
కాలికి బ్యాండెజ్ వేసిన దృశ్యం
సాక్షి, బెంగళూరు : ఒకప్పటి బహుబాషా హీరోయిన్, క్రేజీ క్వీన్ రక్షితా ప్రేమ్ కాలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె కాలుకు కట్టు కట్టుకున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. అవును, నిజమే, కాలికి గాయమైంది అని రక్షిత కూడా ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోను బుధవారం పోస్ట్ చేశారు. గాయం ఎలా అయ్యిందన్నది బయటకి తెలియడం లేదు. కాలికి బ్యాండేజ్ వేసుకున్న ఫోటోలు రక్షిత ప్యాన్స్ క్లబ్ ట్విట్టర్ ఖాతాలో కనిపించాయి. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రక్షిత పేర్కొన్నారు.
నడవలేకపోతున్నా: రక్షిత
అయినా కూడా తాను ‘డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్’ ప్రోగ్రామ్ సెమీ ఫైనల్ షూటింగ్‌కు వెళుతున్నానని, ఇందులో తన బృందానికి మద్దతునివ్వాలని అభిమానులను వీడియోలో కోరారు. తాను చికిత్స పొందుతున్నానని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని చెబుతూ నడవటానికి సాధ్యం కావడం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment