Bramhanandam
-
ఆ సినిమా తరువాత నా జీవితం అంత చీకటి అయిపోయింది..
-
నాటక కళాకారులను గుర్తుతెచ్చే ‘ఉత్సవం’
నాటక కళా రంగం గొప్పదనం గురించి తెలియజేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా దీలీప్, రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల కానుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని, కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ అద్భుతమైన విజువల్స్‌తో ‘ఉత్సవం’ను అందంగా తీర్చిదిద్దారని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. -
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అలీ, బ్రహ్మానందం
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని ప్రముఖ తెలుగు నటులు బ్రహ్మానందం, అలీ ఆదివారం పరామర్శించారు. అశ్విని, రాఘవేంద్ర రాజ్‌కుమార్ తదితరులను వారు పలకరించి, పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చదవండి: (యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!) -
ఉపఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం బిజీబిజీ
సాక్షి, బెంగళూరు: మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలు బరిలో ఉండటంతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనర్హత ఎమ్మెల్యేల గెలుపుతో పాటు ప్రభుత్వ మనుగడకు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం బెంగళూరులోని యశవంతపున నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎస్టీ సోమశేఖర్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాల ప్రచారం అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్ శ్రమిస్తున్నాయి. సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచారం నిర్వహించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది. మాటల యుద్ధం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు.. తప్పు మీదంటే మీదని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో భాగంగా బహిరంగ ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు అనుచరులతో ముమ్మర సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు మఠాలు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎం యడియూరప్ప అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి వరాల హామీలు గుప్పిస్తున్నారు. హైఓల్టేజీ స్థానాలపై బెట్టింగ్? ఉప ఎన్నికలు జరిగే హొసకోటె, హుణసూరు, కృష్ణరాజపేటె, గోకాక్, యశవంతపుర, విజయనగర నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ పార్టీ ఎక్కువ స్థానా ల్లో విజయం సాధిస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య పోటీ ఉందని.. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్– జేడీఎస్ మధ్యనే పోటీ ఉందని బెట్టింగ్ కాస్తున్నారు. చిక్కబళ్లాపుర, గోకాక్, శివాజీనగర స్థానా లపై కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. -
హీరోయిజమ్ మా బావ ఇంట్లో ఉంది
‘‘ప్రేమించటానికి ఒక అందమైన అమ్మాయిని ఇచ్చావ్. పెళ్లి చేసుకుందామనుకుంటే అడ్డుపడ్డానికి ఆరుగురు కోతుల్లాంటి తమ్ముళ్లని ఇచ్చావ్’’ అని రాజేంద్రప్రసాద్, ‘‘పొగరు నా వొంట్లో ఉంది.. హీరోయిజమ్ మా బావ ఇంట్లో ఉంది’’.. అని బ్రహ్మానందం చెప్పిన డైలాగులు ‘ఊ.పె.కు.హ’ సినిమాపై భలే ఆసక్తి పెంచుతున్నాయి. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో సాక్షీ చౌదరి కథానాయికగా ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అన్నది ఉపశీర్షిక. బేబీ లక్ష్మీ నరసింహా హిమ ఋషిత సమర్పణలో భాగ్యలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ‘నిధి’ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘80మంది కమెడియన్లతో వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. రాజేంద్రప్రసాద్‌గారి నటన ప్రత్యేక ఆకర్షణ. బ్రహ్మానందంగారి, రాజేంద్రప్రసాద్‌గారి కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి’’ అన్నారు. ‘‘ప్రసాద్‌గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. అందర్నీ అలరించే చిత్రమవుతుంది’’ అన్నారు భాగ్యలక్ష్మి. ఈ చిత్రానికి కెమెరా: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఆర్. నాగరాజు, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఎర్ర తివాచిపై హాస్యబ్రహ్మ
నవ్వుకు మరో పేరు అనేలా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బ్రహ్మానందం. మూడు దశాబ్దాల కెరీర్లో ఎన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్నారాయన. ఇప్పుడు అమెరికాలో ఘన సన్మానం అందుకోనున్నారు. అమెరికాలోని సియోటెల్ నగరంలో ఈ నెల 6న జరగనున్న తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోవాల్సిందిగా బ్రహ్మానందంకి ఆహ్వానం అందింది. ఇదే వేదికపై 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ ఆయన్ను ఘనంగా సన్మానించనుంది. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘బ్రహ్మానందంగారికి మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు వరించాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. -
కిడ్నాప్ కామెడీ!
పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం ముఖ్యతారలుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మించిన ‘నేను కిడ్నాప్ అయ్యాను’ ఈ శుక్రవారం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. బ్రహ్మానందం, పోసాని, తాగుబోతు రమేశ్, రఘుబాబు, కృష్ణ భగవాన్, పృథ్విల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ బాగా వచ్చింది. మా చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం సంతోషంగా ఉంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదిస్తుండటం మా సినిమా విజయంపై ధీమా పెరిగింది’’ అన్నారు శ్రీకర్‌బాబు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్. -
శ్రీమాన్... శ్రీవారు!
సమ్సారం సంసారంలో సినిమా ప్రసూన... విసిగివేసారి... ఉక్రోషం, ఉడుకుమోత్తనం, ఆగ్రహం, ఆవేశం ఆవహించగా... ‘‘అసలు మీ ఎవ్వరికీ కనిపించకుండా వెళితే కాని మీరు దారికి రారు’’ అని వంటింట్లోకి వెళ్లిపోయింది. ‘కోడలిగా నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే చెప్పింది అత్తయ్య.. మొగుడిని మనిషిలాగే చూడు.. దేవుడిని చెయ్యకు అని. అప్పుడు అర్థం కాలేదు ఆ మాట విలువ. ఇప్పుడు తెలిసొస్తోంది!’ మంచం మీద ఉండలా పడి ఉన్న తడి తుండును తీసి బాల్కనీలో విసురుగా దులుపుతూ అంది ప్రసూన. ‘అందుకే అన్నారు... పెద్దల మాట చదన్నం మూట అని. ఆ రోజే మా అమ్మ చెప్పిన మాట సరిగ్గా విని నువ్వు అర్థం చేసుకుని ఉంటే దేవుడిలా వినడమే తప్ప నోరెత్తలేని ఖర్మ నాకూ పట్టుండేది కాదు’ డ్రెస్సింగ్ టేబుల్ ముందు తల దువ్వుకుంటూ అన్నాడు నింపాదిగా శ్రీకర్. చిర్రెత్తుకొచ్చింది ప్రసూనకు. ‘ఏ విషయంలో మీకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా చేశాను?’ అంది ఆవేశంగా. ‘ఏ విషయంలో మాట్లాడనిచ్చావని?’ మీసాలను దువ్వుకుంటూ అన్నాడు అదే నింపాదితనంతో. ‘నిజంగా తప్పుచేశాను’ నిస్సహాయంగా సణుక్కుంటూ వంటింట్లోకి వెళ్లింది. ‘ఫలితం నేను అనుభవిస్తున్నా’ అన్నాడు డైనింగ్ హాల్లోకి వస్తూ! ఆ మాటకు స్పందనగా వంటింట్లో గిన్నెలు చప్పుడు చేశాయి గట్టిగా! డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు... కాదు... కేకేశాడు శ్రీకర్... ‘దేవుడికి నైవేద్యం’ అంటూ! ‘ఈ దేవుడికి మామూలు నైవేద్యాలు ఏం సరిపోతాయి.. పెళ్లాం రక్తమాంసాల భక్ష్యం కావాలి కాని’ అంటూ టేబుల్ మీద కంచం పెట్టింది శబ్దం వచ్చేంత కోపంగానే. ఆమె కోపం ఆయనకు నోటీస్ అయినా పట్టించుకోలేదు. శ్రీకర్ బ్యాంక్ మేనేజర్. ప్రసూన గృహిణి. ఇద్దరు పిల్లలు. పెళ్లయి అత్తారింటికి వెళ్తున్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, మేనత్త సహా అమ్మ చెప్పిన మాటలనూ బాగా గుర్తుంచుకుని భర్తకు ఏ చిన్న అసౌకర్యం కలగనివ్వకూడదనే వాగ్దానం కూడా చేసుకుంది తనకుతానే ప్రసూన. అత్తింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ప్రకారమే నడుచుకోవడమూ మొదలుపెట్టింది. కోడలి ప్రవర్తన చూసిన అత్తమ్మ భవిష్యత్తులో ఆ పిల్ల ఎంత కష్టపడనుందో తన అనుభవరీత్యా అంచనా వేసి ఇచ్చిన సలహానే... ‘మొగుడిని మనిషిగానే చూడు దేవుడిని చేయకు’ అని. కన్న కొడుకు గురించి తల్లి అలా అనడం మొదట్లో జీర్ణించుకోలేకపోయింది కోడలు. కాని యేడాది తిరగకముందే అత్తమ్మ సలహా ఎంత విలువైనదో తెలిసొచ్చింది. అయితే అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. శ్రీమాన్ శ్రీవారు శ్రీమతి సపర్యలకు అలవాటుపడి ఆ సేవలకు ఒళ్లు, మెదడు అప్పగించి ఇంట్లో సొంతంగా పనిచేసుకోవడమనే మాటను మరిచిపోయాడు. బ్రష్ మీద పేస్ట్ దగ్గర్నుంచి స్నానానికి నీళ్లు దాకా భార్య పెడితేనే ఆ మొగుడి మెదడు స్నానమనే ప్రోగ్రామ్‌ను కంప్లీట్ చేస్తుంది. చివరకు కంచంలో ఆమె అన్నం వడ్డిస్తేనే ఆయన తినడమనే తంతంగం పూర్తి చేస్తాడు. ఆయన భోజనం అయిపోయేవరకు అసాంతం ఆమె పక్కనే ఉండి కంచంలో ఏం లేదో... ఏం ఉందో చూస్తూ వడ్డించాలిసిందే. ఏదో పని వల్ల పొరపాటున అక్కడి నుంచి ఆమె కదిలి వెళ్లిందో కంచంలో తిండి అయిపోగానే అదే టేబుల్ మీద అలాగే ప్లేట్ పక్కనే ఎంగిలి చేయితోనే కునుకు తీస్తాడు అతను. ‘అయ్యో... అలా పడుకున్నారేంటి? పిలిచి ఏం కావాలో అడగొచ్చు కదా’ అని తనేదో తప్పు చేసినట్టు ఫీలయిపోయి ప్లేట్లో ఆయనకు కావల్సినవి మళ్లీ వడ్డిస్తుంది ఆ మహా ఇల్లాలు. ఈయనగారు తాత్పరంగా లేచి... ‘నా భోజనం కన్నా నీకు ముఖ్యమైన పనేదో ఉన్నట్టుంది. డిస్టర్బ్ చేయడం ఎందుకని నువ్వు వచ్చే వరకు టైమ్ వేస్ట్ కాకుండా ఓ కునుకు తీద్దామనుకున్నా’ అంటాడు ఆమెను నొప్పించడానికి వ్యంగ్యాన్ని అస్త్రంగా చేసుకుంటూ. ఆ హబ్బీ నిర్లక్ష్యం, లేజీనెస్ ఏ స్థాయిదంటే... బ్యాంక్ పని తప్ప ఇంకే పని చేయడు. ఇంట్లో పూచిక పుల్ల ముట్టుకోడు. స్నానం చేసి తుడుచుకున్నాక తుండు గుడ్డను ఉండలా విసిరేస్తే అది ఎక్కడ పడిందో కూడా వెనక్కి తిరిగి చూడడు. ఇందాకటి ఈ శ్రీమతి కోపానికి, అసహనానికి కారణం అదే. పదేళ్లయినా ఆ అలవాటును మాన్పించలేకపోతోంది. తుడుచుకున్నాక తుండును కనీసం ఒక చోట పెట్టే ప్రయత్నం చేయించలేకపోతోంది. తనకు కావాల్సిన వాటిని కూడా ఆయన తెచ్చుకోడు. ‘చెప్పుకోవడానికి కూడా సిగ్గే... ఆయన గడ్డం గీసుకునే బ్లేడ్ దగ్గర్నుంచి ఆండర్వేర్స్ దాకా అన్నీ నేనే తేవాలి’ అంటూ అక్కచెల్లెళ్ల దగ్గర ఎన్నో సార్లు వాపోయింది ఆ పిల్ల. ‘కొత్తలో కథ రివర్స్‌గా ఉండింది కదే... మా ఆయన వేసుకునే బట్టలు నేనే సెలెక్ట్ చేయాలి అంటూ గర్వంగా చెప్పేదానివి. బావగారి బట్టలు అంటే... యు మీన్ అండర్వేర్సా?’ అంటూ చెల్లెలు చాలాసార్లు ఆటపట్టించింది కూడా! చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టమని పట్టుబట్టి డ్రైవింగ్ నేర్చుకుంది. నేర్చుకున్న పాపానికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాల్సి వస్తోంది అని బాధపడితే... ‘మా ఆయన నేను లేకుండా ఎక్కడికీ వెళ్లడు అని చెప్తుంటే ఏంటో అనుకున్నా అక్కాయ్... ఇదన్న మాట సంగతి’అంటూ తమ్ముడూ ఎకసెక్కమాడాడు. బీర్వాలోంచి వేసుకోవాల్సిన బట్టలు ఆయన తీసుకోవాల్సి వస్తే పైన దొంతర మొత్తం జారి కింద పడాల్సిందే. మళ్లీ అవన్నీ సర్దుకునే పెంట పని ఎక్కడ పెట్టుకుంటుంది అని బట్టలు తీసే బాధ్యత కూడా తనే నెత్తిమీద వేసుకుంది. యేడాదికోసారి ఎప్పుడైనా తనకు ఒంట్లో బాగాలేనప్పడు ఒక్క పూట ఒక్క పని చేయాల్సి వస్తే ఇల్లు పందిరవడమే. ‘అబ్బబ్బ... ఏ పనీ సరిగ్గా చేయరు కదా... నీట్నెస్ అన్న మాటే లేదు మీ డిక్షనరీలో’ అని విసుక్కుంటుంది. దాన్నీ బహు ఒడుపుగా వాడుకోవడం మొదలుపెట్టాడు భర్త. ‘అరేయ్... ఒక్కతే ఎంత పని అని చేసుకుంటుందిరా... ఇంట్లో ఉన్నప్పుడైనా కాస్త సాయం చేయొచ్చుకదా’ అని అతని తల్లిగారు అంటే కోడలి అత్తగారు అంటే... ‘అమ్మా... నాకు నువ్వు నీట్నెస్ నేర్పించలేదే. తనకేమో నీట్నెస్ ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్). నేను సాయం చేసి డబుల్ వర్క్ పెట్టే బదులు చేయకుండా ఉండడమే తనకు, నాకు, మనకు క్షేమదాయకం!’’ అంటాడు చాలా మర్యాదగా. ఇవన్నిటితో విసిగివేసారి... ఉక్రోషం, ఉడుకుమోత్తనం, ఆగ్రహం, ఆవేశం ఆవహించగా... ‘‘అసలు మీ ఎవ్వరికీ కనిపించకుండా వెళితే కాని మీరు దారికి రారు’’ అని వంటింట్లోకి వెళ్లిపోయింది ఒకసారి. మళ్లీ ఏదో గుర్తొచ్చి హాల్లోకి వచ్చిన అర్థాంగికి నట్టనడుమ ధ్యాన భంగిమలో కూర్చున్న భర్త, ఇద్దరు పిల్లలు కనపడ్డారు. ‘కళ్లెందుకు మూసుకున్నారు?’ అంది ఆశ్చర్యంగా.‘తెరిస్తే నువ్ కనడతావని’ అన్నాడు ఆయన నెమ్మదిగా. ‘నేను కనపడడమేంటి?’ మళ్లీ ఆశ్చర్యం ఆమెలో.‘ఇందాకే అన్నావ్‌గా మా ఎవ్వరికీ కనపడకుండా పోతే బాగుండు అని. నువ్వు వెళ్లడం ఎందుకు మేమే కళ్లు మూసుకుంటే సరిపోతుంది కదా అని.. ’ అన్నాడు. ఏం చేయలేక ‘నా ఖర్మ’ అంటూ తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రసూన. ‘దీనికి సంసారసారం ఎన్నటికీ బోధపడదు పాపం... వెర్రిది’ అని నిట్టూర్చింది అత్తగారు. సినిమాలో సంసారం సినిమా: దిల్ నా కొడుకును ఎందుకండీ తిట్టి పోసుకుంటారు... అని భర్తను విసుక్కుంటుంది.చలపతిరావు ఓ బాధ్యత గల తండ్రి. ఆయనకు తగిన ఇల్లాలు సుధ. వారి ముద్దుల తనయుడు నితిన్(శీను) కాలేజీ కుర్రాడు. చలపతిరావుకు గుడికి వెళ్లడం అలవాటు. ఓ రోజు గుడికి వెళదామని చలపతిరావు, సుధ, వేణుమాధవ్(శీనుకి మేనమామ)... ఎదురు చూస్తుంటారు. సాయంత్రం ఐదు గంటలైనా నితిన్ ఇంటికి రాడు. అప్పుడు... ఆ కోపాన్ని భార్యపై ప్రదర్శిస్తుంటాడు చలపతిరావు. ‘వెధవ.. వెధవన్నర వెధవ.. ఎక్కడ తగలెడ్డాడే వీడు. అస్సలు మనకు గుడికి వెళ్లే యోగం ఉందా? లేదా? ఇవ్వాళ. పనికిమాలిన వెధవ’ అని చలపతిరావు తిట్ల దండకం అందుకుంటాడు. ‘ఎందుకండీ నా కొడుకును అలా తిట్టి పోసుకుంటారు?’ అంటుంది సుధ. ‘తిట్టక, ముద్దెట్టుకోమంటావా? గుడికి వెళదామని నాలుగు గంటలకు బట్టలు వేసుకుని కూర్చున్నా.. ఇప్పుడు ఐదైంది’ కోపంతో అరుస్తాడు చలపతిరావు. ‘ఇంకో గంట ఆగితే ఆరవుద్ది బావా’ బదులిస్తాడు వేణు. ‘ఇంకో రెండు గంటలు ఆగితే ఏడవుద్ది. అప్పుడు గుడి కూడా మూసేస్తారు. అసలు ఎక్కడికి వెళ్లాడురా వీడు?’ ప్రశ్నిస్తాడు చలపతి. వాడికి తెలీదని అంటున్నాడుగా బదులిస్తుంది సుధ. ‘అయితే నీకు తెలుసన్నమాట. ఎక్కడికి వెళతానని చెప్పాడు?’ భార్యని ప్రశ్నిస్తాడు చలపతి. ‘బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి? అని అడగకూడదని మీరే కదండీ చెప్పారు?’ జవాబిస్తుంది సుధ. నాటకాలాడుతున్నారా? అంటూ చలపతి మండిపడతాడు. ‘హమ్మయ్య... వచ్చేశాడు బావా’ వేణు జవాబు. వచ్చాడా? ఆత్రుతగా గుమ్మంవైపు చూసిన చలపతి ‘ఏడిరా వచ్చాడన్నావ్?’ అంటాడు. ఏదో నీ తృప్తి కోసం చెప్పా బావా... అనగానే వేణు చెంప చెళ్లుమనిపించిన చలపతి... ‘నీ సంతోషం కోసం కొట్టా’ అంటాడు చలపతి. ‘వాడు డిస్కోకు వెళ్లాడని నేను చెప్పను బావా’ అంటూనే చెప్పేస్తాడు వేణు. ‘డిస్కో కా... వాడికి డబ్బులెక్కడి నుంచి వచ్చినయ్?’ అని భార్య వైపు చూస్తాడు చలపతి. సీన్ కట్ చేస్తే గదిలో మంచం మీద నిద్రపోతూ కనిపిస్తాడు నితిన్. ‘డిస్కో కా.. వాడికి డబ్బులెక్కడి నుంచి వచ్చినయ్?’ సినిమా: అతడు బ్రహ్మానందం మహా గడసరి. హేమ అమాయకురాలు. భర్త మాటంటే వేదం. తను ఏం చెప్పినా ఇలా చిటికెలో చేసేస్తుంటుంది. ఆ కంగారులో ఒక్కోసారి నోరు జారుతుంటుంది. ఆ మాటలకు బ్రహ్మానందం ఆమెను విసుక్కుంటుంటాడు. వేసవి సెలవులు కావడంతో హేమ పుట్టింటికి వచ్చి ఉంటుంది. బ్రహ్మానందం కూడా అత్తారింటికొస్తాడు. భర్త ఇంటికి రాగానే... ‘రేపొస్తానన్నారు?’ అంటుంది హేమ. ‘రైల్వేస్టేషన్లో ఫ్లాట్‌ఫామ్‌పై పడుకుని రేపొస్తా’ అని భార్యపై విసుక్కుంటాడు బ్రహ్మీ. ‘ఎందుకండీ అంత కోపం...’ అని అతడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది హేమ. ‘కోప్పడక.. ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని అల్లుడి కోసం కనీసం ఒక్క కారైనా స్టేషన్‌కి పంపలేరా?’ అని మండిపడతాడు బ్రహ్మానందం. ‘స్నానానికి వేడి నీళ్లు పెట్టి కాఫీ తీసుకురా’ అని ఆర్డరేస్తాడు భార్యకి. కాఫీ తీసుకొస్తుంది హేమ. ‘సాసర్ ఏదే? అంటే సెకండ్ డే కదా అని తీసేశారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కునేవాడికి పోసినట్లు దోసిట్లో పోస్తారా?’ చిర్రుబుర్రులాడతాడు బ్రహ్మీ. సాసర్ తెద్దామని లోనికి వెళ్లబోతుంది హేమ. ‘ఎక్కడికి? దీన్ని(కాఫీ కప్పు) ఏం చేయమంటావ్? నువ్వొచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు ఇలా పట్టుకుని నిలబడనా?’ అని మండిపడతాడు. ‘ఇవ్వండి’ అని కప్పు తీసుకుంటుంది హేమ. ‘విసుక్కుంటున్నావేంటే?’ అంటాడు బ్రహ్మీ. నేనా? అని హేమ అనగానే, మరి నేనా? అని ప్రశ్నిస్తాడు. దీంతో నోటిపై చేయి పెట్టుకుని ఇంటిలోకి వెళ్లి మళ్లీ కాఫీ తెచ్చిస్తుంది. క్వశ్చన్ మార్కుతో చూస్తాడు. ‘సాసర్ ఉంది కదండీ’ అని హేమ అనగానే... ‘సాసర్లో కప్పు, కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? వేడిగా ఉండక్కర్లేదా?’ అని దబాయిస్తాడు. వేడి చేసి తెస్తానండి అంటుంది హేమ. ఇలాంటి భర్తలు సినిమాలోనే కాదు మన చుట్టూ కూడా కనిపిస్తారు. ‘సాసర్లో కప్పు.. కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? వేడిగా ఉండక్కర్లేదా?’ – సరస్వతి రమ -
వాళ్లే డబ్బు అడుగుతున్నారు!
‘ఇప్పటి పరిస్థితుల్లో స్టార్స్ లేని సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముందుకు రావడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చే ఎగ్జిబిటర్స్ ఈ చిత్రం కోసం ఎదురు డబ్బులు అడుగుతు న్నారు. దీంతో నిర్మాతలు కష్టపడి థియేటర్స్‌ను సంపాదించి సొంతంగా సినిమాను విడుదల చేస్తున్నారు. చిన్న నిర్మాతల పరిస్థితి అలా తయారైంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ప్రధాన పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఎలుకా మజాకా’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలసి దాసరి నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. ‘‘చిన్న నిర్మాతల శ్రేయస్సు కోసం ఇప్పుడున్న రోజుకు నాలుగు ఆటలను ఐదు ఆటలు చేసి ఒంటిగంట ఆట చిన్న చిత్రానికి కేటాయించాలని, చిన్న సినిమాలకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరగా ప్రభుత్వ కమిటీ సానుకూలంగా స్పందించింది’’ అని దాసరి అన్నారు. ‘ఎలుకా మజాకా’ గురించి మాట్లాడుతూ - ‘‘రేలంగి చిత్రమంటే నా సినిమా కిందే లెక్క. వినాయకుడిని కేర్ చేయని హీరోను ఎలుక ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందన్నదే చిత్ర కథ. ఇది పిల్లలతో చూడాల్సిన చిత్రం’’ అని పేర్కొ న్నారు. ‘‘తొలిసారి గ్రాఫిక్స్‌తో చిత్రం తీశా. దీనిలో 40 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. జంధ్యాల గారి, నా చిత్రాల్లో ఓ మ్యాన రిజం ఉంటుంది. ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర రఘుబాబు చేశారు’’ అని రేలంగి అన్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ, ‘వెన్నెల’ కిశోర్, పావని, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ మాట్లాడారు. -
త్రిషయితాన్
సైతాన్... దయ్యం... పిశాచి... అమ్మో అనుకోకండి. ఒక స్టార్ సత్తా చూపడానికి ఈ పాత్రలే గీటురాళ్లు. నమ్మకం లేదా? జ్యోతిక వేసిన ‘చంద్రముఖి’ చూడండి. అద్గదీ సంగతి. త్రిష కూడా ఇప్పుడు ఆ బాటలో తన సత్తా చూపే కొత్త పాత్ర చేస్తోంది... నటిగా పదిహేనేళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న గ్లామర్ హీరో యిన్ త్రిష. అందంగా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా రనే పేరున్న త్రిష ‘‘ఇక ఈ దశలో కొత్త తరహా పాత్రలు చేయాల్సిన అవసరముంది’’ అని గ్రహించారు. అందుకు తగ్గట్లే ఒక వినూత్న తరహా పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. హార్రర్ సినిమాలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై ఏకకాలంలో తెలుగు - తమిళ భాషల్లో ఈ చిత్రం తయారవు తోంది. రెండు భాషల్లోనూ ‘నాయకి’ అని టైటిల్ పెట్టారు. ‘షి వాచెస్ అండ్ క్యాచెస్ యు’ అనే వినూత్నమైన స్లోగన్ వాడుతున్నారు. దీర్ఘకాలంగా త్రిషకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఎం. గిరిధర్, శ్రీమతి పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. చెన్నైలోని ఏ.వి.ఎం. స్టూడియోలోని వినాయకుడి గుడి దగ్గర గురువారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, పబ్లి సిటీ డిజైనర్ లంకా భాస్కర్ తదితర చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ పూజలో పాల్గొన్నారు. అయిదు నిమిషాలకే ఓ.కె! ‘‘హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్లో ఉండగా, దర్శకుడు గోవి వచ్చి, ఈ ‘నాయకి’ చిత్రం కథ చెప్పారు. చెప్పడం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే నాకు కథ నచ్చేసింది. సినిమా చేయాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయా. కానీ, ఎంతో ఆత్రంగా గోవి కథ చెబుతున్న తీరు చూసి, ఆయనకు అడ్డుపడదలుచుకోలేదు. దాదాపు గంటసేపు ఆయన స్క్రిప్ట్ వివరంగా చెబుతుంటే, ఆసక్తిగా విన్నా’’ అని త్రిష పేర్కొన్నారు. ఈ హార్రర్ - కామెడీ జానర్ సినిమా గురించి త్రిష వివరిస్తూ, ఇలాంటి తరహా పాత్ర ఇంతకు ముందెప్పుడూ చేయలేదన్నారు. తనతో పాటు మరికొందరు తారలు కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘‘మల్టీ స్టారర్’’గా త్రిష పేర్కొనడం విశేషం. గణేశ్ వెంకట్రామ్, ‘సత్యం’ రాజేశ్, జయప్రకాశ్, బ్రహ్మానందం, మనోబాల, కోవై సరళ తదితరులు చిత్రంలోని ఇతర పాత్రధారులు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం గోవి నిర్విహ స్తుంటే, రఘు కుంచె సంగీతం, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. భయపెట్టే పాత్రలో... గమ్మత్తేమిటంటే, హార్రర్ తరహా సినిమాలు చేయాలంటే ఇష్టమంటున్న త్రిష ఇప్పుడు సరిగ్గా అలాంటి పాత్రే చేస్తుండడం విశేషం. ‘‘హార్రర్ -కామెడీ జానర్లో గతంలో కూడా సినిమాలు వచ్చాయి. వాటిలో నూటికి 90 సినిమాలు సూపర్‌హిట్స్. ప్రత్యేకించి ఆ జానర్ అందరికీ బాగా నచ్చింది. కాగా, మేమిప్పుడు చేస్తున్న ‘నాయకి’ కథాకాలం కానీ, ఆ నేపథ్యం కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి’’ అని త్రిష వివరించారు. అప్పటి లుక్‌లో... 1980ల నాటికి చెందిన కథతో సాగే ఈ చిత్రంలో త్రిష లుక్స్ అప్పటి తరహా దుస్తుల్లో, ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే, షూటింగ్ షురూ పోస్టర్స్ గురించి చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ రాజమౌళి సైతం ‘‘ఈ మధ్య పోస్టర్లతో ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో ‘నాయకి’ ఒకటి. చేతిలో కత్తితో, పెదవులపై చిరునవ్వుతో, వినూత్నమైన గెటప్‌తో త్రిష లుక్ బాగుంది’’ అని ట్వీట్ చేశారు. ఇవన్నీ విని ఆనందిస్తున్న త్రిష ఈ చిత్రాన్ని ‘రెట్రో హార్రర్ - కామెడీ’ అన్నారు. ‘‘హీరోయిన్లకు అరుదుగా వచ్చే స్క్రిప్ట్ ఇది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రూపొందించే దర్శక, రచ యితలు ఉండడం అదృష్టం. ఈ స్క్రిప్ట్‌కు నేను న్యాయం చేస్తాననే అనుకుంటున్నా’’ అంటున్నారు త్రిష. మరి, ఇంతకీ ఈ సినిమాలో త్రిష పోషిస్తు న్నది హంతకురాలి పాత్రా, బాధితురాలి పాత్రా, లేక దయ్యం పాత్రా? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే! -
బాబోయ్... ఎలుక!
కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డైరక్టర్ రేలంగి నరసింహారావు, కొంత విరామం తర్వాత తీసిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిషోర్, పావని జంటగా నా ఫ్రెండ్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ -‘‘ఎలుక ప్రధానంగా ఇంతవరకూ హాలీవుడ్‌లోనే వచ్చాయి. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. నేను కామెడీ చిత్రాలు మాత్రమే చేశాను. కానీ సీజీ వర్క్ నేపథ్యంలో సాగే హాస్యరస చిత్రం చేయడం ఇదే ఫస్ట్ టైమ్. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, గ్రాఫిక్స్: సత్య. -
ఎలుక ఎంత పని చేసింది?
కామెడీ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ డెరైక్టర్ రేలంగి నరసింహారావు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘పోలీసు భార్య’... ఇలా ఏకంగా 74 కామెడీ సినిమాలు తీసి తనకంటూ స్థానం ఏర్పరచుకున్నారాయన. చాలా విరామం తర్వాత రేలంగి నరసింహారావు మళ్లీ మెగాఫోన్ పట్టారు. ‘ఎలుకా మజాకా’ అనే తమాషా టైటిల్‌తో ఓ సినిమా చేశారు. ఇందులో ఎలుక ఏం చేసిందో, ఎంత పని చేసిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారాయన. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావులు నిర్మించారు. ‘‘ఇంటర్వెల్ వరకూ గ్రాఫిక్ వర్క్ పూర్తయింది. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్‌ల మధ్య కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మూల కథ: మురళీమోహనరావు, స్క్రీన్‌ప్లే: దివాకర్ బాబు, సంగీతం: బల్లేపల్లి మోహన్. -
అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!
‘‘ ‘ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నాగాన్వేష్ బాలనటునిగా చేశాడు. సినిమాపై ప్రేమతో చాలా కష్టపడి హీరో అయ్యాడు. ఫైట్స్, డాన్స్‌లు బాగా చేశాడు’’ అని బ్రహ్మానందం అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బిగ్ సీడీని ఆవిష్కరించగా, పాటల సీడీలను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విడుదల చేశారు. తలసాని మాట్లాడుతూ -‘‘భారత చిత్రపరిశ్రమకు హైదరాబాద్ త్వరలోనే కేంద్ర బిందువుగా మారుతుంది. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది’’ అన్నారు. నాగాన్వేష్ మాట్లాడుతూ -‘‘ముంబై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నా. ఎంతోమంది పెద్ద హీరోలతో పనిచేసిన రామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
ఆవకాయ చూపులు
హీరోయిన్ రజనీని పెళ్లిచూపులు చూసుకోవడానికి శుభలేఖ సుధాకర్ తన అన్నయ్యలతో కోట శ్రీనివాసరావు ఇంటికి వస్తాడు. కానీ వాళ్లు అన్నయ్యలు కాదు... గున్నయ్యలు. ముగ్గురూ కారులోంచి దిగుతారు. కోట: రండి..రండి.. శుభలేఖ సుధాకర్: నమస్కారం అండి.. నా పేరు కుక్కుటేశ్వరరావు, వీళ్లిద్దరూ నా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఇతను ఘనోదరుడు. కోట: వీరబాహుడు, ఘనోదరుడా.. అదేంటండి రాక్షసుల పేర్లు. శుభలేఖ: మా నాన్నగారు అదో టైపు మనిషిలేండి! మామూలుగా అందరూ దేవుళ్ల పేర్లు పెడతారు. కానీ మాకు రాక్షసుల పేర్లు పెట్టారు. అందరూ వెళ్లి మంచం మీద కూర్చుంటారు. కోట: కూర్చోండి బాబూ కూర్చోండి. వీరబాహుడు: మా తమ్ముడికి కాబోయే భార్యకు వంట, ఆటాపాటా వచ్చుండాలని మా నాన్నగారి కోరిక. కోట: మా అమ్మాయని చెప్పుకోవడం కాదు గాని బాగా ఆడగలదు పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి కన్నాంబ, కాంచనమాల ఇలా అన్నమాట. ఘనోదరుడు: కన్నాంబ, కాంచనమాల... వాళ్లిద్దరూ ముసలాళ్లు అయిపోయి చనిపోయారు కదండి..! కోట: వాళ్లు పోయారా! నాకు తెలీదు లేండి! నేను సినిమా చూసి పాతికేళ్లు దాటింది. బ్రహ్మానందం అప్పటికే లడ్టూలు అవీ తీసుకొస్తుంటే, కోట గబాలున వెళ్లి కోట: ఏమిటిరా ఇది అరగుండు వెధవా... ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతుందనుకుంటున్నావా! బ్రహ్మీ: పెళ్లి వారు వస్తున్నారని అమ్మగారే చేశారండయ్య. ఈ మాత్రం పెట్టకపోతే బా..బా.. బాగుండదని... కోట: బాగుండటం ఏమిటి నీ బొంద.. మనుషుల సైజులు చూశావా. ఒక్కొక్కడు తిరుపతి కొండంత ఉన్నాడు..ఊదే స్తారు.. వీర: ఏమిటవి టిఫిన్లా..? వెరీ గుడ్ తీసుకురండి ఓ పనైపోతుంది. రెండోసారి వచ్చారు. శుభలేఖ సుధాకర్: నమస్కారం అండీ... కోట: కాఫీలు అవి టీబీలోనే తాగొచ్చారు కదా..? వీరబాహుడు: కాఫీలే తాగాం. టిఫిన్లు చేయలేదు. మీ ఇంట్లో తిందామని. కోట: మా ఇంట్లో టిఫిన్లు లేవు. అసలు మా ఇంట్లో ఉప్పు లేదు. ఉప్పు లేకుండా ఎలా తింటారు. ఘనోదరుడు: అయ్యో పర్లేదండి! ఏవండి జానకమ్మగారూ... కోట: ఇప్పుడు అదెందుకండీ! నన్ను తింటున్నారు చాలట్లేదూ..! జానకమ్మ: రండి బాబూ రండి ఘనోదరుడు: ఇంట్లో ఆవకాయ ఉందామ్మ కోట: ఆవకాయా! అమ్మో కారం. శుభలేఖ సుధాకర్: వీళ్లు పచ్చళ్లు తినరండీ... పెచ్చులు మాత్రమే తింటారు. బ్రహ్మి (స్వగతం): తిక్క కుదిరింది తింగరి పీనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా ఆ మొహం చూడు. పోతావ్రొరేయ్ నిత్య నికృష్ట. ఏ ఏటికాయేడు నువ్వు నిలవుంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా తెప్పించు. పోతావ్రొరేయ్... నాశనమైపోతావ్..! వీరబాహుడు, ఘనోదరుడు జాడీలోంచి పచ్చడి ముక్కను తీసుకుని నీళ్లలో ముంచి తింటూ ఉంటారు కోట పట్టరాని కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇంతలో శు.సు: బాగుందండీ... నాకు చాలా బాగా నచ్చింది. కోట: ఏమిటి ఆవకాయనా? శు.సు: కాదండీ మీ అమ్మాయి. మరి ఆటాపాటా..? కోట: ఎలాగో మాష్టారు వచ్చి పాఠం చెప్పే టైమైంది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్లు... ఆవకాయ ముక్కల్ని నవిలేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. వీరబాహుడు: అబ్బే దీనిని ఆపడం ఎందుకండీ... దేనికదే! ప్రేక్షకుల నవ్వు... ఆ వెనుక పాట మొదలైపోతాయి. - శశాంక్ బూరుగు -
హాస్య పద్మాలు
అపురూపం ‘నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం రోగం’... అనేవారెప్పుడూ జంధ్యాలగారు. నవ్వించడం నటులకి అంత తేలిక కాదు. నవ్వించగలిగిన నటులకి మిగిలిన అన్ని రసాలు అభినయించడం తేలికే! అటువంటి హాస్యాన్ని పండించి మెప్పించిన హాస్యనటులు తెలుగులో ఎందరో! వారంతా ప్రజల గుర్తింపునూ పొందారు. వారిలో కొందరు ప్రభుత్వ గుర్తింపునూ పొందారు! ‘పద్మవిభూషణ్’, ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’. ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను 1954 నుండి భారత ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. దక్షిణాదిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందిన తొలి హాస్యనటుడు శ్రీ రేలంగి వెంకట్రామయ్య. ఆ తరువాత కాలంలో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంలు అందుకున్నారు. ఆ రోజుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ కమెడియన్ శ్రీ రేలంగి! 1970లో ఆయన, నాటి రాష్ట్రపతి వి.వి.గిరి నుండి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే యాభై సంవత్సరాల పాటు 1,013 చిత్రాలలో నవ్వించారు శ్రీ అల్లు రామలింగయ్య. ఆయన, 1990లో నాటి భారత రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. హీరో ఎవరైనా సరే... బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్! ఇది ప్రస్తుతం బ్రహ్మానందం స్థాయి! 28 సంవత్సరాల సినీ జీవితంలో అప్పుడే వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్న బ్రహ్మానందం ‘పద్మశ్రీ’ బిరుదును 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం పొందుతోన్న బ్రహ్మానందం అప్పుడు గాని... ఇప్పుడు గాని తెలుగులో ఉన్నంత మంది హాస్యనటులు మరే భాషలోనూ లేరు! అలాగే ముగ్గురు హాస్యనటులు ‘పద్మ’ పురస్కారాలను మరే భాషలోనూ అందుకున్న గుర్తూ లేదు!! హ్యాట్సాఫ్ టూ తెలుగు హాస్యనటులు!!! -నిర్వహణ: సంజయ్ కిషోర్ -
కళాత్మకం : నవ్వుల హరివిల్లు
ఎదురుగా కొలీగ్ కనిపిస్తే అసంకల్పిత చర్యగా నవ్వుతాం. అది క్యాజువల్ నవ్వు. పక్కింటివాళ్లు కనిపిస్తే నవ్వుతాం... అది తప్పనిసరి నవ్వు. ఇష్టం లేని వాళ్లు ఎదురైతే తిట్టలేక... లోలోపల తిట్టుకుంటూ నవ్వుతాం. అది కృతకమైన నవ్వు. 24 గంటల్లో ఇలాంటి ఎన్నో నవ్వులు నవ్వుతూనే ఉంటాం. అయితే నవ్వంటే ఇది కాదు. హాయిగా నవ్వాలి. అరమరికలు లేకుండా నవ్వాలి. భుజాలు కదిలేలా నవ్వాలి. అలా నవ్వాలంటే... నవ్వు రావాలి. ఆ నవ్వు ఎలా వస్తుంది? నవ్వించే వాళ్లు మన దగ్గరగా ఉంటే వస్తుంది. నవ్వించడమే పనిగా ఎవరు పెట్టుకుంటారు? దోర్నాల హరిబాబు అదే పనిలో ఉన్నారు. రంగస్థలం మీద నవ్వించారు, టీవీ రియాలిటీ షోలలో నవ్వించారు, సినిమాల్లో, సినిమా ప్రోగ్రాముల్లో నవ్విస్తున్నారు. విదేశాలకెళ్లి మరీ అక్కడి తెలుగు వాళ్లను నవ్విస్తున్నారు. ఈ నెల 9నుంచి 25వ తేదీ వరకు అమెరికాలో జరిగే ‘క్యాపిటల్ ఏరియా తెలుగు అసోసియేషన్(క్యాట్స్)’ దసరా - దీపావళి ఉత్సవాలలో నవ్వించడానికి ప్రయాణమవుతున్నారు. డల్లాస్, వాషింగ్టన్ డిసి, ఇండియానా పోలిస్, అట్లాంటా, కాలిఫోర్నియాలలో సాంస్కృతిక సంబరాలలో పాల్గొననున్నారు. పౌరాణికాల నుంచి... హాస్యనటుడు దోర్నాల హరిబాబు నాటకరంగంలో అడుగుపెట్టి 30 ఏళ్లు దాటింది. మొదట పౌరాణికాల్లో రంగప్రవేశం చేశారు. 1980లో ప్రముఖ రంగస్థల నటులు పొన్నాల రామసుబ్బారెడ్డి దగ్గర శిష్యరికం చేశారు. పన్నెండేళ్లపాటు పౌరాణిక నాటకాల్లో నటించిన అనుభవం చక్కటి ఉచ్చారణనిచ్చింది. నటుడిగా ఇంకా ఏదో చేయాలన్న తపనను పెంచింది. తనకు ఇష్టమైన హాస్యాన్ని పండించాలంటే సాంఘిక అంశాలతోనే సాధ్యం అనుకున్నారు హరిబాబు. తనే కామెడీ స్కిట్స్ రాయడం మొదలుపెట్టారు. ఆయన ఇతివృత్తాలలో సామాజికాంశం, ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా ఉంటాయి. హరిబాబు సామాజికాంశాలకు చమత్కారం జోడించి నవ్విస్తూ చెప్పడం వల్ల ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేరవేయడానికి ఇదే మంచి ప్రసారసాధనం అనుకున్నారు అధికారులు. అలా సారా వ్యతిరేకోద్యమం, పారిశుద్ధ్యం- ప్రజారోగ్యం, దోమల నిర్మూలన పథకాల ప్రచార కార్యక్రమాలలో నటించారు. కామిడీ స్కిట్స్ తానే రాసుకోవడం వల్ల వాటిని అంతే పట్టుతో నటించి నవ్వించడం సులువవుతోందంటారాయన. ట్రెండ్‌కు అనుగుణంగా... రంగస్థలం మీద హాస్యాన్ని పండించి 19సార్లు ఉత్తమ హాస్యనటుడుగా బహుమతి అందుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తమిళనాడు, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హాస్యనాటకాలు ప్రదర్శించారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కళాప్రదర్శన మాద్యమాన్ని కూడా మార్చుకుంటేనే మనుగడ. హరిబాబు సక్సెస్ ఫార్ములా సరిగ్గా అదే. టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్‌లలో నటించి ప్రేక్షకులను నవ్వించారు. ఈ నవ్వులు ఖండాంతరాలు దాటాయి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు స్వయంగా వచ్చి నవ్వించమని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాల మేరకు అమెరికా, దుబాయ్, మలేసియా, మారిషస్ దేశాల్లో సంక్రాంతి సంబరాలు, తెలుగు సంఘం వేడుకల్లో హాస్యనాటకాలు ప్రదర్శించారు. లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చి పురస్కారాలందుకోవడం నాణేనికి ఒకవైపు, మరోవైపు హరిబాబు తోటి కళాకారులను సత్కారాలు చేస్తుంటారు. హరివిల్లు క్రియేషన్స్ పేరుతో సాంస్కృతిక సంస్థను స్థాపించి కళాసేవ చేస్తున్నారు. ఆధునిక జీవితంలో రోజంతా ఉరుకులు పరుగులతో క్షణం కూడా తీరికలేకుండా ఎన్నో పనులు చేస్తున్నాం, ఎంతో సాధిస్తున్నాం. ఇన్ని సాధించే హడావిడిలో పడిపోయి మంచి నవ్వుని మిస్ అవుతున్నాం. ఆ నవ్వుని అందించే హాస్యపువిల్లు ఈ హరిబాబు. - వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స ప్రతినిధి హరిబాబు గురించి... పుట్టింది, పెరిగింది... నెల్లూరు పౌరాణిక పాత్రలు: కర్కోటకుడు, జీవలుడు (చిత్రనళీయం), లోహితుడు, కేశవుడు (సత్యహరిశ్చంద్ర), భరతుడు (శకుంతల), చిన్న చంద్రుడు (తారాశశాంకం), సుకులుడు (సారంగధర), శ్రీరాముడు(భక్తరామదాసు) పౌరాణిక ప్రదర్శనలు: దాదాపుగా 400 19 సార్లు ఉత్తమ హాస్యనటుడిగా బహుమతులు చెన్నైలో ఆంధ్రసోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నాటక పోటీల్లో స్వర్ణ పతకం ప్రభుత్వ పథకాల అంశాలతో హాస్యనాటకాల రాయడం, నటించడం. టీవీ రియాలిటీషోలలో... ‘స్మైల్ రాజా’ అవార్డుతోపాటు లక్షరూపాయల బహుమతి. జీ స్మైల్ శ్రీ, మత్తుగా గమ్మత్తుగా, నవ్వుల్- నవ్వుల్‌కి వ్యాఖ్యాత. స్టేజ్ ప్రోగ్రామ్‌లు... హాస్యవల్లరి పేరుతో రాష్ర్టవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు.