అనూప్ రూబెన్స్
‘‘నా మ్యూజిక్ గురించి పాజిటివ్ రివ్యూస్‌ను తీసుకున్నప్పుడు నెగటివ్ రివ్యూస్‌ను కూడా తీసుకోవాలి. కెరీర్‌లో 50కి పైగా సినిమాలు చేశాను. తెలిసో తెలియకో కొన్ని ట్యూన్స్ రిపీటై ఉండొచ్చు. అది ఒకేసారి ఆరుకి పైగా ప్రాజెక్ట్స్‌ను డీల్ చేస్తున్నప్పుడు కలిగిన ఓవర్ స్ట్రెస్ వల్ల కావొచ్చు. కావాలని ఎవరూ ట్యూన్స్‌ను రిపీట్ చేయరు’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీత’. ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రసంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు.
► నా కెరీర్‌లో ‘సీత’ 54వ చిత్రం. ఇందులో ఐదు పాటలు, ఒక బిట్‌సాంగ్ ఉన్నాయి. ఒక్క కమర్షియల్ సాంగ్ తప్ప మిగతా అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘బుల్‌రెడ్డి’, ‘నిజమేనా’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే అన్ని పాటలను విడుదల చేస్తాం. ఈ సినిమాకు ఆర్‌ఆర్ (రీ రికార్డింగ్) చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసినవారు ఆర్‌ఆర్ బాగుందని అంటున్నారు.
► దర్శకులు తేజగారితో ఇంతకుముందు జై, ధైర్యం సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు ఆయన బ్యాక్ టు బ్యాక్ ‘నేనే రాజు నేనే మంత్రి, సీత’ చిత్రాలకు వర్క్ చేయడం హ్యాపీ. ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి భిన్నాభిప్రాయాలు వినిపించి ఉండొచ్చు. కానీ తేజగారితో వర్క్ చేయడం నాకు ఫుల్ కంఫర్ట్‌గా ఉంటుంది.
► లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ ఉన్న చిత్రం ఇది. ఇలాంటి సినిమాను నేను ఇంతవరకు చూడలేదు. హీరో హీరోయిన్లు సాయి, కాజల్‌లతో పాటు విలన్ పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా పెర్ఫార్మ్ చేశాడు.
► అనుకున్నవి జరగకపోవడంతో నా కెరీర్‌లో చిన్న గ్యాప్ వచ్చింది. ఒక విధంగా ఈ గ్యాప్ నాకు మేలే చేసింది. గత మూడేళ్లలో నాన్‌స్టాప్‌గా వర్క్ చేశాను. సో... ఈ గ్యాప్ టైమ్‌లో కాస్త రిలాక్స్ అయ్యాను. కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇటీవల కన్నడ ‘సీతారామకల్యాణ’ చిత్రానికి సంగీతం అందించాను. అలాగే కన్నడ హీరో గణేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. తెలుగులో కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాకు సంగీత దర్శకుడిగా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment