అనిల్, సంజీవ్ మరియు దివ్య ఓ ఫ్యాన్ కంపెనీ స్థాపించి మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో జత కలిసి మరింత ముందుకు వెళ్తున్నారు. ఆయన కూడా ఒక ఇన్వెస్టర్‌గా మారి సదరు ఫ్యాన్స్ కంపెనీ టీమ్‌తో చేతులు కలిపారు. ఈ కంపెనీ ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయినందున అనూప్ రూబెన్స్, సదరు ఫ్యాన్స్ యజమానులు శనివారం నాడు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ "అనిల్ నాకు మంచి మిత్రుడు. సంవత్సర కాలం క్రితం ఇతడు ఈ ఫ్యాన్స్ కంపెనీని ప్రారంభించాడు. మంచి విజయాన్ని అందుకున్నాడు. నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని మన జీవితంలో ఫ్యాన్స్ చాలా ముఖ్యం, ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది. వీళ్లు తయారు చేసిన ఫ్యాన్ వల్ల 65 % కరెంటు ఆదా అవుతుంది. రివర్స్ ఫీచర్ ఉంది. త్వరలో మార్కెట్లో మా ఫ్యాన్ పేరు కూడా టాప్ లిస్ట్‌లో ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్ర, కర్ణాటకలోనే లభిస్తున్నాయి. త్వరలో తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాలలో లభిస్తాయి. ఈ ఫ్యాన్స్ కంపెనీలో నేను పార్టనర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది'" అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment