ఎలుక ఎంత పని చేసింది? | Brahmanandam-Yeluka Majaka Movie | Sakshi
Sakshi News home page

ఎలుక ఎంత పని చేసింది?

Jul 21 2015 1:51 PM | Updated on Sep 3 2017 5:51 AM

ఎలుక ఎంత పని చేసింది?

ఎలుక ఎంత పని చేసింది?

కామెడీ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ డెరైక్టర్ రేలంగి నరసింహారావు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’,

 కామెడీ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ డెరైక్టర్ రేలంగి నరసింహారావు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘పోలీసు భార్య’...  ఇలా ఏకంగా 74 కామెడీ సినిమాలు తీసి తనకంటూ స్థానం ఏర్పరచుకున్నారాయన. చాలా విరామం తర్వాత రేలంగి నరసింహారావు మళ్లీ మెగాఫోన్ పట్టారు. ‘ఎలుకా మజాకా’ అనే తమాషా టైటిల్‌తో ఓ సినిమా చేశారు. ఇందులో ఎలుక ఏం చేసిందో, ఎంత పని చేసిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారాయన.

 బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావులు నిర్మించారు. ‘‘ఇంటర్వెల్ వరకూ గ్రాఫిక్ వర్క్ పూర్తయింది. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్‌ల మధ్య  కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మూల కథ: మురళీమోహనరావు, స్క్రీన్‌ప్లే: దివాకర్ బాబు, సంగీతం: బల్లేపల్లి మోహన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement