అయామ్ వెరీ సారీ : చార్మి | I'm very sorry puri says Charmi | Sakshi
Sakshi News home page

అయామ్ వెరీ సారీ : చార్మి

Published Mon, Jun 15 2015 11:17 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

అయామ్ వెరీ సారీ : చార్మి - Sakshi

అయామ్ వెరీ సారీ : చార్మి

 గడచిన పదిహేను రోజులుగా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి జంట ఫిలింనగర్‌లో హాట్ టాపిక్. పూరి దర్శకత్వంలో చార్మి నటించి, ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘జ్యోతిలక్ష్మి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత నితిన్ హీరోగా పూరి ఓ చిత్రం చేయాల్సి ఉంది. కానీ, ఆ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు నితిన్, ఆ కథను వేరే హీరోతో తెరకెక్కిస్తున్నట్లు పూరి  ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్నట్లుండి హీరో ఎందుకు మారినట్లు? ఈ మార్పుకు ప్రధాన కారణం చార్మి అని ఫిలింనగర్‌లో మాట్లాడుకుంటున్నారు. చిత్రనిర్మాణం విషయంలో చార్మి జోక్యం నచ్చకనే నితిన్ తప్పుకున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
 
 ఆ ఊహాగానాలు నిజం కాదని, ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే ఆ ప్రాజెక్ట్ నుంచి నితిన్ వాళ్లు తప్పుకున్నారని చార్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మార్పుకు తాను ఏమాత్రం కారణం కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. కాగా, నితిన్‌వాళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటూ చార్మి పేర్కొనడం సంచలనం రేపింది. ఇది నిజమేనా? అన్న చర్చ మొదలైంది. దాంతో, చివరకు సోమవారం మధ్యాహ్నం చార్మి వివరణ ఇచ్చుకొని, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
 
 ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిందో నాకు తెలీదు!
 ‘‘వాస్తవానికి పూరి, నితిన్‌ల సినిమా ఎందుకు ఆగిందనే విషయం నాకూ స్పష్టంగా తెలియదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎవరో చెబితే, అది నిజమనుకుని ఇంటర్వ్యూలో చెప్పాను. నిజమో, కాదో చెక్ చేసుకోకుండా అలా చెప్పినందుకు, సిన్సియర్‌గా క్షమాపణ చెబుతున్నా’’ అని తన ట్విట్టర్‌లో చార్మి ట్వీట్ చేశారు. ఈ సంగతలా ఉంచితే.. తనలో మంచి నిర్మాత ఉందని పూరి, సి. కల్యాణ్ గుర్తించడం కొంతమంది పురుషాహంకారులు జీర్ణించుకోలేకపోతున్నారని చార్మి అంటున్నారు.
 
 ఈ మధ్యకాలంలో పూరి, చార్మి చాలా చనువుగా ఉంటున్నారని వస్తున్న గుసగుసలపై వివరణ ఇస్తూ, ‘‘పూరి, నేను మంచి స్నేహితులం. అంతకు మించి ఏమీ లేదు’’ అని అన్నారామె. ‘‘కలిసి సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువసార్లు కలుస్తుంటాం. అది వృత్తిలో భాగం. దాన్ని వక్రీకరించవద్దు’’ అని చార్మి పేర్కొన్నారు. ఎవరేమనుకున్నా, సినీ నిర్మాణ రంగంలో కొనసా గాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. హిందీ రంగానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘జ్యోతిలక్ష్మీ’ పునర్నిర్మాణ హక్కుల కోసం సంప్రతిస్తోందని ఆమె చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement