
నవ్వుకు మరో పేరు అనేలా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బ్రహ్మానందం. మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్నారాయన. ఇప్పుడు అమెరికాలో ఘన సన్మానం అందుకోనున్నారు. అమెరికాలోని సియోటెల్ నగరంలో ఈ నెల 6న జరగనున్న తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోవాల్సిందిగా బ్రహ్మానందంకి ఆహ్వానం అందింది.
ఇదే వేదికపై 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ ఆయన్ను ఘనంగా సన్మానించనుంది. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘బ్రహ్మానందంగారికి మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు వరించాలి’’ అని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment