
‘‘ప్రేమించటానికి ఒక అందమైన అమ్మాయిని ఇచ్చావ్. పెళ్లి చేసుకుందామనుకుంటే అడ్డుపడ్డానికి ఆరుగురు కోతుల్లాంటి తమ్ముళ్లని ఇచ్చావ్’’ అని రాజేంద్రప్రసాద్, ‘‘పొగరు నా వొంట్లో ఉంది.. హీరోయిజమ్ మా బావ ఇంట్లో ఉంది’’.. అని బ్రహ్మానందం చెప్పిన డైలాగులు ‘ఊ.పె.కు.హ’ సినిమాపై భలే ఆసక్తి పెంచుతున్నాయి. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో సాక్షీ చౌదరి కథానాయికగా ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అన్నది ఉపశీర్షిక.
బేబీ లక్ష్మీ నరసింహా హిమ ఋషిత సమర్పణలో భాగ్యలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ‘నిధి’ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘80మంది కమెడియన్లతో వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. రాజేంద్రప్రసాద్‌గారి నటన ప్రత్యేక ఆకర్షణ. బ్రహ్మానందంగారి, రాజేంద్రప్రసాద్‌గారి కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి’’ అన్నారు. ‘‘ప్రసాద్‌గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. అందర్నీ అలరించే చిత్రమవుతుంది’’ అన్నారు భాగ్యలక్ష్మి. ఈ చిత్రానికి కెమెరా: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఆర్. నాగరాజు, సంగీతం: అనూప్ రూబెన్స్.
Comments
Please login to add a commentAdd a comment