Eluka Majaka
-
ఎలుకతో ఫుల్ కామెడీ!
కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే దర్శకులు రేలంగి నరసింహారావు. చాలా గ్యాప్ తరువాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, పావని ప్రధాన పాత్రల్లో మారెళ్ళ నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఎలుకా మజాకా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో హీరోగా ఎవరిని ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘వెన్నెల’ కిశోర్ అయితే బాగుంటుందని చాలామంది చెప్పారు. అతడు నటించిన సినిమాల డీవీడీలు చూసి నా చిత్రానికి బాగా యాప్ట్ అవుతాడనిపించి మా గురువుగారు దాసరికి చెప్పాను. ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ సినిమాలో ఎలుకకు గొప్ప సెంటిమెంట్ ఉంది. ఎలుకదే ప్రధాన పాత్ర. అదేంటో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్ర కుమార్, సంగీతం: బల్లేపల్లి మోహన్. -
ఇండియాలోనే గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్ రేలంగి
- రాజేంద్రప్రసాద్ ‘‘చాలా సంవత్సరాల తర్వాత నా శిష్యుడైన రేలంగి నరసింహారావు ఈ సినిమా డెరైక్ట్ చేశాడు. ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి బాగోలేకపోవడంతో తను ఈ సినిమా చేయకూడదని అనుకున్నాడు. నేను చెప్పడంతో చేశాడు. గొప్ప సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పారు. ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మానందం, పావని ముఖ్య పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బల్లేపల్లి మోహన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి నారాయణరావు ఆవిష్కరించి, తొలి సీడీని రాజేంద్రప్రసాద్‌కు అందించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ-‘‘ రేలంగి నరసింహారావుగారు తీసిన 75 సినిమాల్లో 35 సినిమాల్లో నేనే హీరో. ఇండియాలోని అతి గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్స్‌లో ఆయన ఒకరు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరోగా ఎవ రైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో నాకు ‘వెన్నెల’ కిశోర్ గురించి కొంత మంది చెప్పారు. అతనికి మంచి కామెడీ టైమింగ్ ఉంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో నటులు గిరిబాబు, సీనియర్ నరేశ్, దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎలుక ఎంత పని చేసింది?
కామెడీ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ డెరైక్టర్ రేలంగి నరసింహారావు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘పోలీసు భార్య’... ఇలా ఏకంగా 74 కామెడీ సినిమాలు తీసి తనకంటూ స్థానం ఏర్పరచుకున్నారాయన. చాలా విరామం తర్వాత రేలంగి నరసింహారావు మళ్లీ మెగాఫోన్ పట్టారు. ‘ఎలుకా మజాకా’ అనే తమాషా టైటిల్‌తో ఓ సినిమా చేశారు. ఇందులో ఎలుక ఏం చేసిందో, ఎంత పని చేసిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారాయన. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావులు నిర్మించారు. ‘‘ఇంటర్వెల్ వరకూ గ్రాఫిక్ వర్క్ పూర్తయింది. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్‌ల మధ్య కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మూల కథ: మురళీమోహనరావు, స్క్రీన్‌ప్లే: దివాకర్ బాబు, సంగీతం: బల్లేపల్లి మోహన్.