నిజంగా నా అదృష్టం! | Nagarjuna to unveil Chinnadana Nee Kosam's audio | Sakshi
Sakshi News home page

నిజంగా నా అదృష్టం!

Nov 29 2014 1:03 AM | Updated on Jul 12 2019 4:40 PM

నిజంగా నా అదృష్టం! - Sakshi

నిజంగా నా అదృష్టం!

‘తొలిప్రేమ’ సినిమా చూసిన తర్వాతే హీరో కావాలనే కోరిక నాలో మొదలైంది. ఇప్పుడు ఏకంగా కరుణాకరన్‌గారి దర్శకత్వంలోనే నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.

‘‘‘తొలిప్రేమ’ సినిమా చూసిన తర్వాతే హీరో కావాలనే కోరిక నాలో మొదలైంది. ఇప్పుడు ఏకంగా కరుణాకరన్‌గారి దర్శకత్వంలోనే నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. అనూప్ రూబెన్స్ మళ్లీ నాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఇది పూర్తిగా కరుణాకరన్ మార్క్ సినిమా’’ అని హీరో నితిన్ అన్నారు. ఆయన కథానాయకునిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఎన్.సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘చిన్నదాన నీ కోసం’. విక్రమ్‌గౌడ్ ఈ చిత్రానికి సమర్పకుడు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అక్కినేని నాగార్జున, వీవీ వినాయక్, దిల్ రాజు, బెల్లంకొండ సురేశ్, విక్రమ్ కె. కుమార్, ఏషియన్ ఫిలింస్ నారాయణ్‌దాస్, నందినీరెడ్డి, విక్రమ్‌కుమార్ కొండా, గుత్తా జ్వాల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.

ఆడియో సీడీని వినాయక్ ఆవిష్కరించి, నారాయణ్‌దాస్‌కు ఇచ్చారు. విక్రమ్ లాంటి మంచి దర్శకుణ్ణి తమకు పరిచయం చేసిన సుధాకరరెడ్డికి కృతజ్ఞతలనీ, సుధాకరరెడ్డితో కలిసి త్వరలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నామనీ, కరుణాకరన్ గత చిత్రాల కంటే గొప్ప విజయాన్ని ఈ సినిమా అందుకోవాలనీ హీరో నాగార్జున అన్నారు. నితిన్‌తో కరుణాకరన్ చేస్తున్న ఈ సినిమా ‘తొలిప్రేమ’కంటే పెద్ద హిట్ కావాలని వినాయక్ అభిలషించారు. అన్నయ్య పవర్‌స్టార్‌తో ‘తొలిప్రేమ’ తీశాననీ, ఇప్పుడు తమ్ముడితో చేసిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనీ కరుణాకరన్ నమ్మకం వెలిబుచ్చారు. తన సంస్థలో ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుందని నిర్మాత నిఖితారెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం బావుంటుందని అనూప్ రూబెన్స్ చెప్పారు.
- నితిన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement