Anoop Rubens
-
హారర్ సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘హారర్ చిత్రాల్లో నటించకూడదనుకున్నాను. కానీ ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమా కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని హీరోయిన్ నందితా శ్వేత అన్నారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. అభినిక ఐనాభాతుని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పాప నువ్వు తోపు..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సింహాచలం లిరిక్స్ అందించిన ఈ పాటను బాలసూరన్న పాడారు. ఈ పాట విడుదల వేడుకలో శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ–‘‘హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. హారర్ కథలకు మ్యూజిక్ చాలా ముఖ్యం.. అనూప్‌గారు ప్రాణం పెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ పాప నువ్వు తోపు..’ పాట ఆకట్టుకుంటుంది’’ అన్నారు అనూప్ రూబెన్స్. -
మంచు విష్ణు మూవీకి సరికొత్త టైటిల్, ప్రకటించిన టీం
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమాకి ‘జిన్నా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విష్ణు కెరీర్లో ఇది 19వ చిత్రం. డా. మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత టైటిల్‌ని కూడా వెరైటీగా రివీల్ చేశారు. సునీల్, కోన వెంకట్, ఛోటా కె.నాయుడు, అనూప్ రూబెన్స్, ఈషాన్ సూర్యతో కలిసి విష్ణు సరదాగా చిట్ చాట్ చేస్తూ, ఫైనల్‌గా ‘జిన్నా’ అనే టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్ర చేస్తున్నారు విష్ణు. ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తుండగా సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. -
ఫ్రెండ్ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్!
అనిల్, సంజీవ్ మరియు దివ్య ఓ ఫ్యాన్ కంపెనీ స్థాపించి మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో జత కలిసి మరింత ముందుకు వెళ్తున్నారు. ఆయన కూడా ఒక ఇన్వెస్టర్‌గా మారి సదరు ఫ్యాన్స్ కంపెనీ టీమ్‌తో చేతులు కలిపారు. ఈ కంపెనీ ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయినందున అనూప్ రూబెన్స్, సదరు ఫ్యాన్స్ యజమానులు శనివారం నాడు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ "అనిల్ నాకు మంచి మిత్రుడు. సంవత్సర కాలం క్రితం ఇతడు ఈ ఫ్యాన్స్ కంపెనీని ప్రారంభించాడు. మంచి విజయాన్ని అందుకున్నాడు. నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని మన జీవితంలో ఫ్యాన్స్ చాలా ముఖ్యం, ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది. వీళ్లు తయారు చేసిన ఫ్యాన్ వల్ల 65 % కరెంటు ఆదా అవుతుంది. రివర్స్ ఫీచర్ ఉంది. త్వరలో మార్కెట్లో మా ఫ్యాన్ పేరు కూడా టాప్ లిస్ట్‌లో ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్ర, కర్ణాటకలోనే లభిస్తున్నాయి. త్వరలో తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాలలో లభిస్తాయి. ఈ ఫ్యాన్స్ కంపెనీలో నేను పార్టనర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది'" అని చెప్పుకొచ్చాడు. చదవండి: అమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది: యాంకర్ శివ కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. ఫుల్ వీడియో సాంగ్ చూశారా? -
గజదొంగల నవ్వులు
‘‘హౌస్ అరెస్ట్’ సినిమా స్టార్ట్ కావడానికి కారణం అనూప్ రూబెన్స్. చిన్నపిల్లల సినిమా ఫుల్ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. పిల్లల దృష్టి కోణంలో సాగే ఈ చిత్రంలో ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు ఉంటాయి. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది’’ అని డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో ‘90ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ‘హౌస్ అరెస్ట్’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘హౌస్ అరెస్ట్’ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ‘‘లాక్డౌన్ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అన్నారు సప్తగిరి. -
ఆన్లైన్లో సంగీత పోటీలు
తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్ ఐడల్’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు. మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు. -
పాట ఎక్కడికీ పోదు
‘‘ఏదైనా చక్కటి పాట విన్నప్పుడు దాన్ని ప్రేరణగా తీసుకొని మనదైన స్టయిల్లో ఒక కొత్త ట్యూన్‌ని సిద్ధం చేసుకోవడాన్ని కాపీ కొట్టడం అని అనుకోను. ఒకవేళ మక్కీకి మక్కీ దించేస్తే కాపీయే అంటారు. నేనెప్పుడూ కాపీ కొట్టలేదు. కొట్టను కూడా’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు. ► నేను మందు తాగను. కానీ శేఖర్ రెడ్డి ‘90 ఎం.ఎల్’ చిత్రకథను చెప్పినప్పుడు మందు తాగినంత కిక్ ఎక్కింది. ఎంత బాగా కథ చెప్పాడో అంతే బాగా చిత్రీకరించాడు కూడా. పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఫుల్ మాస్ ఆల్బమ్‌ను రూపొందించాను. ఇందులో ఆరు పాటలుంటాయి. ఒక బిట్ సాంగ్ కూడా ఉంటుంది. ఈ మాస్ సాంగ్స్‌కి కార్తికేయ వేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ► నా హిట్ ఆల్బమ్స్‌లో ఎక్కువగా మెలోడీలు ఉండటంతో మాస్ సినిమాలకు పనిచేసే అవకాశం పెద్దగా రాలేదు అనుకుంటున్నాను. సంగీతం సమకూర్చేప్పుడు సినిమా పెద్దదా, చిన్నదా అనేది పట్టించుకోను. కథానుసారంగా ట్యూన్స్ కంపోజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. స్టార్ హీరోలతో పని చేసేప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటాను. మనం మంచి మ్యూజిక్ ఇచ్చినా కొన్నిసార్లు సినిమాలు సరిగ్గా ఆడకపోవచ్చు. అప్పుడు మన శ్రమ వృథా అవుతుంది. ఆ సమయంలో కొంచెం బాధపడతాను. ► ఈ మధ్య కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు మిస్సయ్యాయి. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. ఎప్పుడేం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు కాబట్టి బాధపడను. ► కొత్త సంగీతం వస్తోంది. ప్రేక్షకులు మ్యూజిక్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పాటలు ఉంటే థియేటర్స్‌కు వస్తున్నారు. మరోవైపు కార్తీ నటించిన ‘ఖైదీ’ లాంటి సినిమా చూసి ‘భవిష్యత్తులో పాటలు లేని సినిమాలే ఉంటే సంగీత దర్శకులకు దెబ్బే’ అని కొందరు అంటున్నారు. భారతీయ సినిమాల్లో నుంచి పాట ఎక్కడికీ పోదు. పాట లేని సినిమా అయినా నేపథ్య సంగీతం కావాలి. అదీ సంగీతదర్శకుడి పనే. మన సినిమాల్లో పాటలు పక్కా ఉండాలని ఓ సందర్భంలో షారుక్ ఖానే అన్నారు. ► ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. -
గ్యాప్ వల్ల మేలే జరిగింది
‘‘నా మ్యూజిక్ గురించి పాజిటివ్ రివ్యూస్‌ను తీసుకున్నప్పుడు నెగటివ్ రివ్యూస్‌ను కూడా తీసుకోవాలి. కెరీర్లో 50కి పైగా సినిమాలు చేశాను. తెలిసో తెలియకో కొన్ని ట్యూన్స్ రిపీటై ఉండొచ్చు. అది ఒకేసారి ఆరుకి పైగా ప్రాజెక్ట్స్‌ను డీల్ చేస్తున్నప్పుడు కలిగిన ఓవర్ స్ట్రెస్ వల్ల కావొచ్చు. కావాలని ఎవరూ ట్యూన్స్‌ను రిపీట్ చేయరు’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీత’. ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రసంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో ‘సీత’ 54వ చిత్రం. ఇందులో ఐదు పాటలు, ఒక బిట్సాంగ్ ఉన్నాయి. ఒక్క కమర్షియల్ సాంగ్ తప్ప మిగతా అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘బుల్రెడ్డి’, ‘నిజమేనా’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే అన్ని పాటలను విడుదల చేస్తాం. ఈ సినిమాకు ఆర్ఆర్ (రీ రికార్డింగ్) చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసినవారు ఆర్ఆర్ బాగుందని అంటున్నారు. ► దర్శకులు తేజగారితో ఇంతకుముందు జై, ధైర్యం సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు ఆయన బ్యాక్ టు బ్యాక్ ‘నేనే రాజు నేనే మంత్రి, సీత’ చిత్రాలకు వర్క్ చేయడం హ్యాపీ. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి భిన్నాభిప్రాయాలు వినిపించి ఉండొచ్చు. కానీ తేజగారితో వర్క్ చేయడం నాకు ఫుల్ కంఫర్ట్‌గా ఉంటుంది. ► లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ ఉన్న చిత్రం ఇది. ఇలాంటి సినిమాను నేను ఇంతవరకు చూడలేదు. హీరో హీరోయిన్లు సాయి, కాజల్‌లతో పాటు విలన్ పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా పెర్ఫార్మ్ చేశాడు. ► అనుకున్నవి జరగకపోవడంతో నా కెరీర్లో చిన్న గ్యాప్ వచ్చింది. ఒక విధంగా ఈ గ్యాప్ నాకు మేలే చేసింది. గత మూడేళ్లలో నాన్‌స్టాప్‌గా వర్క్ చేశాను. సో... ఈ గ్యాప్ టైమ్‌లో కాస్త రిలాక్స్ అయ్యాను. కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇటీవల కన్నడ ‘సీతారామకల్యాణ’ చిత్రానికి సంగీతం అందించాను. అలాగే కన్నడ హీరో గణేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. తెలుగులో కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాకు సంగీత దర్శకుడిగా చేస్తున్నాను. -
పవన్ మాట నిలబెట్టుకున్నాడా?
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయినా సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేయాలని భావించిన పవన్, ఆ తర్వాత మరో దర్శకుడితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. గోపాల గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆ చిత్ర దర్శకుడు డాలీకి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు మరో అవకాశం ఇస్తానంటూ సభాముఖంగా పవన్ చెప్పాడు. ఇప్పుడు తన తాజా చిత్రానికి ఆ ఇద్దరి తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా అనూప్ ను ఎప్పుడో కన్ఫామ్ చేసిన పవన్, ఇటీవలే డాలీని దర్శకుడిగా ఎనౌన్స్ చేశాడు. దాంతో... అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే పవన్ వాళ్లకు చాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. -
ప్రేమకథతో... పడేసావే
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘పడేసావే’, తారాగణం: కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, జహీదా శామ్, విశ్వ, నరేశ్ మాటలు: కిరణ్, పాటలు: అనంత్ శ్రీరామ్ సంగీతం: అనూప్ రూబెన్స్ కళ: పురుషోత్తమ్ స్టంట్స్: వెంకట్ కెమేరా: కన్నా కూనపరెడ్డి ఎడిటింగ్: ధర్మేంద్ర కె నిర్మాణం: అయన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చునియా రిలీజ్: 26 ఫిబ్రవరి ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ‘చండీరాణి’ని రూపొందించడం ద్వారా అరుదైన దక్షిణాది మహిళా డెరైక్టర్‌గా పేరుతెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి - మన భానుమతి. కానీ, అప్పటి నుంచి గడచిన 60 ఏళ్ళ పైచిలుకు కాలంలో తెలుగులో వచ్చిన మహిళా దర్శకులు మాత్రం పట్టుమని పదిమంది కూడా లేరు. చాలాకాలం తరువాత ఇప్పుడు చునియా ఆ జాబితాకెక్కారు. తొలి చిత్రం ‘పడేసావే’తో మన ముందుకు వచ్చారు. కె. రాఘవేంద్రరావు లాంటి ప్రముఖ దర్శకుల దగ్గర సహాయకురాలిగా పనిచేసి, టీవీ సీరియల్స్ దర్శకురాలిగా అనుభవం సంపాదించి, అన్నపూర్ణా స్టూడియోలో నాగార్జునకు కుడిభుజంగా నిలిచిన చరిత్ర చునియాది. అందుకే, నాగ్ సహాయ సహకారాలు పుష్కలంగా అందుకొని, ‘యాన్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్’ అంటూ ఇప్పుడీ ‘పడేసావే’ను తెర మీదకు తెచ్చారు. టైటిల్ సూచిస్తున్నట్లే - ఇదో ప్రేమకథ. కాకపోతే, స్నేహానికీ, ప్రేమకూ మధ్య సాగే కన్ఫ్యూజన్లను ఆధారంగా చేసుకొని అల్లుకున్న ఒక ముక్కోణపు ప్రేమ కథ. కార్తీక్ (కార్తీక్‌రాజు) పనికిరాని వస్తువులతో కళాత్మకంగా బొమ్మలు సృష్టించే జంక్ ఆర్టిస్ట్. తల్లితండ్రులు (నరేశ్, అనితా చౌదరి)లకు ఇష్టం లేకపోయినా, ఆ పని చేస్తుంటాడు. స్నేహితురాలైన ఎదురింటి అమ్మాయి నీహారిక (నిత్యాశెట్టి) హీరోను ప్రేమిస్తుంది. అయితే, హీరో మాత్రం నీహారికకు ఆప్తమిత్రురాలైన స్వాతి (జహీదా శామ్)ని ప్రేమిస్తాడు. సినీ నటి తార (రాశి)కి కూతురైన స్వాతికి వ్యాపారవేత్త అయిన మరో అబ్బాయితో పెళ్ళి కుదురుతుంది. మొదటి గంటలో ఈ వ్యవహారమంతా ఎస్టాబ్లిష్ చేశాక, అక్కడ నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. అప్పటికే పెళ్ళి కుదిరిన స్వాతికి సినీ నటి అయిన తన తల్లి అంటే కోపం. ఆ కోపాన్ని పోగొట్టి, వారిద్దరినీ దగ్గర చేస్తాడు హీరో. ఆ తరువాత ఆమె పెళ్ళి చేసుకోబోతున్న అబ్బాయి మంచివాడు కాదన్నదీ బయటకొస్తుంది. అలా కొన్ని సీన్లతో స్వాతికి హీరో దగ్గరవుతాడు. మనసులో ఆమెకూ హీరో మీద ప్రేమ పుడుతుంది. కానీ, అప్పటికే కుదిరిన పెళ్ళి, ఆప్తమిత్రురాలి స్నేహం, హీరోను తన మిత్రురాలే ప్రేమిస్తుండడం లాంటివన్నీ బంధనాలవుతాయి. మరోపక్క హీరోకూ తనను ప్రేమించే నీహారిక, తాను ప్రేమించే అమ్మాయిల మధ్య ఊగిసలాట. ఈ ముక్కోణపు ప్రేమకథ చివరకు ఎన్ని మలుపులు తిరిగింది? ప్రేమ, స్నేహం మధ్య బంధాలు ఎలా అతలాకుతలమయ్యాయి? హీరో ఇంతకీ ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు? లాంటివన్నీ ఓపికగా చూడాల్సిన మిగతా సినిమా. సీరియల్ తరహా స్క్రీన్‌ప్లేతో ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్విస్ట్‌తో నడిచే ఈ సినిమాలో చాలా సీన్లున్నాయి. ఒకదాని తరువాత మరొకటిగా అవన్నీ వస్తున్నప్పుడు నిడివితో సంబంధం లేకుండా చాలా పెద్ద కథే చెప్పారని అనిపిస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ రాజు కుమారుడైన కార్తీక్ రాజు, ఒకప్పుడు ‘దేవుళ్ళు’లో బాలనటిగా పేరు తెచ్చుకొని, ఇప్పుడు తొలిసారిగా కథానాయిక పాత్ర పోషించిన హైదరాబాద్ అమ్మాయి నిత్యాశెట్టి, అలాగే జహీదా శామ్ - ఈ ముగ్గురూ తమ శక్తి మేరకు నటించారు. వారెవరూ ప్రేక్ష కులకు పెద్దగా పరిచితులు కాకపోవడం సినిమాకు ప్లస్, మైనస్సూ! బాగా చేయడానికి వాళ్ళూ, చేయించడానికీ దర్శకురాలూ బానే శ్రమపడ్డారు. కాక పోతే, దర్శకురాలికీ ఇదే తొలి ప్రయత్నం. ‘దేవుళ్ళు’ మొదలు దాదాపు 20 దాకా సినిమాల్లో బాల నటిగా చేసి, 2 నంది అవార్డులు కూడా అందుకున్న నిత్యాశెట్టి రూపురేఖల్లో కొన్నిసార్లు తొలినాళ్ళ ‘కలర్స్’ స్వాతినిగుర్తు చేస్తారు. యువ కమెడియన్ విశ్వ నుంచి సీనియర్ నరేశ్, ఒకటి రెండు సీన్లలోనే వచ్చే కృష్ణుడు, రెండు సీన్లు - ఒక పాటకు పరిమితమయ్యే అలీ - ఇలా చాలామంది హాస్య నటులను సినిమాలో వినోదం కోసం పెట్టారు. వాళ్ళు కూడా అడపాదడపా నవ్వించారు. కాకపోతే, ఉమన్ డెరైక్టర్ పగ్గాలు పట్టిన ఈ సినిమాలోనూ అలీ గ్యాంగ్‌తో హోటల్ రూమ్‌లో జరిగే ఘట్టం లాంటివి ఉండడం ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఈ సినిమాకు మరో అండ - పేరున్న అనూప్ లాంటి సంగీత దర్శకుడు. కాకపోతే, ఇలా రోజూ వస్తున్న కమర్షియల్ లవ్‌స్టోరీలలో హాలులో నుంచి బయటకొచ్చాక పాటలు గుర్తుండాలని అనుకోకూడదు. సెంటిమెంటల్ గీతం ‘చిట్టితల్లీ చిన్నితల్లీ నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి...’, తల్లీ కూతుళ్ళ మధ్య దూరం లాంటి ఎపిసోడ్లు మహిళల్ని ఆకట్టుకొంటాయని ఆశించాలి. ‘ప్రేమ చెప్పి రాదు... చెప్పినా పోదు’ తరహా పంచ్ డైలాగులు, విశ్లేషణల్ని కూడా ఈ సినిమాలో వీలున్నచోటల్లా పెట్టారు. ఇక, ఇతర సాంకేతిక విభాగాల పనితనం కూడా ఈ పరిమిత బడ్జెట్ ప్రేమకథకు సరిపడేవే. ఇది తొలి సినిమానే కాబట్టి, దర్శకురాలు చునియా నుంచి మరీ అతిగా ఆశించడం పొరపాటు. మొన్నటి వరకు సీరియల్స్‌కు అలవాటుపడిన ఆమె భవిష్యత్తులో రచనా విభాగంపై ఇంకా దృష్టి పెట్టి, మరింత పకడ్బందీ కథ, వేగవంతమైన కథనంతో ముందుకొస్తారని ఆశించవచ్చు. కొత్తవాళ్ళను ప్రోత్సహించాలన్న హీరో నాగార్జున తదితరులలానే ప్రేక్షకులు కూడా సహృదయంతో చూసి, రావాల్సిన సినిమా ‘పడేసావే’. - రెంటాల జయదేవ -
లేడీ డెరైక్టర్స్‌లో ఆ ప్రత్యేకత ఉంది!
‘‘స్టార్స్ సినిమాలకు వర్క్ చేసేటప్పుడు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ, చిన్న సినిమాలకు ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటి అవకాశం ఈ సినిమాతో దొరికింది’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తీక్ రాజు, నిత్యా శెట్టి, సామ్ ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో చునియా నిర్మించిన ‘పడేసావే’కి ఆయన పాటలు స్వరపరిచారు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ‘‘ ‘మనం’ సినిమాతో నాకు నాగార్జున గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన అసోసియేట్ అయిన ‘పడేసావే’ చేయడానికి అది కారణం కాదు. దర్శకురాలు చునియా చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ఒప్పుకున్నాను . ప్రేమ, స్నేహం లాంటి అంశాలను చునియా వైవిధ్యంగా తెర మీద ప్రెజెంట్ చేశారు. డెరైక్షన్ విషయంలో ఆడ అయినా, మగ అయినా ఒకటే. అయితే లేడీ డెరైక్టర్స్‌లో సెన్సిటివిటీ కనబడుతుంది. పాటలు విన్న నాగార్జున గారు ‘చిన్న సినిమా అని కమర్షియల్‌గా ఆలోచించకుండా మంచి ఔట్పుట్ ఇచ్చావ’ని మెచ్చుకున్నారు’’ అని చెప్పారు. ఇటీవల మరణించిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ... ‘‘నా లైఫ్‌లో జరిగిన ప్రతి ఇంటర్వ్యూనూ మా అమ్మ నా పుట్టినరోజు కానుకగా 2015లో ప్రెజెంట్ చేసింది. అదే తన చివరి కానుక అని కలలో కూడా అనుకోలేదు’’ అని అనూప్ ఒకింత బాధగా అన్నారు. -
మగవాళ్లు చూడాల్సిన సినిమా : నాగార్జున
‘‘చునియా దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉంది. అందరి ఆశీస్సులే ఆమెకు పెద్ద అండ. ఈ చిత్రాన్ని ముఖ్యంగా మగవాళ్లు చూడాలి. ఆడవాళ్లను ఎలా ప్రేమలోకి దింపాలో ఇందులో అద్భుతంగా చూపించారు. బాయ్‌ఫ్రెండ్, భర్త నుంచి ఆడవాళ్లు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రలో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడేసావే’. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని నాగార్జున, దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. పాటల సీడీని రాఘవేంద్రరావు ఆవిష్కరించి మాజీ ఎం.పి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఇచ్చారు. ‘‘నేను దర్శకత్వం వహించిన ‘శాంతినివాసం’ సీరియల్లో చునియా- కన్నాను పడేస్తే, సుమ-రాజీవ్ కనకాలను పడేసింది. రాజమౌళి దగ్గర పనిచేయడంతో ప్రేక్షకుల్ని ఎలా పడేయాలో కొంత టెక్నిక్‌ను చునియా నేర్చుకుంది’’ అని రాఘవేంద్రరావు తెలిపారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ‘‘నాగార్జునది లక్కీ హ్యాండ్’’ అన్నారు. -
ఆ భావనే నన్ను నడిపిస్తోంది!
- అనూప్ రూబెన్స్ క్రిస్మస్ నాకు చాలా ఇష్టమైన పండగ. ఇంట్లో వాళ్లతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. కొత్త బట్టలు, కేక్ కట్ చేయడం ఇవన్నీ మామూలే. పండగ అంటే కేవలం సెలబ్రేషన్స్ అని మాత్రమే కాదు. మనమేం చేస్తున్నామనేది కూడా మనం గమనించుకోవాలి. క్రిస్మస్ అంటే గివింగ్ అని నా ఉద్దేశం. అందుకే ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా అనాథ శరణాలయంలో పిల్లల మధ్య కేక్ కట్ చేస్తాను. నాకు సంగీతమంటే ప్రాణం. మతం, భాష అనే తేడా దానికి లేదు. అందుకే ‘మ్యూజిక్ ఈజ్ డివైన్’ అంటారు. నేను ఎన్ని పాటలు చేసినా, దేవుడి కోసం ఒక్క పాట చేస్తే చాలు, అప్పటివరకూ ఉన్న మానసిక ఒత్తిడి దూరమవుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. డివోషనల్ సాంగ్స్‌ను స్వరపరచడంలో ఉండే ఆనందమే వేరు. ‘యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు’ అని బైబిల్లో ఓ వాక్యం ఉంటుంది. ఆ దైవం నాతో ఉన్నాడన్న భావనే నన్ను ప్రతి నిమిషం ముందుకు నడిపిస్తోంది. -
అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!
‘‘ ‘ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నాగాన్వేష్ బాలనటునిగా చేశాడు. సినిమాపై ప్రేమతో చాలా కష్టపడి హీరో అయ్యాడు. ఫైట్స్, డాన్స్‌లు బాగా చేశాడు’’ అని బ్రహ్మానందం అన్నారు. నాగాన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బిగ్ సీడీని ఆవిష్కరించగా, పాటల సీడీలను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విడుదల చేశారు. తలసాని మాట్లాడుతూ -‘‘భారత చిత్రపరిశ్రమకు హైదరాబాద్ త్వరలోనే కేంద్ర బిందువుగా మారుతుంది. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది’’ అన్నారు. నాగాన్వేష్ మాట్లాడుతూ -‘‘ముంబై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నా. ఎంతోమంది పెద్ద హీరోలతో పనిచేసిన రామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
యువత మెచ్చేలా...
‘టిప్పు’ ఫేం సత్యకార్తీక్ హీరోగా, సమీరా కథానాయికగా ఓ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా స్వీయ దర్వకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగార్జున కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్‌నిచ్చారు. చునియా మాట్లాడుతూ-‘‘ యువత మెచ్చే మంచి కథాకథనాలున్న సినిమా ఇది. ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నాం. సీనియర్ నరేశ్, ఇంద్రజ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: రవీందర్. -
సోగ్గాడు బిజీ బిజీ
హీరో నాగార్జున పేరు చెబితే, ఇప్పుడు అందరికీ బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమం గుర్తొస్తోంది. అతి కొద్దిరోజుల్లోనే అందరినీ ఆయనకు అభిమానుల్ని చేసిన టీవీ షో అది. ఒకపక్క ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న నాగార్జున కొద్దికాలం విరామం తరువాత ఇప్పుడు సినిమా షూటింగ్‌లోనూ బిజీగా పాల్గొంటున్నారు. అందరినీ ఆకట్టుకున్న నిరుటి ‘మనం’ తరువాత ఇప్పుడు ఆయన ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే పేరు ప్రచారంలో ఉంది. ప్రతిభావంతులైన కొత్తవాళ్ళను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున అదే పద్ధతి కొనసాగిస్తూ, ఈ చిత్రంతో కల్యాణ్‌కృష్ణ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, పరిసరాల్లో దాదాపు 20 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంది. వచ్చేవారం నుంచి దాదాపు నెల నుంచి నెలన్నర దాకా హైదరాబాద్ పరిసరాల్లోనే తదుపరి షెడ్యూల్ జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు భోగట్టా. ఈ ప్రధానమైన షెడ్యూల్లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారని సమాచారం. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ కథానాయికలు. బ్రహ్మానందం, ఝాన్సీ, హంసానందిని తదితరులు ఇతర తారాగణం. గత ఏడాది కాలంగా మంచి జోరు మీదున్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అన్నట్లు, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక భాగాలను ఇతర రాష్ట్రాలలో చిత్రీకరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట! అందుకోసం తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో కూడా లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది. ఒకప్పటి అక్కినేని హిట్ గీతం పల్లవిలోని మాటలనే పేరుగా పెట్టుకొన్న ఈ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వివరాలు అధికారికంగా త్వరలో తెలుస్తాయి. -
ఆ పాటలను వెంకటేశ్‌తో పాడించా...
‘‘ఒక పాట తయారు చేసే ముందు సన్నివేశాన్నీ, హీరో శారీరక భాషనూ దృష్టిలో పెట్టుకుంటాను. అలాగే, దర్శకుడి అభిరుచికి ప్రాధాన్యం ఇస్తాను. ఫైనల్‌గా నా ఆత్మసంతృప్తి కూడా నాకు ముఖ్యమే’’ అని సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. మనం, లౌక్యం, గోపాల గోపాల... ఇలా వరుస విజయాలతో ‘మోస్ట్ వాంటెడ్’ మ్యూజిక్ డెరైక్టర్ అయ్యారు అనూప్. ఈ సందర్భంగా తన మనోభావాలను పాత్రికేయులతో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘తేజ ‘జై’ నుంచి మొదలుపెట్టి ఈ మధ్య విడుదలైన ‘గోపాల గోపాల’ వరకు ఇప్పటివరకు 37 చిత్రాలకు పాటలు స్వరపరిచాను. రీమేక్ చిత్రాలకు పాటలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటుంది. మాతృకలో ఉన్న ట్యూన్స్‌ని యథాతథంగా చేయాలా? వేరే ఇవ్వాలా? అనే కన్ఫ్యూజన్ ఉంటుంది’’ అని చెప్పారు. ‘మనం’ చిత్రానికి పాటలివ్వడం ఓ గొప్ప అనుభూతి అని చెబుతూ -‘‘ఆ చిత్రం పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ డి. సురేశ్‌బాబుకి నచ్చాయి. అలా ‘గోపాల గోపాల’కు పనిచేసే అవకాశం వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో కీ బోర్డ్ ప్లేయర్‌గా చేశాను. అలాగే, సురేశ్‌బాబుగారి అమ్మాయి పెళ్లికి మొత్తం కుటుంబంతో ‘దగ్గుబాటి..’ పాట చేశాను. ఆ పాటలను వెంకటేశ్‌గారితో కూడా పాడించాను’’ అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘టెంపర్’కి, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి పాటలు స్వరపరుస్తున్నానని అనూప్ చెప్పారు. అనంతరం బీఏ రాజు చేతుల మీదగా ‘అనూప్‌రూబెన్స్‌డాట్‌కామ్’ ఆవిష్కరణ జరిగింది. -
ఆ మాటలే నాకు కనువిప్పు : పవన్ కల్యాణ్
‘‘మేమిద్దరం కలిసి ఎప్పట్నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు కుదిరింది. అది కూడా ఒక మంచి చిత్రం చేయడం ఇంకా ఆనందంగా ఉంది’’ అని వెంకటేశ్, పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కిశోర్‌కుమార్ పార్ధసాని దర్శకత్వంలో వెంకటేశ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో డి. సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మించిన చిత్రం ‘గోపాల గోపాల’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఇందులో నటించడానికి పవన్ అంగీకరించగానే చాలా సంతోషం అనిపించింది’’ అని చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఒకప్పుడు నాకేం అవ్వాలో తెలిసేది కాదు. అమ్మ, అన్నయ్యలు అడిగితే ఏం చెప్పాలో తెలిసేది కాదు. అన్నయ్య కష్టపడి సినిమాలు చేస్తుంటే నేను యోగా, ధ్యానం చేస్తూ, వాటి గురించే అన్నయ్యకు చెప్పేవాణ్ణి. ‘కష్టపడే అన్నయ్య.., వేళకి అన్నంపెట్టే వదిన ఉంటే ఎవరైనా ఇలానే మాట్లాడతారు’ అని అన్నయ్య అన్నారు. ఆ మాటలే నాకు కనువిప్పు అయ్యాయి. దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి.. అలాగని బాధ్యతలను విస్మరించకూడదని తెలుసుకున్నాను. ఆరోజు అన్నయ్యగారు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుని, తుది శ్వాస వరకు కష్టపడతాను. ‘ఖుషీ’ టైమ్‌లో ‘అన్నా ఒక్క హిట్ ఇవ్వు అన్నా.. రోడ్ల మీద తిరగలేకపోతున్నాం. చచ్చిపోతున్నాం’ అని అభిమానులు అడిగేవాళ్లు. ఆ ప్రేమకు కదిలిపోయేవాణ్ణి. నేను నాకోసం ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు. కానీ, మొట్టమొదటిసారి ‘ఒక్క హిట్ ఇవ్వు. సినిమాల నుంచి వెళ్లిపోతా’ అని కోరాను. హిట్ ఇచ్చాడు. సినిమాల నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ‘ఖుషి’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఎందుకో... రానున్న రోజులన్నీ నాకు కష్టాలే అనే భావన కలిగింది. ఆ వెంటనే.. ఇంకోటి కూడా అనిపించింది. ఏం చేయాలో తెలియక, నా స్నేహితుడు ఆనంద్‌సాయితో కలిసి శ్రీశైలం పారిపోవాలనుకున్న నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసి, ఇంతమంది అభిమానం పొందేలా చేసిన ఆ భగవంతుడు చూసుకుంటాడనుకున్నాను. జయాపజయాలు రెండూ ఆ భగవంతుడి చేతుల్లో ఉన్నాయి. నా చేతుల్లో ఉన్నది శ్రమ, కృషి. ఆ రెంటినీ బాగా చేస్తాను. సినిమాల్లోకి రాకముందే నాకు వెంకటేశ్‌గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన్ను సోదరుడిలా భావిస్తాను. నేను మామూలుగా ఎవరి ఇంటికీ వెళ్లను. కానీ, వెంకటేశ్‌గారి ఇంటికే వెళతాను. సినిమాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను కలిసే వ్యక్తి వెంకటేశ్‌గారు . మేం ఇద్దరం కలిస్తే, సినిమాల గురించి తక్కువ మాట్లాడతాం. ఆధ్యాత్మికత గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. బహుశా అదే మా ఇద్దరితో ఈ సినిమా చేయించిందేమో’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం కూడా పాల్గొన్నారు. -
ఆన్లైన్లో ‘భజే.. భజే’ గోపాలం!
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘గోపాల... గోపాల’ రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. వెంకటేశ్‌ను అపర అర్జునుడి లాగా, పవన్ కల్యాణ్‌ను అపర శ్రీకృష్ణావతారంగా రథంపై చూపుతున్న స్టిల్ అందుకు తాజా చేరిక. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలోని ‘భజే భజే...’ అనే పండగ గీతాన్ని ‘లహరి మ్యూజిక్’ సంస్థ జనవరి 1వ తేదీ సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ బాణీలో అనంత శ్రీరామ్ సాహిత్యానికి, యువ గాయకుడు హరిచరణ్ గానం చేసిన ఈ పాటను తెర మీద కూడా అందంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాల కథనం. కొన్ని వందల మంది డ్యాన్సర్ల మధ్య ఈ పాటకు నర్తించిన పవన్ ఈ పాటను ఆస్వాదించడమే కాక, సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా ఫోన్ చేసి, అభినందించారట! మరి, పవన్‌ను అంతగా ఆకట్టుకున్న ఈ పాట రేపు ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తుందో వేచి చూడాలి. ఆ లోగా... అధికారికంగా పాటల సీడీని ఆవిష్కరించక ముందే, కీలకమైన పాటల్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచి, ప్రేక్షకులను ఆకర్షించేలా ‘గోపాల గోపాల’ బృందం మార్కెటింగ్ వ్యూహచతురత చూపుతోంది. తాజా కబురు ఏంటంటే... పవన్‌కల్యాణ్ అధికారికంగా ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. పవన్ అభిమానులకు కొత్త సంవత్సరంలో నిజంగా తీపి వార్తే! -
నిజంగా నా అదృష్టం!
‘‘‘తొలిప్రేమ’ సినిమా చూసిన తర్వాతే హీరో కావాలనే కోరిక నాలో మొదలైంది. ఇప్పుడు ఏకంగా కరుణాకరన్‌గారి దర్శకత్వంలోనే నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. అనూప్ రూబెన్స్ మళ్లీ నాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఇది పూర్తిగా కరుణాకరన్ మార్క్ సినిమా’’ అని హీరో నితిన్ అన్నారు. ఆయన కథానాయకునిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఎన్.సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘చిన్నదాన నీ కోసం’. విక్రమ్‌గౌడ్ ఈ చిత్రానికి సమర్పకుడు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అక్కినేని నాగార్జున, వీవీ వినాయక్, దిల్ రాజు, బెల్లంకొండ సురేశ్, విక్రమ్ కె. కుమార్, ఏషియన్ ఫిలింస్ నారాయణ్‌దాస్, నందినీరెడ్డి, విక్రమ్‌కుమార్ కొండా, గుత్తా జ్వాల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఆడియో సీడీని వినాయక్ ఆవిష్కరించి, నారాయణ్దాస్కు ఇచ్చారు. విక్రమ్ లాంటి మంచి దర్శకుణ్ణి తమకు పరిచయం చేసిన సుధాకరరెడ్డికి కృతజ్ఞతలనీ, సుధాకరరెడ్డితో కలిసి త్వరలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నామనీ, కరుణాకరన్ గత చిత్రాల కంటే గొప్ప విజయాన్ని ఈ సినిమా అందుకోవాలనీ హీరో నాగార్జున అన్నారు. నితిన్‌తో కరుణాకరన్ చేస్తున్న ఈ సినిమా ‘తొలిప్రేమ’కంటే పెద్ద హిట్ కావాలని వినాయక్ అభిలషించారు. అన్నయ్య పవర్‌స్టార్‌తో ‘తొలిప్రేమ’ తీశాననీ, ఇప్పుడు తమ్ముడితో చేసిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనీ కరుణాకరన్ నమ్మకం వెలిబుచ్చారు. తన సంస్థలో ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుందని నిర్మాత నిఖితారెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం బావుంటుందని అనూప్ రూబెన్స్ చెప్పారు. - నితిన్ -
మరో ప్రేమకథతో...
ప్రేమకథల వైపు అడుగులేయడం నితిన్ ఎప్పుడు మొదలుపెట్టారో... అప్పట్నుంచి ఆయన్ను విజయాలు వరించడం మొదలుపెట్టాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్... విజయాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న మరో ప్రేమకథ ‘చిన్నదాన నీ కోసం’. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి మాట్లాడుతూ-‘‘కరుణాకరన్ మార్క్ స్టోరీ ఇది. నితిన్ గత విజయాలకు దీటుగా ఈ సినిమా ఉంటుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ నెల 27న పాటల్నీ, డిసెంబర్ 19న సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మిస్తీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఐ.ఆండ్రూ, సమర్పణ: విక్రమ్ గౌడ్. -
సినిమా రివ్యూ: ఒక లైలా కోసం
నటీనటులు: నాగ చైతన్య, పూజా హెగ్డే, సుమన్, షియాజీ షిండే, చలపతిరావు తదితరులు.. సంగీతం: అనూప్ రూబెన్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: విజయ్ కుమార్ కొండా కథ.. కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో టాప్ ర్యాంకర్. చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. కాని నంద న, కార్తీక్‌ల తల్లి తండ్రులు వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. తల్లితండ్రులను బాధపెట్టడం ఇష్టంలేని నందూ పెళ్లికి ఒప్పుకున్నప్పటికి.. కార్తీక్‌ను ద్వేషించడం మాత్రం మానదు. చివరికి కార్తీక్ ప్రేమకు నందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నందన మనసును కార్తీక్ ఎలా గెలుచుకున్నాడు, కార్తీక్‌ను ద్వేషించడానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరమీద చూడాల్సిందే. ఆకట్టుకునే అంశాలు: నాగచైతన్య, పూజా హెగ్డే ఫెర్ఫార్మెన్స్ ఫోటోగ్రఫి ఆలీ కామెడీ రీరికార్డింగ్ నిరాశపరిచే అంశాలు: రోటిన్కథ, ఆకట్టుకోలేని కథనం దర్శకత్వం పాటలు డైలాగ్స్ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే.. నందన ప్రేమకు కోసం తపన పడే ప్రేమికుడిగా కార్తీక్ పాత్రలో నాగచైతన్య పర్వాలేదనిపించారు. ఫెర్ఫార్మెన్స్ విషయంలో గతంలో కంటే కొంత మెరుగ్గా కనిపించినప్పటికి.. ఇంకా మెచ్యురిటీని సాధించాల్సిన అవసరం ఉంది. ఈ చిత్ర విజయ భారం మొత్తం నాగచైతన్య తన మీద వేసుకున్నారు. నందన పాత్రలో పూజా హెగ్డే గ్లామర్‌తో ఆకట్టుకుంది. నందన పాత్రలో పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్నప్పటికి.. పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనే అనిపించింది. మిగితా పాత్రలన్నింటినిలోనూ కొత్తదనం కనిపించకపోగా తెరమీద పరమ రోటిన్‌గానే కనిపిస్తాయి. ఈ చిత్రంలో ఆలీ కామెడీ కొంత ఊరట కలిగించే విధంగా ఉంటుంది. సాంకేతిక విభాగాల పనితీరు: ఓ లవ్ స్టోరికి సరిపడే ఫీల్‌ను కలిగించడానికి తన ఫోటోగ్రఫి ద్వారా ఐ ఆండ్రూ శాయశక్తులా ప్రయత్నించాడు. నాగచైతన్య, పూజా హెగ్డేలను గ్లామర్‌గా తెర మీద చూపించడంలో అండ్రూ సఫలయ్యారు. పేలవమైన కథనాన్ని కనిపించకుండా తన ఫోట్రోగ్రఫి ద్వారా అండ్రూ మేనేజ్ చేశాడని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనూప్ రూబెన్స్ ఆకట్టుకున్నా.. పాటలు మాత్రం ఆలరించలేకపోయాయి. అద్నాన్ సమీ పాడిన ‘ఓ చెలి నువ్వే నా..’ బాగుంది. ఒక లైలా కోసం పాట తెరమీద ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో కంటెంట్ లేని సీన్లు ఎక్కువగానే కనిపించాయి. ఎడిటర్ ప్రవీణ్ పుడి పూర్తి స్థాయిలో తన ప్రతిభకు పని పెట్టాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. చివరగా.. ఎన్నుకున్న కథలో పస లేకపోవడంతో తొలి భాగ ం నిస్సారంగా సాగుతుంది. మధ్య మధ్యలో ఆలీ కామెడీ మెనేజ్ చేసేందుకు ప్రయత్నించారు. పూజా హెగ్డే ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరణ దర్శకుడి టేస్ట్ కు అద్దం పడుతుంది. కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలను చిత్రీకరించడంలో దర్శకుడి నైపుణ్యం కనిపించింది. అయితే కథనంలో వేగం లేకపోవడం.. సాధారణ ప్రేక్షకుడు సైతం ఊహించగలిగే క్లైమాక్స్ ఉన్నప్పటికి.. ఓ మంచి ఫీల్‌తో ముగించలేకపోవడం లాంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. ‘స్టార్’ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆతర్వాత అదే ఊపును దర్శకుడు కొనసాగించలేపోయారు. రొటిన్ కథ, రెగ్యులర్ కథనానికి డైలాగ్స్ కూడా బలంగా మారలేకపోయాయి. ‘గుండె జారి గల్లంతయిందే’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయారని చెప్పవచ్చు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు బీ,సీ సెంటర్ల ప్రేక్షకులు ‘ఒక లైలా..’తో కనెక్ట్ అవ్వడంపైనే భారీ విజయం అధారపడి ఉంది. --రాజబాబు అనుముల -
ఒక లైలా కోసం ఆడియో సక్సెస్ మీట్
-
లక్ష్యం కోసం లౌక్యం
‘‘కృష్ణుడి బుద్ధిబలం, కర్ణుడి గుండెబలం, భీముడి కండబలం... ఈ మూడూ ఒక్కడిలోనే ఉంటే వాడెలా ఉంటాడో, ‘లౌక్యం’లో గోపీచంద్ అలా ఉంటాడు. సందర్భానుసారం స్పందించడం ఇందులో గోపీచంద్ పాత్ర ప్రత్యేకత. ఆ స్పందించే తీరులోని విభిన్న అంశాలే ఈ చిత్రానికి హైలైట్స్’’ అంటున్నారు దర్శకుడు శ్రీవాస్. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర దశలో ఉంది. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘గోపీచంద్‌లోని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో యాక్షన్ అబ్బురపరిచేలా ఉంటుంది. క్లాస్, మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అనూప్ రూబెన్స్ మంచి పాటలు ఇచ్చారు. వచ్చేవారం పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్‌పై స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించిన మూడు పాటలతో షూటింగ్ పూర్తయిందని, గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం’ చిత్రాన్ని మించే విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, కథనం: కోన వెంకట్, గోపీమోహన్, కెమెరా: వెట్రి, కూర్పు: శేఖర్. -
ఒక లైలాకోసం మూవీ సాంగ్ లాంచ్
-
తెలుగులోకొచ్చిన లీలాధరుడు
అత్యుత్తమస్థాయి నటులు మాత్రమే చేయగలిగే పాత్రలు కొన్ని ఉంటాయి. అలాంటి పాత్రే... హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’లో మిథున్ చక్రవర్తి పోషించిన లీలాధర్ స్వామి పాత్ర. శారీరక కదలికల్లో ఓ విధమైన ఆడతనం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడేమో అనిపించేంత ఆడంబరం కనిపిస్తుంది ఆ పాత్రలో. చూపులకు దైవత్వం, అంతర్లీనంగా కన్నింగ్ నేచర్, చిత్రమైన సంభాషణా చాతుర్యం... ఇన్ని ప్రత్యేకలుండే పాత్ర అది. ఆ పాత్రను మిథున్చక్రవర్తి అనితర సాధ్యంగా పోషించారంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అందుకే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్ ‘గోపాల గోపాలా’లో కూడా లీలాధర స్వామి పాత్రకు మిథున్ చక్రవర్తినే తీసుకున్నారు దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ). మాతృకలో పోషించిన పాత్రనే మళ్లీ చేయాలని అడగడంతో, అంగీకారం తెలుపడానికి కాస్త తటపటాయించారట మిథున్. కానీ చిత్ర యూనిట్ కమిట్మెంట్ చూసి, ఆ పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ లాంటి సూపర్స్టార్లు కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో మిథున్చక్రవర్తిలాంటి నటి సూపర్‌స్టార్ తోడవ్వడంతో ‘గోపాల గోపాలా’కు మరింత శోభ చేకూరిందని చెప్పాలి. గురువారం మిథున్చక్రవర్తి ఈ సినిమా షూటింగ్‌లోకి ప్రవేశించారు. మిథున్ ఇందులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతారట. ఇందుకోసం తెలుగు భాషను శ్రద్ధగా నేర్చుకుంటున్నారాయన. సెట్లో కూడా అందరితో తెలుగులోనే మాట్లాడుతున్నారట. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రియ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ: భవేష్ మండాలియా, ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్.