ఆవకాయ చూపులు | avakaya glances | Sakshi
Sakshi News home page

ఆవకాయ చూపులు

Published Sat, May 23 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

ఆవకాయ చూపులు

ఆవకాయ చూపులు

 హీరోయిన్ రజనీని పెళ్లిచూపులు చూసుకోవడానికి శుభలేఖ సుధాకర్ తన అన్నయ్యలతో కోట శ్రీనివాసరావు ఇంటికి వస్తాడు. కానీ వాళ్లు అన్నయ్యలు కాదు... గున్నయ్యలు. ముగ్గురూ కారులోంచి దిగుతారు.

 కోట: రండి..రండి..
 శుభలేఖ సుధాకర్: నమస్కారం అండి.. నా పేరు కుక్కుటేశ్వరరావు, వీళ్లిద్దరూ నా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఇతను ఘనోదరుడు.
 కోట: వీరబాహుడు, ఘనోదరుడా.. అదేంటండి రాక్షసుల పేర్లు.
 శుభలేఖ: మా నాన్నగారు అదో టైపు మనిషిలేండి! మామూలుగా అందరూ దేవుళ్ల పేర్లు పెడతారు. కానీ మాకు రాక్షసుల పేర్లు పెట్టారు.
 అందరూ వెళ్లి మంచం మీద కూర్చుంటారు.
 కోట: కూర్చోండి బాబూ కూర్చోండి.
 వీరబాహుడు: మా తమ్ముడికి కాబోయే భార్యకు వంట, ఆటాపాటా వచ్చుండాలని మా నాన్నగారి కోరిక.
 కోట: మా అమ్మాయని చెప్పుకోవడం కాదు గాని బాగా ఆడగలదు పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి కన్నాంబ, కాంచనమాల ఇలా అన్నమాట.
 ఘనోదరుడు: కన్నాంబ, కాంచనమాల... వాళ్లిద్దరూ ముసలాళ్లు అయిపోయి చనిపోయారు కదండి..!
 కోట: వాళ్లు పోయారా! నాకు తెలీదు లేండి! నేను సినిమా చూసి పాతికేళ్లు దాటింది.
 బ్రహ్మానందం అప్పటికే లడ్టూలు అవీ తీసుకొస్తుంటే, కోట గబాలున వెళ్లి
 కోట: ఏమిటిరా ఇది అరగుండు వెధవా... ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతుందనుకుంటున్నావా!
 బ్రహ్మీ:  పెళ్లి వారు వస్తున్నారని అమ్మగారే చేశారండయ్య. ఈ మాత్రం పెట్టకపోతే బా..బా.. బాగుండదని...
 కోట: బాగుండటం ఏమిటి నీ బొంద.. మనుషుల సైజులు చూశావా. ఒక్కొక్కడు తిరుపతి కొండంత ఉన్నాడు..ఊదే స్తారు..
 వీర: ఏమిటవి టిఫిన్లా..? వెరీ గుడ్ తీసుకురండి ఓ పనైపోతుంది.
 రెండోసారి వచ్చారు.
 శుభలేఖ సుధాకర్: నమస్కారం అండీ...
 కోట: కాఫీలు అవి టీబీలోనే తాగొచ్చారు కదా..?
 వీరబాహుడు: కాఫీలే తాగాం. టిఫిన్లు చేయలేదు. మీ ఇంట్లో తిందామని.
 కోట: మా ఇంట్లో టిఫిన్లు లేవు. అసలు మా ఇంట్లో ఉప్పు లేదు. ఉప్పు లేకుండా ఎలా తింటారు.
 ఘనోదరుడు: అయ్యో పర్లేదండి! ఏవండి జానకమ్మగారూ...
 కోట: ఇప్పుడు అదెందుకండీ! నన్ను తింటున్నారు చాలట్లేదూ..!
 జానకమ్మ: రండి బాబూ రండి
 ఘనోదరుడు: ఇంట్లో ఆవకాయ ఉందామ్మ
 కోట: ఆవకాయా! అమ్మో కారం.
 శుభలేఖ సుధాకర్: వీళ్లు పచ్చళ్లు తినరండీ... పెచ్చులు మాత్రమే తింటారు.
 బ్రహ్మి (స్వగతం): తిక్క కుదిరింది తింగరి పీనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా ఆ మొహం చూడు. పోతావ్‌రొరేయ్ నిత్య నికృష్ట. ఏ ఏటికాయేడు నువ్వు నిలవుంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా తెప్పించు. పోతావ్‌రొరేయ్... నాశనమైపోతావ్..!
 వీరబాహుడు, ఘనోదరుడు జాడీలోంచి పచ్చడి ముక్కను తీసుకుని నీళ్లలో ముంచి తింటూ ఉంటారు
 కోట పట్టరాని కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇంతలో
 శు.సు: బాగుందండీ... నాకు చాలా బాగా నచ్చింది.
 కోట: ఏమిటి ఆవకాయనా?
 శు.సు: కాదండీ మీ అమ్మాయి. మరి ఆటాపాటా..?
 కోట: ఎలాగో మాష్టారు వచ్చి పాఠం చెప్పే టైమైంది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్లు... ఆవకాయ ముక్కల్ని నవిలేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం.
 వీరబాహుడు: అబ్బే దీనిని ఆపడం ఎందుకండీ... దేనికదే!
 ప్రేక్షకుల నవ్వు... ఆ వెనుక పాట మొదలైపోతాయి.
 - శశాంక్ బూరుగు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement