘ప్రేమ్‌తో వర్క్ చేయడం అంత సులువేం కాదు. అతను పర్ఫెక్షనిస్ట్. కొన్నికొన్ని సార్లు డైలాగ్‌ను 20 సార్లు చెప్పించేవారు. ఎంత పెద్ద డైలాగ్‌ని అయినా ముక్కలుగా కట్ చేసి చెప్పించరు. మొత్తం చెప్పాల్సిందే. ఎన్ని టేక్స్ అయినా ఆయనకు సంబంధం లేదు. గతంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ వేరే వాళ్లకు డబ్ చేయడం చాలా డిఫరెంట్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు రక్షిత. -
ప్రేమలో చిక్కులు
జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా, నిక్కీ గల్రానీ, రక్షిత హీరోయిన్లుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘వీడి లవ్‌లో అన్నీ చిక్కులే’ అన్నది ఉపశీర్షిక. శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై వి.జయంత్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిన్నతనంలోనే నిర్మాతగా మారిన జయంత్ కుమార్‌ని అభినందిస్తూ, తనకు నిర్మాతగా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నిర్మాత వి.జయంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారి దగ్గర నుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్టైనర్ ఇది. హీరో జీవాగారు గెస్ట్ రోల్లో కనిపిస్తారు. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
నటి రక్షిత కాలికి గాయం!
సాక్షి, బెంగళూరు : ఒకప్పటి బహుబాషా హీరోయిన్, క్రేజీ క్వీన్ రక్షితా ప్రేమ్ కాలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె కాలుకు కట్టు కట్టుకున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. అవును, నిజమే, కాలికి గాయమైంది అని రక్షిత కూడా ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోను బుధవారం పోస్ట్ చేశారు. గాయం ఎలా అయ్యిందన్నది బయటకి తెలియడం లేదు. కాలికి బ్యాండేజ్ వేసుకున్న ఫోటోలు రక్షిత ప్యాన్స్ క్లబ్ ట్విట్టర్ ఖాతాలో కనిపించాయి. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రక్షిత పేర్కొన్నారు. నడవలేకపోతున్నా: రక్షిత అయినా కూడా తాను ‘డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్’ ప్రోగ్రామ్ సెమీ ఫైనల్ షూటింగ్‌కు వెళుతున్నానని, ఇందులో తన బృందానికి మద్దతునివ్వాలని అభిమానులను వీడియోలో కోరారు. తాను చికిత్స పొందుతున్నానని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని చెబుతూ నడవటానికి సాధ్యం కావడం లేదని తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్ననటి రక్షిత
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని శనివారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటులు రాజ్‌తరుణ్, రక్షిత శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. -
నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి
సినీ నటి రక్షిత కోలారు, న్యూస్‌లైన్ :నరేంద్రమోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఆయనను ప్రధానిని చేసేందుకు కోలారు లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నారాయణస్వామిని అఖండ మెజార్టీతో గెలిపించాలని సినీ నటి రక్షిత ఓటర్లకు పిలుపు ఇచ్చారు.శుక్రవారం ఆమె నరసాపురం, సూలూరు, వేమగల్లలో అభ్యర్థితో కలిసి రోడ్‌షో ద్వారా ప్రచారం నిర్వహించారు. మోడీ గుజరాత్‌ను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయనను ప్రధానిగా చూడాలని దేశప్రజలు కలలు కంటున్నారన్నారు. కోలారులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధికి పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. అభ్యర్థి మాట్లాడుతూ ఆరు పర్యాయాలు ఎంపీగా పదవిని అలంకరించిన కేహెచ్ మునియప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. తనను ఎంపిగా గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం ప్రామాణిక ప్రయత్నం చేస్తామన్నారు. వేడిమిని తాళలేని రక్షిత : సినీనటి రక్షిత భానుడి ప్రతాపానికి తాళలేక పోయింది. నరసాపురం. సూలురు గ్రామాలలో నీడ ఉన్న చోటుకు వెళ్లి ప్రసంగాలు ఇచ్చారు.